Friday, August 7, 2009

వసంత సేన (సినిమా )













వసంత సేన (సినిమా పాట)
(పద్మిని,నాగేశ్వర రావు);రచన:దాశరధి
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు;గానం:ఘంటసాల;జానకి

1)కొండలన్ని వెతికేను,
కోనలన్ని తిరిగేను
చెలియా!సఖియా!నీకోసమే!
రావే వయ్యారి!నా వలపు మయూరి!-(2)
నవ్వులు చిందించి నటియించవే (2)

2)చెంతచేరి రావొయి!
చింతదీర్చి పోవోయి!
వయసూ సొగసూ నీ కోసమే
నేడే వసంతం,
ఈ జగమున విరిసే
నేడే వసంతం,నా మనసున విరిసే
కోయిల కొమ్మల్లొ కోయన్నది ఓ.. (2)

3)ఝుమ్మని రాగాలు పాడెను భ్రమరం
కమ్మని తేనెలనందించు కుసుమం
జల జల నాట్యాల ప్రవహించు నదులు
సాగరు కౌగిట చేరేను తుదకు.

4)నెలరాజు నేడేల పిలిచేను కలువ,
కలువకై జాబిల్లి కదిలీ వచ్చేను
వలచిన చెలికాని తలచేను చెలియ,
చెలియను మురిపింప చేరేను ప్రియుడు

5)నిజమైన అనురాగమదియే కదా:ఆ..
నిజమైన అనురాగమిదియే కదా!
చెంతచేరి రావొయి!
చింతదీర్చి పోవోయి
వయసూ,సొగసూ నీ కోసమే!

రావే వయ్యారి నా వలపు మయూరి (2)
నవ్వులు చిందించి నటియించవే (2)
ఓ సుందరీ..ఓ సుందరీ..ఓ సుందరీ!

No comments:

Post a Comment