Sunday, December 19, 2010

అంజుర పళ్ళు ఒడిని నించరే (హారతి పాట)










అలరు గంధం పునుగు, జవ్వది అత్తరు మెడ పుయ్యరే
కలరు ఖర్జుర నారికేళ కాంతకు ఒడిని నించరే ||

మామ దశరథుడు పంపినాడు మామిడి పళ్ళుఒడిని నించరే!
అత్త కౌసల్య పంపినట్టి అంజురపళ్ళు ఒడిని నించరే ''అలరు'' ||

కైక, సుమిత్రలిచ్చినారు వేయి ఫలములను;
వదిన శాంతమ తెచ్చినవి దోస పళ్ళు ఒడిని నించరే ||

మరిది లక్ష్మణుడు పంపినట్టి మల్లెపూలు జడను ముడువారే!
రామ చంద్రుల రవ్వల పతకము రమణికి మెడనేయరే ''అలరు''||

మంగళ హారతి పాటలు
( mangaLa haarati paaTalu)

No comments:

Post a Comment