Thursday, December 30, 2010

పుస్తక కళా వైభవాలు-Magic Art

















అఖిల వనిత ప్రేక్షకులకు మళ్ళీ స్వాగతము! సుస్వాగతము!
ఇదివరకు ఇచ్చిన అంశమే!
అంటే ఈ మన బ్లాగులో
Tues day 2010 , 28 తేదీనాడు ప్రచురించిన
నా వ్యాసానికి 2 వ part అన్న మాట!
ఈ కొత్త ఫొటోలోని పుస్తక కళా వైభవాలను తిలకించి,
మెళకువలను గ్రహించండి, సరేనా!!

బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.
ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.
ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.
మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.
వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,
గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,
ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.
See here, learn ART!

Happy New Year 2o11

వర్ష ధారలు చెమ్మ చెక్కలు





మొయిలు సానల పైన
వాన గంధాలు;
తొలకరుల రాణులకు
కడు హర్షము

ఋతు తరుణి శ్వాసలు
సౌగంధ భరితములు
కారు మబ్బులు ఆడు
ఒప్పులా కుప్పలు.
వర్ష ధారలు ఆడు
చెమ్మ చెక్కల్లు;

మాయ ఇది ఏమిటోను?!



















శేష తల్పము వీడి వ్రేపల్లెలోన
శ్రీ కృష్ణ మూర్తిగా వెలిసినాడోయమ్మా!
ధరణి హర్షము నిండెనే! – చెలియరో! –
ధరణి హర్షము నిండెనే! ||

అరుణాధరములన్ వర వేణువూదేను
తరుణ తమకమ్మాయె మలయ మారుతములకు
రాగ నాట్యాలాడెనే – అను రాగ నాట్యాలాడెనే
మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!
మాయ ఇది ఏమిటోను?! ||

తన నీల వేణిలో నెమలి కన్నులు ఊగె
కను గొన్న నింగికి తార కన్నులు కోటి/తోటి
తనివి తీరా – నీల మోహనుని చూచేను;
మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!
మాయ ఇది ఏమిటోను?! – ||

కెంపు – లే(త)పాణిలో నవనీత ముద్దలను
“నా బొమ్మలవి “ అనుచు – తనివార కాంచేను; -
పౌర్ణిమా జాబిల్లి ,ఇంపు కులుకుల సాగెనే!
మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!

Tuesday, December 28, 2010

folding Art తమాషా (Origamy)


















బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.
ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.
ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.
మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.
వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,
గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,
ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.
See here, learn ART!


శృతి సిరి బోణీ నీవె మయూరీ!




















నెమలీ! నెమలీ! రావే! రావే!
రాజ హంసకు సరి జోడీ!
కచ్ఛపి వీణియ రాగమ్ములకు
శృతి సిరి బోణీ నీవె మయూరీ! ||

వసి వాడి, వత్తలౌ జన మానసములు;
నందన వనులై విరియ బూయును
విప్పిన నీ పురి, యమున తరగలు
చెమ్మ చెక్కలు ఆడుచుండును ||

బులిపించుట నీకు సంబరమ్ములే!
మయూరి పింఛము కనుల నింపుకొన
రేయి, పగలుగా ప్రతి నిత్యం
ఒప్పుల కుప్పలు తిరుగు అంబరం! ||

Sunday, December 19, 2010

అంజుర పళ్ళు ఒడిని నించరే (హారతి పాట)










అలరు గంధం పునుగు, జవ్వది అత్తరు మెడ పుయ్యరే
కలరు ఖర్జుర నారికేళ కాంతకు ఒడిని నించరే ||

మామ దశరథుడు పంపినాడు మామిడి పళ్ళుఒడిని నించరే!
అత్త కౌసల్య పంపినట్టి అంజురపళ్ళు ఒడిని నించరే ''అలరు'' ||

కైక, సుమిత్రలిచ్చినారు వేయి ఫలములను;
వదిన శాంతమ తెచ్చినవి దోస పళ్ళు ఒడిని నించరే ||

మరిది లక్ష్మణుడు పంపినట్టి మల్లెపూలు జడను ముడువారే!
రామ చంద్రుల రవ్వల పతకము రమణికి మెడనేయరే ''అలరు''||

మంగళ హారతి పాటలు
( mangaLa haarati paaTalu)

గోవిందా, హరి గోవిందా! గోకుల నందన గోవిందా!













శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా





















నందనందన గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్దనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్దకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్భాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙగదాధర గోవిందా
విరజాతీర్థస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గొవిందా
గోకులనందన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివరణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్న కిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గొవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఇహపరదయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శేష శాయిని గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

పద్మాలయ అర్చనలు











సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన విభవని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాపహరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే!

ఈ ప్రాచీన శ్లోక భావము
____________

నళినాక్షీ! నిన్ను తలచి చేసిన పూజలు
సంపదలను కల్గించును,
సకలేంద్రియాలకు సంతోషదాయకములు.
సామ్రాజ్య దాయినిలు.
ఇట్టి శక్తి గల మాన్య శ్రీ లక్ష్మీ దేవీ!
నీకు ఎపుడూ వందనములు.

padmaalaya archanalu

saMpatkaraaNi sakalEMdriya naMdanaani
saamraajya daana viBavani sarOruhaakshi
tvadvaMdanaani duritaapaharaNOdyataani
maamEva maata raniSaM kalayaMtu maanyE!

I prAchIna SlOka BAvamu ;
_______________
naLinAkshI! ninnu talachi chEsina pUjalu
saMpadalanu kalgiMchunu,
sakalEMdriyaalaku saMtOshadaayakamulu.
saamraajya daayinilu.
iTTi Sakti gala maanya SrI lakshmI dEvI!
nIku epuDuu vaMdanamulu.
padmaalaya archanalu ;

Friday, December 17, 2010

కాటుక కను దోయికి కానుక

















కాటుక, కాజల్ , అంజనము, నేత్రాంజనము,
మస్కారా, ఐ లైనర్స్ (Eye liners,Powder (also known as surma),
Paste, liquid, stick & pencil. ) వగైరాలు
కాటుకకు అనేక పేర్లు ఉన్నవి. ప్రాచీన కాలం నుండీ
భారత దేశంలో కుటుంబీకులే తమ తమ ఇళ్ళలో తయారు చేసుకుని వాడేవారు.
ఆయుర్వేద సాంప్రదాయక పద్ధతులు కొన్ని నేటికీ అనుసరించబడుతూనే ఉన్నాయీ అంటే
వాటి గొప్పదనమును ఇట్టే అర్ధం చేసుకొనవచ్చును.













ఆఫ్రికా లో kohl అని పిలుస్తారు.
ఆవనూనె, బాదం నూనె, ఆముదము,
వెన్న, నెయ్యి , కర్పూరము వగైరా దినుసులు వి
విధ సీమలలో తయారీకై ఉపయుక్తములౌతున్నాయి.
Indiaలో దేవళములలో దేవీ, దేవతామూర్తులకు, దేవుని కనులకు
కాటుకను, లలాట ఫలకముపై తిలకమునూ, కుంకుమనూ
అలాగే హనుమాన్ విగ్రహాలకు సింధూరమును, అలంకరించుట
సత్సంప్రదాయ అనుసరణగా ఉంటున్నది.















కాటుకను తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి.
అవి అన్నీ కొంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ, మూల సూత్రం ఒకటే!
కళ్ళకు మేలు చేసే దినుసులతో మసిని తయారు చేయడమే !
(కొందరు మేక పాలు, ఆవు పాలు , బాదం పప్పు,
గంధము పొడి, మున్నగు పదార్థాలతో చేస్తూంటారు.)
ఆ యా విధానాలకు మౌలికమైన పునాది అన్న మాట.
సారి ఒక పద్ధతిని గమనించుదాము.
కాటుక కను దోయికి కానుక.
కాజల్, సుర్మా, అంజనం ఇత్యాదిగా వివిధ రూపాంతరాలతో
భారత దేశములో కాటుక తయారీ విరివిగా ఉత్పత్తి ఔతూ,
గృహిణులకు వంటతో సమానంగా తెలిసిన విద్య అని
ఘంటా పథంగా చెప్పవచ్చును.
ఆధునిక కాలంలో యువతులతో పాటు యువకులు కూడా
నేత్రాలంకారాలను ఆసక్తితో చేసుకుంటున్నారు.
ఇప్పుడు కాటుక లాగా pencils ను ఉపయోగిస్తూన్నారు.
సరే!
ప్రాచీన సాంప్రదాయిక కళగా slow గా
చరిత్ర పుటలలోనికి చేరబోతూన్న
నిన్నటి ఈ కళను గమనిద్దాము.












A method with Sandal powder ;
_______________________

@) పలచటి తెల్లటి,మజ్లిన్ వస్త్రాన్ని తీసుకోవాలి.
దీనిని 4,4 అంగుళాల కొలతతో సిద్ధం చేసుకొనాలి.
గంధ పొడిని / గంధపు చెక్కను అరగ దీసి లేపనం తయారు చేసుకోవాలి.
@) తెల్ల, పలచని క్లాత్ ని గంధము/ చందన లేపనములో తడిపి ఉంచాలి.
@) నీడ పట్టున గంధ వస్త్రాన్ని ఆరబెట్టాలి.
ఇలాగ నీడలో ఎండ బెట్టిన వలువ ముఖ్య పదార్థముగా రెడీ!
@) తక్కిన పనిని సాయంకాలము తర్వాత చేసుకొనాల్సి ఉంటుంది.
ప్రమిదలో నిండా ఆముదము(castor oil) ను పోయాలి.
వెడల్పాటి ఇత్తడి ( braass )పళ్ళాన్ని తీసుకోవాలి.
@) గంధపు cloth ముక్క ప్రమిదలో వేసి వత్తిలాగా ఉపయోగపడ్తుంది.
పళ్ళానికి అడుగున గంధాన్ని పలచగా పూయాలి.
@) వెలిగించిన జ్యోతికి తగినంత ఎత్తులో, చందన లేపన పళ్ళెరాన్ని పెట్టాలి.
( సాధారణముగా మూడు ఇటుక రాళ్ళు అమర్చి మధ్యలో వెలిగించిన ప్రమిదను పెడ్తారు.)
@) గాలి తగలని చోట స్థిరంగా జ్యోతి వెలిగేటట్లుగా అమర్చి,
దానిపైన ఇత్తడి ప్లేటును ఉంచుతారు.
రాత్రి అంతా అలాగ ఉంచిన పళ్ళానికి అడుగున మసి పడుతుంది.
తెల్లవారి, పొద్దున్నే ఈ పళ్ళెము కాటుకకు అనువైన మసితో సిద్ధంగా ఉన్నది.
@) రెండు చుక్కల నేతి బొట్లు వేసి, బాగా నూరాలి.
వెన్నను గానీ, నెయ్యిని గానీ, ఆముదాన్ని గానీ ఇందుకై ఉపయోగించ వచ్చును.
@) ఇలాగ నెయ్యితో నూరిన మిశ్రిత లేపనాన్ని గీకి, ఒక శుభ్రమైన డిబ్బీలోనికి, జాగ్రత్త తీసి పెట్టుకొనాలి.
తాటాకు బద్దతో, చాకు వంటి వస్తువుతో గానీ మసిని పళ్ళెంనుండి జాగ్రత్తగా గీకాలి.

కొన్ని ముఖ్య జాగ్రత్తలు::::
_______________
@) వాడే వస్తువులు శుభ్రంగా ఉండాలి.
@) వత్తి వెలుగు గాలికి కదలకుండా, స్థిరంగా ఉన్నప్పుడే,
లోహ పళ్ళానికి మసి ఎక్కువ పట్టి,
కాటుక అధికంగా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
@) కాజల్ ను అట్టిపెట్టుకునే డిబ్బీని ఎండబెట్టి,
చెమ్మ లేకుండా ఉంచుకొనాలి. తడి ఉంటే వస్తువు బూజు పట్టే అవకాశము ఉన్నది.
@) ఒకసారి తయారైన ఈ నయనాంజనాన్ని
అనేక ఏళ్ళ వరకూ ఇంచక్కా వాడుకోవచ్చును.

Wednesday, December 15, 2010

నవ్వు! నవ్వించు !












"నవ్వు! నవ్వించు!
నీ నవ్వులు పండించు!
ఊహూ! ఓహోహో!
నీ కలలను విరచించు!!......'
అంటూ వాణిశ్రీ, క్రిష్ణలు
"లక్ష్మీ నివాసం" సినిమాలో కిల కిలా చెప్పేసారు.
ఇవిగో! కొన్ని గూగుల్ గోంగూరాకు చతురులు !

How to Catch a LION
================
Newton 's Method:
-----------------
Let, the lion catch you.
For every action
there is an equal and opposite reaction.
Implies you caught lion.
Einstein Method:
----------------
Run in the direction opposite to that of the lion.
Due to higher relative velocity, the lion will also run
faster and will get tired soon.
Now you can trap it easily.

Indian Police Method:
---------------------

Catch any animal and interrogate it &
torture it to
accept that its a lion.
Rajnikanth Method :
-----------------------------
Keep warning the lion
that u may come and attack
anytime.
The lion will live in fear and die soon in fear itself.
Jayalalitha Method:
---------------------------
Send Police commissioner Muthukaruppan around
2AM and kill it, while it's sleeping !

Manirathnam Method (director):
------------------------------
Make sure the lion does not get sun light
and put the lion in a dark
room with a single candle lighted.
Keep murmuring something in its ears.
The lion will be highly irritated and commit suicide.
Karan Johar Method (director):
------------------------------
Send a lioness into the forest.
Our lion and lioness fall in love with each other.
Send another lioness in to the forest,
followed by another lion.
First lion loves the first lioness
and the second lion
loves the 2nd lioness.
But 2nd lioness loves both lions.
Now send another lioness (third) into the forest.
You don't understand right...
ok....read it after 15
yrs, then also u wont!

Yash Chopra method (director):
-----------------------------
Take the lion to Australia or US..
and kill it in a good scenic location.

Govinda method:
------------------------
Continuously dance
before the lion for 5 or 6 days.

Menaka Gandhi method:
---------------------
Save the lion from a danger and feed him with
some vegetables continuously.
George bush method:
-------------------
Link the lion with
Osama bin laden and shoot him!!!
Rahul Dravid s method:
----------------------
Ask the lion to bowl at u.
U bat for 200 balls and score 1 run
Lion tired and surrenders
Software Engineer Method:
----------------------------

Catch a cat and claim
that your testing has proven
that its a Lion.

Tuesday, December 14, 2010

కోకిల కుహు కుహూ రాగాలు


రసాల శాఖపై కోయిల
ఈయవమ్మ మధు గానం ||

గాలి తరగపై వెలిసిన ;
సరస సంగీత రేఖ
సప్త స్వరముల వేదిక
షడ్జమ శ్రీ శీర్షిక ; ||

బోధ గురువు నీ గానము
రాగ మార్గ సూచిక
కుహు కుహూ సాగగా
వనము సుహృల్లేఖ ||

@@@@@@@@@

శృతి మించిన వైనాలు



పండగోయీ పండగ
సంక్రాంతి పండుగ
రంగవల్లుల పుత్తడిల్లో
గొబ్బెమ్మల రత్న మణులు
పొదిగినట్టి సంతోషాల
నవ రత్న హార మాలిక

&&&&&&&&&&&&&&&&&&

పండగలూ, ఆచారాలలోని పవిత్ర భావనల పారిజాత సౌరభాలు,
మనస్ఫూర్తిగా ఆస్వాదించగల వారు అదృష్ట వంతులు.
అలా కాక , సదాచారాలను అపహాస్యం చేస్తూ,
శృతి మించి రాగా పడ్తూన్న వైనాలు ఇవిగో!
ఈ ఫొటోలను చూడండి, వ్య్త్యాసాన్ని గమనించండి.

Sunday, December 5, 2010

ఆశ్చర్యము కదా, ఈ చెట్లు


See and enjoy abut the God's Creation.
Here are some photos, wonderful shapes of trees.

Saturday, December 4, 2010

షేమ్, షేమ్, పప్పీ షేమ్


"మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!
ఆ మత్తు వదలకుంటే ; గమ్మత్తుగ చిత్తౌదువురా!"

"పాండవ వన వాసం"లో
భీముడికి మెలకువ తెప్పించే ప్రయత్నం చేస్తాడు శ్రీ క్రిష్ణుడు.
భీముణ్ణి నిద్ర లేపే సన్నివేశములో
ఎన్.టి.రామారావు నటన superb.
అది సరే గానీ, ఈ funny photo ని ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు "షేమ్,
షేమ్,
పప్పీ
షేమ్
" అనే పదం
చాలా పాప్యులర్ ఐంది కదా!
అలాంటి పాట ఒక దానికోసం
ఈ కింద పేర్కొన్న
Internetలో గాలించ గలరా?!!!
1. '' name and shame''
2. Shamewww.buecher.de/Shame
3. Credits: Child, Desmond (Songwriter);
4. Demartini, Warren (Songwriter); Pearcy. Stephen (Songwriter); DESMOBILE MUSIC COMPANY (Publisher); RATT MUSIC (Publisher) ;

ఈ ఆదునిక యుగంలో కుక్కలకూ, బుల్లి పప్పీలకూ,
పెంపుడు జంతువులుగా ఉన్న ఆదరణ, స్థానం అంతా ఇంతా కాదు .
ఒక విన్నపమును ఇక్కడ చూసీ, చదివీ,
ఆనక మీ ఇష్టం!
వీలైతే స్పందించండి. సరేనా!!!!!!!

Send Me Your True Dog Stories

Is your dog better than my dog? (Hint: most dogs are.)

The purpose of this blog is not just to promote my dog. I don't want to sell him (usually).

So please send me stories about your dog.

Current, former or future, or some dog you've seen on the street.

True stories, preferably.

They can be funny or touching,

stories of dog heroism or doggie foolishness.

Please include the dog's name,

your first name or preferred alias,

the story, and a photo or some information

that'll help me draw the beast

(breed, description, photomicrograph of dog's DNA).

If it's better than what I've got about Gus that day,

I'll write it up. Probably illustrate it,

maybe send you a nicely formatted document

you can print out and show all your friends.

And your boss,

who will certainly be interested in

how you spent your time today.

Thursday, December 2, 2010

గోరింటాకు చెప్పే రహస్యములు


గోరింట ! చెప్పవమ్మ!
ఆ ఊసులను! ||

తన, అర చేతను చేరి
మందారం నుడువులై
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||

సింధూరం భాషవయీ
గీర్వాణీ నవ రచనగ
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||

అర చేయిని తాను
ఆర,బెట్టుకునే వేళలలో
సందె వెలుగు ముసిరి
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||
************************
గోరింటాకు చెప్పే రహస్యములు ;
__________________
gOriMTa ! cheppavamma!
aa Usulanu! ||

tana, ara chEtanu chEri
maMdaaraM nuDuvulai
gusa gusalu EmiTO?
aa eda palukulu EmiTO!? ||

siMdhUraM bhaashavayii
gIrvaaNiI nava rachanaga ||

ara chEyini taanu
aara,beTTukunE vELalalO
saMde velugu musiri ||

Wednesday, December 1, 2010

కార్తీక శోభలు






















దివిని నిత్య పండుగ ,కార్తీక శోభలు
నదీ ఝరుల ఉరవడులు
నావ సాగు మును ముందుకు
తెడ్డు వేయి, నావికా!, హైలో! హలెస్సా! ||

చెరువు, కొలను,సెలయేళ్ళూ
నదికి అనుగు సోదరులురా!
జలపాతం, వెన్నెలలను
పలకరిస్తు సాగవోయి ముందుకు ||

గగనాల తారకలు జలములందు సొగసులు
అలల పైన తేలేటి దీపాల వెలుగులు
కెరటాల నురుగులపై నిత్య రత్న జ్యోతులు
సదా ఇచట కను పండుగ కార్తీక దివ్వెల్ల పర్వాలు ||

క్రీడలలో శిష్యులు




















కన్నయ్య కొన గోట గోవర్ధనాలు పూసె;
గిరులపైన దుబ్బు మబ్బు కిరీటలు మెరిసె!

మేఘాల జల్లుల జల జల జలపాతాలు
నీటి వాలు చేరికలు ; కొలనులన్ని కళ కళా!

సరసులలో తామరలు, కలువ పూల మిస మిసా!
తీరాల పొదరిళ్ళు ,వనాలన్ని పచ్చన,

కారడవులందు చెంగు చెంగు ఆటలాడు దుప్పులు,
బాలలకు గంతులను నేర్పేను కూన లేళ్ళు;

రివ్వు రివ్వు పిట్టలు; దవ్వులనే జాబిల్లీ వెన్నెలలు
పిల్లలందరికీ అవి క్రీడలలో శిష్యులు

&&&&&&&&&&&&&&&&&&&&