Tuesday, December 14, 2010

కోకిల కుహు కుహూ రాగాలు


రసాల శాఖపై కోయిల
ఈయవమ్మ మధు గానం ||

గాలి తరగపై వెలిసిన ;
సరస సంగీత రేఖ
సప్త స్వరముల వేదిక
షడ్జమ శ్రీ శీర్షిక ; ||

బోధ గురువు నీ గానము
రాగ మార్గ సూచిక
కుహు కుహూ సాగగా
వనము సుహృల్లేఖ ||

@@@@@@@@@

No comments:

Post a Comment