కొంగు బంగారు ముడి శ్రీ కాంతుని వేంకట గిరి //
దివి అంతయు గాలించి భువిని-ఇచ్చగించి తానె దిగి వచ్చెను తిరుమలకు! సప్త గిరుల హారమునకు!
శ్రీ లక్ష్మీ రమణుని గిరి శ్రీమంత నివాసము //
శ్రీ వేంకట నాయకుని తోడిదే మా లోకము అఱ చేతికి అందినట్టి దివియే కద ఈ సన్నిధి!
ఈ సన్నిధి యే పెన్నిధి ఆసాంతం మన సొంతము //
******************************************
అనురాగమాలికశిఖి పింఛ ధారీ! శ్రీ కృష్ణ!వన మాలీ! నీ మురళీ రవళులు చిరు గాలికి గిలి గింతల జిలిబిలి ||
అల్లదే!అల్లదే! మలయ పవన వీచిక వేణు గాన లోలుని ఆగమనపు సూచిక ||
మారుతములకు అందెనులే నేడు మంచి ఆశీస్సులు! "చిరంజీవ!"దీవెనలు ! అవి, అవిరళ శృతి రాగమ్ములు ||
మందార మృదు బాల -రాధిక ఆనంద బాలునుకు అభిమానపు సేవిక అనురాగముల వర మాలిక అరుదెంచినదదిగో!అందాల అభి సారిక చక చకా! చక చకా! ( 2 )
******************************************************
మానసధామంఏ పొద్దూ,నవ నవముగ తిరు వేంగళ నాధుని చిరు నవ్వుల ముగ్గులందు విర బూసే వన్నియలు || మేఘ శ్యాము హృదయము సు - విశాల గగన ధామము పూ సౌరభ దామినులకు నీల మోహనుని మేను ఆయె నయ్యారె ! ఆవాసము ||
శత పుష్ప దళమ్ములార ! స్వామి - తనువునందున పరిమళ శతకమ్ములార ! గడించినారు గడుసు వరము అందులకా గీర్వాణము ||
లతా ప్రసూనమ్ములార! పత్ర పూ ఫలమ్ములార! ప్రకృతికి ప్రతి కృతి ఎలమి స్వామి దేహము మీ సుందర హర్మ్యమ్ము || ( కోరస్ ) :::::: మేఘ శ్యాము హృదయము సువిశాల -గగన ధామము ఏ పొద్దూ,నవ నవముగ తిరు వేంగళ నాధుని చిరు నవ్వుల ముగ్గులందు విర బూసే వన్నియలు చెప్పొద్దూ,ఎంతొ ముద్దు! చెప్ప రానంత ముద్దు ||
_ |
|
|
No comments:
Post a Comment