(భావ కవిత్వమునకు ఆద్యుడు,శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి.
సంస్కృత సమాస భూ'యిష్టమైన ' ఈ పాట కృష్ణ శాస్త్రి కలము నుండి జాలు వారినది.
జాతీయ గీతముగా ఎన్నుకో వలసినంత గొప్ప స్థాయిలో ఉన్న ఈ దేశ భక్తి గీతిక,అంటే,నాకు చాలా ఇష్టము.)
జయ జయ జయ ప్రియభారత!
జయ జయ జయ ప్రియ భారత-
జనయిత్రీ దివ్య ధాత్రి !
జయ జయ జయ శత సహస్ర -
నర నారీ హృదయ నేత్రి || జయ ||
(మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ, నీకు జయమగు గాక ! లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు కనులవంటి దానా, నీకు జయమగు గాక !)
జయ జయ సుస్యామల -
సుశ్యామ చలచ్చేలాంచల -
జయ వసంత కుసుమలతా-
చరిత లలిత చూర్ణకుంతల -
జయ మదీయ హృదయాశయ -
లాక్షారుణ పదయుగళా || జయ ||
(శ్యామలవర్ణా, కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు గల దానా, నీకు జయమగు గాక ! వసంతకాలములో విరిసిన పూలను తురిమిన అందమైన వెండ్రుకలు గల దానా నీకు జయమగు గాక ! (నా మనసునందలి అభిలాషల ఎర్రని లత్తుకతో అలంకరించబడిన పాదములు గలదానా నీకు జయము !)
జయ దిశాంత గత శకుంత -
దివ్యగాన పరితోషణ -
జయ గాయక వైతాళిక-
గళ విశాల పద విహరణ-
జయ మదీయ మధురగేయ-
చుంబిత సుందర చరణ || జయ ||
(దిశాంతములకు వెళ్ళిన పక్షుల అమరగానముతో తృప్తి బొందిన దానా, జయము! గాయకుల, కవుల కంఠములలో వెలువడు పాటలలో విహరించుదానా, జయము ! నా మధురగానముతో ముద్దుపెట్టబాదిన చుంబించిన } అందమైన చరణము గల దాన,
(ఇక్కడ పాట చరణము, తల్లి పాదాలు రెంటికి వర్తిస్తుంది) నీకు జయమగు గాక !
ఇందులో నాకు నచ్చిన ఒక పదము "చూర్ణకుంతల".
వెండ్రుకలను మధ్యలో రెండు పాయలుగా చేసి భుజములపై వేలాడదీయుటను చూర్ణకుంతల అంటారు. గర్భవతులు ఇలా అలంకరించుకోరు.
ఈ ఉద్దేశములో కవి వాడారో అన్నది నాకు తెలియదు. కాని ఇది ఒక సుందరమైన ప్రయోగము.
(విధేయుడు - మోహన )
http://www.kanneganti.com/ _______
No comments:
Post a Comment