# Kovela #
ఆటలుకాని ఆటలు
# By - kadambari piduri, Jul 4 2009 5:44PM #
మృదు మధుహాసము
-మంజుల రూపము
కని కని మురిసెను
ఆ బాల గోపాలము //
1)నెమలి పింఛ మాడినది
నుదురు పయిన
నీలి నీలి ముంగురులాడినవి //
2)ఎరపు పెదవు లాడెను
పెదవి పయిన వేణువుపై
చివురు వ్రేళు లాడినవి //
3)కుండలములు ఆడినవి
గళములోన రంగు రంగు
పూల ; దండ నాట్యమాడినది //
4)హరి నడుము ఆడినది
సిరి మువ్వలు ఘలు ఘల్లన
పద పద్మము లాడినవి //
5)రస -ధునియై ఋతు హేల
ఉప్పొంగుచు దరహసించ
బృందావని నిలువెల్లా
కమనీయపు పులకింత //
No comments:
Post a Comment