శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజములలో ప్రముఖుడు. ఈయన ,రాయలు భార్య,వినతి పై,రాసిన"పారిజాతాపహరణము"నకు,"రాయలు,రాణి పైన కోపగించుకోవడము " కూడా మూల కారణమైనది సత్య భామా దేవి కినుకను తగ్గించడానికీ,ఆమె తన భర్తతో అనురాగముతో వర్తించడానికీ ఒక పద్యాన్ని రాసేసి ,
"ముక్కు తిమ్మన"గా లోక బిరుదును సంపాయించేసాడు ధూర్జటి.
ఆ నాసికాభరణము కాంతులు చూడండి/చదవండి.
"నానా సూన వితాన వాసనల నానందించు
సారంగ మేలా తన్నొల్లదటంచు
గంధ ఫలి బల్కానల్ తపం బొంది
యోశా నాసాకృతి బూనె సర్వ సుమన
సౌరభ్య సంవాసియై బూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .
"అన్ని పుష్పాల మీద వాలుతూంటుంది మిళిందము.
కానీ , ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలడం లేదు?" అని అలిగింది సంపెంగ పువ్వు.
దుర్గమారణ్యాలలోనికి వెళ్ళింది సంపంగి పూవు.తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని వరం కోరినది.
" ప్రేయసి నాసిక (= ముక్కు) గా పునర్జన్మను పొందినది. ఆ నాటి నుండీ,వర ప్రభావముచే అన్ని పూవుల వాసనలని ఆస్వాదించసాగినది .
ఇరు వైపులా "నయనములు -( గండు తుమ్మెద ) చూపులను తుమ్మెదల మాలగా ధరించింది .
"ముక్కు తిమ్మన "గా - వాసి కెక్కిన, ధూర్జటి వివరాలకై,"వేంకటార్య కవి"( పౌత్రుడు) రచించిన "శ్రీ కృష్ణ రాయ విజయము"ను ఆధారముగా భావిస్తారు. "భారద్వాజ గోత్ర ; పాక నాటి ; ఆర్వేల నియోగి ; అని తెలుస్తూన్నది. శ్రీ కాళ హస్తీశ్వర శతకము" మూలంగా ధూర్జటి మహా కవి,"శ్రీ కాళ హస్తి లో నివసించెనని " స్పష్టమౌతున్నది.