Monday, May 31, 2010

కళ్యాణ తిలకము పల్యంకిక ;


















శుభ సూచక శకునములు
వసుధ ఎల్ల శోభిల్లెను
వధువు పద్మావతికి సరి జోడీ
మధు సూదన, శ్రీనివాసుడోయమ్మా! ||

కను బొమ్మల పై వరుసగ
మెరిసే తళుకుల్లు
పల్లకి గీతల కుంకుమ
కళ్యాణం బొట్టు ||

చెక్కిళ్ళ పసిడి రజనులు
చిరు – చెమటల చుక్కల్ల తడిసి
నింగి చుక్కలను మించి
మురిపెంపు పెంపు మిల మిలలు ||

ఎడమ చెంప దిష్టి చుక్క;
నాగ సరము, వంకీలు
కొప్పు చుట్టు రవల నగల
కాంతి ప్రదక్షిణములు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


kaLyaaNa tilakamu palyaMkika ;
__________________________

SuBa suuchaka Sakunamulu
vasudha ella SOBillenu
vadhuvu padmaavatiki sari jODI
madhu sUdana, SrInivaasuDOyammaa! ||

kanu bommala pai varusaga
merisE taLukullu
pallaki giitala kuMkuma
kaLyANaM boTTu ||

chekkiLLa pasiDi rajanulu
chiru – chemaTala chukkalla taDisi
niMgi chukkalanu miMchi
muripeMpu peMpu mila milalu ||

eDama cheMpa dishTi chukka;
naaga saramu, vaMkIlu
koppu chuTTu ravala nagala
kaaMti pradakshiNamulu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
( vagdevi kadambari )

Saturday, May 29, 2010

చక్రబంధమేసింది కొండగాలి














చక్రబంధమేసింది కొండగాలి,
భక్తులతో పోటీ పడి, ప్రదక్షిణముల||

నీరదముల చామర, వింజామరల నుండి
శ్రీకరముగ బయలుదేరి సుతారముగ
ఓరకంట గోవర్ధనగిరి పిలువ, వద్ద చేరి
లోయ, సొరంగాల నుండి దూరిదూరి||

యమునా జలములలో రాసలీల
మైమరపుల రమణీ కృష్ణుల చుట్టూ
వలయములౌ నీళ్ళ జేరి
మృదు గమనమ్ముల గమ్మత్తుగ||

మధురాపురి ఊసులను – వ్రేపల్లియ ముచ్చట్లను
కలబోసి, కలనేతల– అల్లి బిల్లి కబురులల్లి
కవుల మదిని సంచరిస్తు – హడావుడిగ||

&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

చక్రబంధమేసింది కొండగాలి

By kadambari piduri, May 17 2010 3:50AM

Friday, May 28, 2010

ప్రకృతికి భక్తి


















సంపెంగలు, పున్నాగ పూలు
చేమంతీ,గులాబీలు
కనకాంబర, మల్లియలు
మొగలి,దవన, మరువములు
అన్ని తపసు చేసాయి
దేవుడు వరముల నిచ్చెను;

గాలి పట్టు తివాచీని
పొందినవీ సంబరముగ;
ఆ మాయ జంబుఖాణ పైన
సరగున పూ సుగంధాలు
బాలలందరిని చేరి
చెమ్మ చెక్క లాడాయి;

బాల ప్రపంచములో పువులు
ఎన్నెన్నో నేర్చాయి;
అవి,
తమ వన్నెల తావులకు
మెరుగులను దిద్దు కొనెను

మోదములకు మారు పేరు
కేరింతల చిన్నారులు
అందులకే ప్రకృతి ఇట
భక్త పరమాణువు.

&&&&&&&&&&&&&&&&&&
prakRtiki Bakti ;
_____________
saMpeMgalu, punnaaga puulu
chEmaMtii,gulaabIlu
kanakaaMbara, malliyalu
mogali,davana, maruvamulu
anni tapasu chEsaayi
dEvuDu varamula nichchenu;

gaali paTTu tivaachIni
poMdinavii saMbaramuga;
aa maaya jaMbuKANa paina
saraguna pU sugaMdhaalu
baalalaMdarini chEri
chemma chekka laaDAyi;

baala prapaMchamulO puvulu
ennennO nErchaayi;
avi,
tama vannela taavulaku
merugulanu diddu konenu

mOdamulaku maaru pEru
kEriMtala chinnaarulu
aMdulakE prakRti iTa
Bakta paramANuvu.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

నీలముపై పగడము


















మౌళి పింఛము వాని పెదవుల
భావ గర్భిత మంద హాసము
ఇంద్ర నీలము మేని ఛాయల
ఒదిగినట్టి పగడ మెవరే???
ఆ మణి ప్రవాళ మెవరే??

(చెలులు):::
__________
“ ఇంకెవ్వరమ్మా! రాధిక !”

1. ప్రణయ దృక్కులు జతలు జతలుగ
అల్లుకున్న తోరణమ్ములు
కెంపు, నీలము కన్నయ్య, రాధిక
ఇంపు పెంపుల రాగ మాలిక ||

2. కళా సీమలకీ జోడీ
సరిగ పోగుల చాందినీ
సకల హర్షామోద ద్యుతి తతి
స్వర్ణ కానుకలీ పుడమి తల్లికి ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

nIlamupai pagaDamu ;
__________________

mauLi piMCamu vaani pedavula
BAva garBita maMda haasamu
iMdra nIlamu mEni CAyala
odiginaTTi pagaDa mevarE???
aa maNi pravaaLa mevarE??

(chelulu):::
__________
“ iMkevvarammaa! raadhika !”

1. praNaya dRkkulu jatalu jataluga
allukunna tOraNammulu
keMpu, nIlamu kannayya, raadhika
iMpu peMpula raaga maalika

2. kaLA siimalakI jODI
sariga pOgula chaaMdinI
sakala harshaamOda dyuti tati
svarNa kaanukalI puDami talliki ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Thursday, May 27, 2010

వర్ష ధారల అత్తర్లు


















పురి విప్పార్చిన నెమలి పింఛములా
అవిగో! అవిగో! కారు మబ్బులు;
ఆత పత్రము = umbrellaa
తీసుకు రండి తొందరగా!

చండా మొండీ వర్షం వచ్చెను
పడిసం పట్టును ; జలుబూ చేయును
ఆరోగ్యమె సౌభాగ్యము కద!
రెయిన్ కోటులను ధరియించండీ!

( పిల్లలు) :::

ఓహో వర్షం, ఆహా! హర్షం!
వాన జల్లుల అత్తరు, పన్నీర్లు
వాన బాలకు కేరింతలమై
తడిసి, తనియుతాం, ఆట లాడుతాం

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Monday, May 17, 2010

హైలెస్సా పదాలతో అల్లుకున్న వేణు రవము






















మిణుగురు పులుగులను
తన దోసిట్లో పట్టుకోవాలని
చూస్తూన్నాడు - "రేయి పురుషుడు ";

నింగికి మెలకువ వచ్చింది కాబోలును,
మెల మెల్లగా తెలి మంచు పరదాలను తొలగించుకుంటూ
ఉదయ కిరణాల వెంట్రుకలను సరి చేసుకుంటూ
నలు దిక్కులా కలయ జూస్తూ
బద్ధకాన్ని వదిలించుకుంటూ
ధరిత్రి కేసి వంగి చూసాడు;

భువన మనోహరత్వం
కావ్యత్వమై పులకిస్తూన్నది;

“హైలెస్సా! హైలెస్సా!” పదాలు
కొసరంచు ముగ్గులను చిత్రిస్తూ ఉన్నవి;
అల్లెక్కడి నుండో వస్తూన్న
మృదు నవ మురళీ రవళిని
గూటి పడవ - తన ఆంతరంగంలో రంగరించుకుంటూ
ముందుకు సాగుతూంటే .........

యమునా వాహిని
కృష్ణుని అల్లరల్లరి నాట్య లీలలను ;
నిన్న జరిగిన ఊసులను చెబుతూంటే;

ఆ ముచ్చట్లతో .........
'పైర గాలి ' వయ్యారాలు పోతూ
'కొంగ్రొత్త రంగ వల్లికలుగా 'ఆవిష్కారమౌతూన్న వేళలలో
రాధిక సోలిన కన్నుల వీక్షణాలు
వెలుతురు సరసులలో
పద్మాలై విరబూస్తున్నాయి.

( హైలెస్సా పదాలతో
అల్లుకున్న వేణు రవము )

&&&&&&&&&&&&&&&&&&

( hailessaa padaalatO
allukunna vENu ravamu )
miNuguru pulugulanu
tana dOsiTlO paTTukOvaalani
chUstUnnaaDu rEyi purushuDu;

niMgiki melakuva vachchiMdi kaabOlunu,
mela mellagaa teli maMchu paradaalanu tolagiMchukuMTU
udaya kiraNAla veMTrukalanu sari chEsukuMTU
nalu dikkulaa kalaya jUstU
baddhakaanni vadiliMchukuMTU
dharitri kEsi vaMgi chUsaaDu;

bhuvana manOharatvaM
kaavyatvamai pulakistUnnadi;

“hailessaa! hailessaa!” padaalu
kosaraMchu muggulanu chitristU unnavi;
allekkaDi nuMDO vastUnna
mRdu nava muraLI ravaLini
gUTi paDava tana aaMtaraMgaMlO raMgariMchukuMTU
muMduku saagutUMTE
yamunaa vaahini
kRshNuni allarallari naaTya lIlanu
ninna jarigina Usulanu chebutUMTE;
aa muchchaTlatO
paira gaali vayyaaraalu pOtU
koMgrotta raMga vallikalugaa aavishkaaramautUnna vELalalO
raadhika sOlina kannula vIkshaNAlu
veluturu sarasulalO
padmaalai virabUstunnaayi.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Sunday, May 16, 2010

మలయ మారుతముల ప్రదక్షిణలు























( పల్లవి)

చక్ర బంధమేసింది కొండ గాలి
భక్తులతో పోటీ పడి ||

1. నీరదముల చామర, వింజామరల నుండి
శ్రీకరముగ బయలు దేరి సుతారముగ
ఓర కంట గోవర్ధన గిరి పిలువ, వద్ద చేరి
లోయ, సొరంగాల నుండి దూరి దూరి ||

2. యమునా జలములలో రాస లీల –
మై మరపుల రమణీ కృష్ణుల చుట్టూ
వలయములౌ నీళ్ళ జేరి
మృదు గమనమ్ముల గమ్మత్తుగ ||

3. మధురా పురి ఊసులను – వ్రేపల్లియ ముచ్చట్లను
కల బోసి, కల నేతల – అల్లి బిల్లి కబురు లల్లి
కవి మానసమున సంచరిస్తు – హడావుడిగ ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
malaya maarutamula pradakshiNalu ;
_______________________________
( pallavi):::::
_______
chakra baMdhamEsiMdi koMDa gaali
bhaktulatO pOTI paDi ||

1. nIradamula chaamara, viMjaamarala nuMDi
SrIkaramuga bayalu dEri sutaaramuga
Ora kaMTa gOvardhana giri piluva, vadda chEri
lOya, soraMgaala nuMDi dUri dUri ||

2. yamunaa jalamulalO raasa lIla –
mai marapula ramaNI kRshNula chuTTU
valayamulau nILLa jEri
mRdu gamanammula gammattuga ||

3. madhuraa puri Usulanu – vrEpalliya muchchaTlanu
kala bOsi, kala nEtala – alli billi kaburu lalli
kavi maanasamuna saMcharistu – haDaavuDiga ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Friday, May 14, 2010

సుగుణాభిరాముడు
















కౌసల్యా సుతుని భజనము
అహంకారములు త్యాజ్యము

రామ హరే! కృష్ణ హరే!
భువన మోహనా!జగద్రక్షకా ||
1.ఇహ పరముల ప్రశాంతి మార్గమ్ము
ప్రేమ గమ్యముకు సోపానం
అభిమానంగా సారధ్యం
నడిపే దైవం,మన ఆప్త నేస్తము ||
2.సత్వ గుణార్ణవ శోభితము
తత్వ విపులతల ఆలంబనము
నెర నమ్మిన దైవము శ్రీ రామం
అను క్షణమ్ము పూజ్యమ్ము ||
[సుగుణాభిరాముడు ;
______________ ]

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
suguNABi raamuDu ;
_______________
kausalyaa sutuni Bajanamu
ahaMkaaramulu tyaajyamu
raama harE! kRshNa harE!
Buvana mOhanaa!jagadrakshakaa! ||

1.iha paramula praSAMti maargammu
prEma gamyamuku sOpaanaM
aBimaanaMgaa saaradhyaM
naDipE daivaM,mana aapta nEstamu ||
2.satva guNArNava SOBitamu
tatva vipulatala aalaMbanamu
nera nammina daivamu SrI raamaM ||
anu kshaNammu pUjyammu

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Thursday, May 13, 2010

ధర్మ స్వరూపము శ్రీ రామ చంద్రుడు
















శ్రీ రామ దర్శనము,భజనమ్ము
ఆనంద తేజము, శాంతమ్ము
నిరుపమానముగ లభ్యమ్ము ||

విస్తృత ధార్మిక పథమదియే!
విలువల రక్షా కవచమ్ము
నడయాడు ధర్మ స్వరూపమ్ము
కలి యుగ దైవము, రాముడె శరణము ||

సాకేత పురేశా! శ్రీ రామా!
ముకుళిత హస్తులు భక్త జనాళికి
నీ దర్శన భాగ్యము వీక్షణము
ప్రతి అంగుళమూ సార్ధక్యం ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&
SrI raama chaMdruDu ;
______________________

SrI raama darSanamu,Bajanammu
aanaMda tEjamu, SAMtammu
nirupamaanamuga laByammu ||

vistRta dhaarmika pathamadiyE!
viluvala rakshaa kavachammu
naDayaaDu dharma svarUpammu
kali yuga daivamu, raamuDe SaraNamu ||

saakEta purEiSaa! SrI raamaa!
mukuLita hastulu, Bakta janaaLiki
nI darSana Baagyamu vIkshaNamu
prati aMguLamuu saardhakyaM ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Wednesday, May 12, 2010

















చెలులారా! చేర రండి మధురా పురిని
జిలుగంచుల పావడాలు రెప రెప లాడ ||

హరి చందనాలు చెంగలువ రేకులలమి
పొందుగా;స్వామి చెక్కిళ్ళ చేరి ,
మోమునందు కొనేనొహో! ఏమి తపము చేసెనో!?!
ఇందు వదను ఉరమున చేరేను ||

నీ నాట్య వినోదము సందడిలో
స్వర్ణ మంజీరము రవళులు ఊగంగా
మా వందన శతముల నందుకోవయా
స్వామి! చెంగల్వ రాయడా! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

chelulaaraa! chEra raMDi madhuraa purini
jilugaMchula paavaDAlu repa repa laaDa ||

hari chaMdanaalu cheMgaluva rEkulalami
poMdugaa;svaami chekkiLLa chEri ,
mOmunaMdu konEnohO! Emi tapamu chEsenO!?!
iMdu vadanu uramuna chErEnu ||


nI naaTya vinOdamu saMdaDilO
svarNa maMjIramu ravaLulu UgaMgaa
maa vaMdana Satamula naMdukOvayaa
svaami! cheMgalva raayaDA! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

చందనాల పూజలు ;

By kadambari piduri, May 3 2010 10:18PM

Tuesday, May 11, 2010

సీతా కోక చిలకల వలె ఆడుదాము






















కొలనులలో తరగలు – నదులందున ఎన్నో అలలు
కడలిలోన కెరటాలు – నీటి వలయ నాట్యాలు;

తరంగాల నురుగులు – నురుగు బుడగ పువ్వులు
దేవతలు వెలిగించిన - వెన్నెలల దీపాలు

బాలల డెందాలలోన ఎన లేని హర్షమ్ములు
పిన్న, పెద్దలందరికీ నేత్ర పర్వ కేరింతలు

అరుణ కాంతి మిల మిలలు – పౌర్ణిమల జ్యోతులు
వెలుతురుల సిరి మల్లెలు – విర బూసే తోటలివి ,
అందరమూ ఆడుదాము సీతా కోక చిలకలమై.

((సీతా కోక చిలకల వలె ఆడుదాము ;

( = నురుగులపై దివ్వెలు )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

(siitaa kOka chilakala vale aaDudaamu ;

(= nurugulapai divvelu ; )
____________________

kolanulalO taragalu – nadulaMduna ennO alalu
kaDalilOna keraTAlu – nITi valaya naaTyaalu;

taraMgaala nurugulu – nurugu buDaga puvvulu
dEvatalu veligiMchina - vennelala diipaalu
baalala DeMdaalalOna ena lEni harshammulu
pinna, peddalaMdarikii nEtra parva kEriMtalu

aruNa kaaMti mila milalu – paurNimala jyOtulu
veluturula siri mallelu – vira bUsE tOTalivi
aMdaramuu aaDudaamu sitaa kOka chilakalamai.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, May 8, 2010

తేరు సాగేను

















( పల్లవి)::::
______

సారస్వత శకటము;
సముల్లాస కథనము ||

(అను పల్లవి) ;;;;
______________

ప్రతి కదలిక మధుర తరము
మంజుల మృదు చమత్కారమీ ||
మురిపాలు, గారాలు
బులిపింపులు, మారాములు
ఈసు నసూయలను
మ్రోయు చున్న శకటము; ||

పువు పగ్గాలను కట్టినాడు మన్మధుడు
తువ్వాయి నంది లాగు చుండ
భద్రమయ్య! బండి ఇరుసు
అంబా పతి! జగదీశా!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

tEru saagEnu ;
_____________
( pallavi)::::
__________
saarasvata SakaTamu;
samullaasa kathanamu

(anu pallavi) ;;;;
______________

prati kadalika madhura taramu
maMjula mRdu chamatkaaramI ||
muripaalu, gaaraalu
bulipiMpulu, maaraamulu
Isu nasUyalanu
mrOyu chunna SakaTamu; ||

puvu paggaalanu kaTTinaaDu manmadhuDu
tuvvaayi naMdi laagu chuMDa
bhadramayya! baMDi irusu
aMbaa pati! jagadISA!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఒహో! ఒహో! పావురమా!


















కపోతమా! తెలుపవే
సమాచారము
స్వామి సమాచారము ||

పద్మావతి కవ్వించి
నాంచారు నవ్వించి
శ్రీ వేంకట నాథుని మోము చిన్నెలన్ని
చూచి , పులకించి –
దినమణి ‘ ఇల కొసగినాడు ఈ నాడు
కోటి కిరణ రాశి గా పగటిని “ ||

అలివేలు మంగ కెంపు పెదవి –
వంపుల శ్రీ చుట్టి
చిలిపి హాసముల నెన్నెన్నో –
గిరి వాసుడు సృజియించెను, ఓహోహో!

అది గనిన పద్మాసన –
శ్రీ లక్ష్మి ఇటుల తలచె!
నాదు శ్రీ’ని సవతి కడను
దాచినాడు రమణుడు –
మెండు కదా మగని పొగరు ,
ఏమని అనుకోను?!!??” ||

అయ్యారే! ఆ ఇంతులు
శ్రీవారి సరసాల తంతులలో
ఇంపులు, గడసరి కవ్వింపులు,
ప్రణయాలలొ వింతలు ||

&&&&&&&&&&&&&&&&&&


ohO! ohO! paavuramaa! ;
__________________
kapOtamaa! telupavE
samaachaaramu
svaami samaachaaramu ||

padmaavati kavviMchi
naaMchaaru navviMchi
SrI vEMkaTa naathuni mOmu chinnelanni
chuuchi , pulakiMchi –
dinamaNi ‘ ila kosaginaaDu I naaDu
kOTi kiraNa rASi gaa pagaTini “ ||

alivElu maMga keMpu pedavi –
vaMpula SrI chuTTi
chilipi haasamula nennennO –
giri vaasuDu sRjiyiMchenu, OhOhO!

adi ganina padmaasana –
SrI lakshmi iTula talache!
naadu SrI’ni savati kaDanu
daachinaaDu ramaNuDu –

#meMDu kadaa magani pogaru ,
Emani anukOnu?!!??” ||
ayyaarE! aa iMtulu
SrIvaari sarasaala taMtulalO
iMpulu, gaDasari kavviMpulu,
praNayaalalo viMtalu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Tuesday, May 4, 2010

పండు లాంటి పండుగ దీపావళి


















దివ్య దివ్య దీపావళి
ప్రతి సారీ ఈ పండుగ
“హుషార్ పండు” నవ్యమే!
నవ నవీన పర్వమే! || -

మతాబులు తేరండీ!
మతలబులు వద్దండీ!
దండిగా సంతసాల+
బండి నెక్కుదామండీ! ||

బాణా సంచా లివి గివిగో!
కులాసాల విలాసాలు
కిల కిలలకు కాణాచిగ
ఇల్లిల్లూ మారాలి ||
~~~~~~~~~~~~~~~~~~
~~~~
By :
By: Category: పాటలు

( Read here ;
రచన : kadambari piduri )