Tuesday, October 4, 2016

నగరి చేరి మరిచాడా!

నగరి చేరి మరిచాడా!? 
మనలను క్రిష్ణుడు!?
మధురా నగరి చేరి మరిచాడా!?  
మనలనందరినీ క్రిష్ణుడు !:    || 
;
గోవర్ధనగిరి నెత్తి
అందరినీ బ్రోచినాడు నాడు 
నగరిలోన అంత మైకమేమున్నదో గానీ!
ఏమో గానీ ......
పురము చేరి మరిచాడు
ఎల్లరినీ క్రిష్ణుడు !     || 
;
కాళీయుని ఫణములపై 
     తధిగణతో పదగతులకు 
సరిగమల నగలను పొదిగిన 
        రాధ మాట మరిచాడా!? 
తలపోతలనగ - 
   అనగనగా కథలాయెనా!? 
గత కాలపు గాధలాయెనేమి 
        ఇటుల ఇంతలోననే!!?   ||  
;
=================;

    nagari chEri marichADA!? 
;
nagari chEri marichADA!? 
manalanu krishNuDu!? - 
madhuraa nagari chEri marichADA!?  
manalanamdarinii krishNuDu !? :    || 
;
gOwardhanagiri netti 
amdarinii brOchinADu nADu 
nagarilOna amta 
  maikamEmunnadO gaanii!
        EmO gaanii!....
puramu chEri marichADu
ellarinii krishNuDu !
puramu chEri marichADu
ellarinii krishNuDu !     || 
;
kaaLIyuni phaNamulapai 
tadhigaNatO padagatulaku 
sarigamala nagalanu podigina 
       raadha mATa marichADA!? 
talapOtalanaga - 
    anaganagaa kathalaayena!? 
gata kaalapu gaadhalaayenEmi 
 imtalOnane!?   || 
;
****************************************,

గాలి తీర్ధ యాత్రికుడు

జల బాష్పముల మూట మూపున ఉంచుకుని 
తన ప్రయాణములు ముందుకు సాగాలి 
అలుపుసొలుపెరుగని పాంధుడు ఈ గాలి    || 
;
కొండల కోనల తిరుగాడెను గాలి
తోటల తోపుల నడయాడె గాలి
ఈ చిరు గాలి   || 
;
ఆరు ఋతువులను బాగ
పరిశీలనలు చేసె! 
రాళ్ళు రప్పలలోన 
సురుచిర పయనాలు   || 
;
ఎన్నెన్నొ పయనాలు చేసింది గాలి
రాధికా కృష్ణుల వేణువున జారింది 
మృదు రాగ సంగీత గానమై తనరింది
"ధన్య ఐనాను!" - అని ఎలుగెత్తి చాటింది గాలి
ఈ చిరు చిలిపి గాలి   ||

===================================;

jalabaashpamula muuta 
       muupuna unchukuni 
tana prayaanamulu 
    mumduku saagaali 
  gaali tiirdha yaatrikuDu 
     alupu soluperugani 
       paamdhuDu I gaali    || 
;
komDala kOnala tirugaaDenu gaali 
tOTala tOpula naDayaaDe gaali
ii  chirugaali   ||
;
Aru Rtuwulanu baaga
pariSeelanalu chEse! 
[raaLLu rappalalOna 
suruchira chiru 
chiru payanaalu    ||  
;
ennenno prayANammulu 
chEsimdi gaali
raadhikaa kRshNula 
wENuwuna jaarimdi
mRdu raaga samgeeta 
    gaanamai tanarimdi
"dhanya ainaanu!" - ani 
elugetti chATimdi gaali
ii chiru chilipi gaali    ||
;

ఇనుమారు ముమ్మారు వేమార్లు

ఇనుమారు ముమ్మారు ; 
వేమార్లు తెలిపెను ; 
యమునమ్మ కెరటాల
       రాగ మాధుర్యాలు 
            రాధ ఓరిమి గూర్చి!    || 
;
బృందావనమ్మున పొదరిళ్ళలోన ; 
మల్లె విరి దొంతరల మృదు సుగంధములు 
ఆ సౌరభాల ఆవిరి అంతంత, అంతంత! 
గగనముల అంతటా పరివ్యాప్తి చెందినవి
ఉవ్వెత్తు పరీమళమ్ముల లాలనలు అన్ని
   వేమార్లు తెలిపెను
         రాధ ఓరిమి గూర్చి!    || 
;
మల్లికా పరిమళపు మడుగుల మీద
పరచుకుంటున్న పున్నమీ వెన్నెల 
నిలువెల్ల నవ మధు సుధా ఝరిగ మారినది
గోవర్ధనము దాక పరివ్యాప్తి గాంచినవి
పొంగారు శీతలము లాలసలు ఎన్నెన్నొ 
   వేమార్లు తెలిపెను ;
         రాధ ఓరిమి గూర్చి!     ||  
;
******************************,
;
inumaaru mummaaru ; wEmaarlu telipenu 
yamunamma keraTAla 
raaga maadhuryaalu 
 wEmaarlu telipenu
   raadha Orimi guurchi!  ||
;
bRndaawanammuna ; podariLLalOna 
malle wiri domtaralu 
mRdu sugamdhamula aawiri amtamta 
amtaTa - gaganamula pariwyaapti 
 wEmaarlu telipenu
   raadha Orimi guurchi!   ||
;
 mallikaa parimaLapu maDugula meeda 
parachukumTunna punnamala wennela 
niluwella madhu sudhaa jhariga maarinadi
gowardhanamu daaka pariwyaapti gaamchinawi
pomgaaru seetalamu laalasalu ennenno 
 wEmaarlu telipenu
   raadha Orimi guurchi!  ||

**************************************** ;

అన్నులమిన్న

వందనములు, వందనములు,  ; 
వందలాది  వందనములు, 
అరవిందలోచనుడా! 
అరమోడ్పు కన్నుల రాధ చేసేటి ;  ||వందనములు||
;
చందనములు, చందనములు; 
చల్లని హరి చందనములు ; 
కందర్పమోహన! 
కెందలిరాకు మోవి రాధ అలదేటి ;  ||చందనములు||
;
మాలికలు మాలికలు ; 
చక్కని పూ మాలికలు ; 
రాధా హృత్ వనమాlee! 
ఈ రాగ సుధా మానస మర్పించే  ||మాలికలు||  
;
వెన్నపాలు, వెన్నపాలు ; 
కమ్మనైన వెన్నపాలు ; 
వెన్నదొంగకు నేడిటు ; 
అన్నులమిన్న రాధ ; 
ఒసగు నవనీతపు విన్నపాలు ;  ||వందనములు||  
;
=========================,
;
             annulaminna ;- 

wamdanamulu,  wamdanamulu,
wamdalaadi  wamdanamulu, 
arawimdalOchanuDA! 
aramODpu kannula raadha chEsETi;  ||wamdanamulu||
;
chamdanamulu, chamdanamulu; 
challani hari chamdanamulu; 
kamdarpamOhana! 
kemdaliraaku mOwi raadha aladETi;  ||chamdanamulu||
;
maalikalu maalikalu; 
chakkani puu maalikalu; 
raadhaa hRt wanamaali! 
I raaga sudhaa maanasa marpimchE  ||maalikalu||  
;
wennapaalu, wennapaalu; 
kammanaina wennapaalu; 
wennadomgaku nEDiTu; 
annulaminna raadha; 
osagu nawaneetapu winnapaalu ;  ||wamdanamulu||  
;
[ పాట 61 ; బుక్ పేజీ 66  , శ్రీకృష్ణగీతాలు ]   

ధ్యానమాధురి

భువన మనోహర సుందర శ్యామా! ; 
నిను గని మరుడే మైమరచేరా! ;   ||భువన||
;
యమునాతీర సైకత వేదికలందున ; 
ఎగసెను నీ తలపుల లహరులు ;  ||భువన|| 
;
బృందావనమున, 
  రా చిలుకల పలుకులు ; 
    మధురములాయెను ;
శ్రీరామచిలుకల ఎల పలుకులు ; 
  నీ ధ్యానమందున మధురములాయెను ;   ||భువన||
;
గోకుల కానన పుంజములోన ; 
హరిణాక్షుల చూపు డోలల నీ రూపేరా!;  
తరుణుల వీక్షణ ఊయెలలందున 
ఊగును నిరతము నీ రూపేరా!;   
;
==============================;

              dhyaanamaadhuri ;- 
;
Buwana manOhara sumdara SyaamA! ; 
ninu gani maruDE maimarachErA! ;   ||bhuwana||
;
yamunaateera saikata wEdikalamduna ; 
egasenu nii talapula laharulu ;  ||bhuwana|| 
;
bRmdAwanamuna, 
 raa chilukala palukulu 
   madhuramulaayenu 
Sreeraamachilukala ela palukulu ; 
  nii dhyaanamamduna 
   madhuramulaayenu ;   ||bhuwana||
;
gOkula kaanana pumjamulOna ; 
hariNAkshula chuupu DOlala nI ruupEraa!
taruNula weekshaNa uuyelalamduna 
uugunu niratamu nI ruupEraa!;   ||bhuwana||
;
రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ 

                                 పాట  63 ; బుక్ పేజీ 68  ]    శ్రీకృష్ణగీతాలు   ;  
;
*****************************************, 

విరహిణి రాధిక

కడకంటి చూపున 
    కనికరము చూపవే! ; 
నీ పాదముల పైన 
   వ్రాలు ఈ దాసు పైన ; 
అన్నాడు నిన్న ; 
   అది మరచె నేడు! ;    ||కడకంటి||
;
గోవర్ధన గిరి సానువులన్నీ ; 
హిమబాష్పములను కురిపించినవి ; 
సానూభూతితో విరహిణి రాధపై 
;     ఆ పాటైనా కరుణయె లేదే! ; 
        వాని మాటలు - 
          ఒట్టి 'నీటి మూటలే'నులే! ;   ||కడకంటి|| 
;
ధేను పాంశువుల ధూళిపరాగము ; 
ఎర్రబారెనే, నింగి కెగసెనే! ; 
ధూర్తబాలుని తలచినట్టుల ; 
        అంత మాత్రపు కృప లేదే!; 
           వాడెట్టి ఎండకు 
                అట్టి గొడుగును పట్టునులే! ;   ||కడకంటి||
;
==========================================;
;
wirahiNi ;-;  
;
kaDakamTi chUpuna kanikaramu chuupawE! ; 
nii paadamula paina wraalu ii daasu 
paina ; annADu ninna ; 
     adi marache nEDu! ;    ||kaDakamTi||  ; 
;
gOwardhana giri saanuwulannii ; 
himabaashpamulanu kuripimchinawi ; 
saaniBUtitO wirahiNi rAdhapai 
; aa pATainaa karuNaye lEdE! ; 
waani mATalu - 
   oTTi niiIi muuTalEnulE!;   ||kaDakamTi|| 
;
dhEnu pAMSuwula dhULiparaagamu ; 
errabaarenE, nimgi kegasenE! ; 
dhuurtabaaluni talachinaTTula ; 
amta mAtrapu kRpa lEdE!; 
wADeTTi emDaku aTTi 
goDugunu paTTunulE!;   ||kaDakamTi||
;
ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ 
;
  [ పాట 64  ; బుక్ పేజీ  69 ]   శ్రీకృష్ణగీతాలు  

వంపు, ఇంపు, సొంపులు

సతతహరిత పర్ణకుటీరమిది; 
క్రిష్ణయ్యా! రావయ్యా!  ;   || 
;
నీ అడుగులేమొ నడకలు;
నడకలేమొ నాట్యాలు ; 
ఇన్ని లీలలన్నిటినీ 
విశదపరచు కుటీరం ;
   పచ్చనాకుల కుటీరం ;   || 
;
అంబరమున 
ఆ మొయిలులు;  
తమ చలనములకు;
నృత్యహేలలను 
నేర్పే గమ్మత్తులు ;   || 
;
వంపు, ఇంపు, సొంపు త్రికముల ; 
గైకొనినవి నీలాల నింగి మబ్బులు;
అమ్మ వోలె అనుభూతి 
     చెందుచున్న అంబరము
          విశాల నీలి అంబరము  ;   || 
;
        [మాతృభావన]

==============================,
;
వంపు, ఇంపు, సొంపు త్రికములు ;

వెన్నెల అలలు

నంద గోప కువలయావృతేందుబింబమా! 
కుందరదన చాల కుందుచున్నది ;
ఈ రాధిక నీ కొరకై ; 
కుంజవనమునందు చాల కుందుచున్నది ; 
నికుంజ వనమునందు సొమ్మసిలెను!
                   తాను సొమ్మసిలెను!  ;    
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
ముక్కెర ముద్దిడు వెన్నెల అలలలోన ; 
ఉక్కిరి బిక్కిరి ఔతున్నదిరా,  రా! రా! ; 
మువ్వల మ్రొక్కెడు యమునా నీరమ్మును ; 
త్రోసి వేయుచున్నదిరా
ఆవలకు త్రోసి వేయుచున్నదిరా :  
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
కన్నుల కాంతుల దూరెడు మిన్నుకు ; 
రెప్ప తలుపులను వేసి, మూయుచున్నదిరా! 
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
ఎన్నడు ఏ క్షణమందున ;
 వచ్చెదవో యనుకొని ;
    నీవు వచ్చెదవో యనుకొని ;: 
తన మానసపురిలోన - ముగ్గులేయుచున్నది ;
వన్నెచిన్నెలూరు ముగ్గులెన్నొ వేయుచున్నది
రా! రా! రా! 
   రా! రా! రా!  ;   ||నందగోప|| 
;
====================;
 ;
                wennela alalu ;-  
 ; 
namda gOpa kuwalayaawRtEmdubimbamA!
kumdaradana, ii raadhika nii korakai ; 
kumjawanamunamdu chaala kumduchunnadi ; 
nikumja wanamunamdu taanu sommasilenu! ;   
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa||  
;
mukkera muddiDu wennela alalalOna ; 
ukkiri bikkiri autunnadiraa,  raa! raa! ; 
muwwala mrokkeDu yamunA nIrammunu ; 
aawalaku trOsi wEyuchunnadiraa : raa! raa! 
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa|| 
;
kannula kaamtula duureDu minnuku; 
reppa talupulanu wEsi, mUyuchunnadirA! raa! ;
     raa! raa!  raa! 
          raa!raa! raa!;    ||namdagOpa|| 
;
ennaDu e kshanamamdu nIwu - wachchedawO yanuchu ;
tanadu mAnasapurilO - muggulEyuchunnadi
wannechinneluuru muggulenno wEyuchunnadiraa! 
           raa! raa!  raa! 
                raa!raa! raa!;    ||namdagOpa|| 

*************************************;
 ; [ పాట  65 ; బుక్ పేజీ  70 ]    శ్రీకృష్ణగీతాలు ; 
8:28 PM 9/19/2016  రాధామనోహర ; copy there ; link ;

లలనలు

ఎందు దాగెనో వనమాలి !? 
లలనలుండిరిట మతిమాలి ; 
బృందావనిని  నిండినవి - 
ఉసురుసురనుచును  
ఆమని వేడి నిట్టూరుపులు ;  || 
;
యమునలోని అలలన్నీ వాని కోసమై ; 
అలజడి హోరులో - అటనే జడమై పోయినవే!;  || 
;
నింగి నీరదము వాని కోసమై ; 
ఉరుముల పటహము వాయించి, వేగిపోయినది ;  ||

=======================================;

                   lalanalu ;- 
emdu daagenO wanamaali !? 
lalanalumDiriTa matimaali ; 
bRmdaawanini  nimDinadi - 
usurusuranu aamani niTTUrupulu ;  || 
;
yamunalOni alalannii waani kOsamai ; 
alajaDi hOrulO - aTanE jaDamai pOyinawE!;  || 
;
nimgi neeradamu waani kOsamai ; 
urumula paTahamu waayimchi, wEgipOyinadi ;  || 
;
      పాట 75 ; బుక్ పేజీ  80 , శ్రీకృష్ణగీతాలు ;

 ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►

Saturday, October 1, 2016

చుక్కలు చుక్కలు

నీటి చుక్కలు, నింగి చుక్కలు ; 
రాధ పంటి మెరుపు చుక్కలు ; ||

ఆకు కొసలను జారుచున్నవి 
చుక్క చుక్కగ మంచు చుక్కలు! 
చెట్టు నీడను -
రాధికా రమణి పయిన 
దండలే ఔతున్నవి! 
అవి,
దండలే ఔతున్నవి!|| 
;
దానిమ్మ పుప్పొడి జాలువారుచు ; 
చుక్క చుక్కగ రాధ చెక్కిట వాలెను ;
మకర పత్ర - చిత్రలేఖన రచన -
శ్రమ ఎంతో తగ్గెను! 
కృష్ణునికి 
శ్రమ ఎంతో తగ్గెను!|| 
;
ఉడుత కొరికి ఊసినట్టి ; 
పండు తొక్కల చిన్ని ముక్కలు ; 
రాధ మోమున రసము చిప్పిల ; 
దిష్టి చుక్కగ వరలెను
సిరి దిష్టి చుక్కగ వరలెను || 

============================ ;
neeTi chukkala nimgi chukkalu ; 
raadha pamTi merupu chukkalu ; ||
;
aaku kosalanu jaaruchunnawi 
chukka chukkaga mamchu chukkalu! 
cheTTu neeDanu ; 
raadhikaa ramaNi payina ; 
damDalE autunnawi! 
అవి damDalE autunnawi!||
;
daanimma puppoDi jaaluwaaruchu ; 
chukka chukkaga ; 
raadha chekkiTa waalenu ;
makara patra - chitralEKana rachana -
Srama emtO taggenu
krishNuniki 
Srama emtO taggenu!! ||
;
uDuta koriki uusinaTTi ; 
pamDu tokkala chinni mukkalu ; 
raadha mOmuna rasamu chippila ; 
dishTi chukkaga waralenu ;
siridishTi chukkaga waralenu || ; 
;
***************************************;
;
Kusuma Piduri ;- 4 ఆగస్టు JaikrishNA ;-
;
[ 31 జన, 2016 - మృదు మధుహాసము;.
మనోహర రూపము;. కని కని మురిసెను;.
ఆ బాల గోపాలము ||. ;.
నెమలి పింఛమాడెను ;. నుదురు పయిన ; ....
లెక్కించుదమా, రాగమయీ! రమణి రాధికా ! ||
;
] 1 ఆగ, 2009 - రమణి రాధికా! రాసలీలా లోలుని మణి కుండలములు -
నీ నీలి కన్నులై మిలమిలమన్నవి శౌరి కౌస్తుభాభరణము నీదు - ...
నుదురు పయిన నీలి నీలి ముంగురులాడినవి // 

చెప్పవోయీ కృష్ణ!

ఏమి కావాలో చెప్పవోయీ కృష్ణ!
కాస్త చెప్పవోయీ కృష్ణ!   ||

షడ్రసోపేతముల విందులే కావలెనా!? క్రిష్ణ!
శబరి ఒసగిన పళ్ళు చాలునంటావా!?  ||
;
ఉట్టిపై క్షీరములు కోరెదవు, బాలుడా!  
నేస్తులతొ జెట్టీలు పెట్టుకుంటావు ;   ||
;
గోరంత వెన్నను మోమంత పులుముకుని ; 
వేణు రవళిగ మోవి చిరు నగవులిస్తావు!   ||
[ క్రిష్ణ మురళి];- 
==========================
;
shaDrasOpEtamula wimdulE kaawalenA!? krishNa!
Sabari osagina paLLu chaalunamTAwA!?  ||
;
uTTipai ksheeramulu kOredawu, bAluDA! 
nEstulato jeTTIlu peTTukumTAwu ;   ||
;
gOramta wennanu mOmamta pulumukuni ; 
wENu rawaLiga mOwi chirunagawulistaawu!  ||

చినుకు ధార చిత్రాల హోర

చిక్కు చిక్కుల చిత్రం - చిత్రాంగి చిత్రం   ; 
నీలాల నింగి ఇటు లాల పోస్తూన్నది ; 
తన ముద్దుబిడ్డ ఈ పుడమితల్లికి ; ||
;
చినుకు చినుకు ధార ; 
చిత్రాల హోర ; 
మెరుపుల ఊలుతో ఎన్నెన్ని అల్లికలో! 
మబ్బుల అత్తలు అల్లుతున్నారు   ||
;
చినుకు చినుకు ధార ; 
చిత్రాల హోర ; 
పాలధారల కన్న - ఇవియె మిన్న! - 
అంటాడు కన్నయ్య ; 
అంటూనె ఉరకలిడు వానజల్లులలోకి!  ; ||
;
చినుకు చినుకు ధార 'క్షీరాభిషేకములు ';  
శ్రీరంగధామునికి పాలాభిషేకం ; 
నీ మాట నెపుడైన ; 
మేము కాదందుమా!? చిన్నారి కన్నా! ;

==================================;
;
chikku chikkula chitram - 
chitraamgi chitra ;
neelaala nimgi iTu laala pOstuunnadi ; 
tana muddubiDDa ii puDamitalliki ; ||
;
chinuku chinuku dhaara ; 
chitraala hOra ; 
merupula uulutO ennenni allikalO! 
mabbula attalu allutunnaaru ||
;
chinuku chinuku dhaara ; 
chitraala hOra ; 
paaladhaarala kanna - iwiye minna! - 
amTADu kannayya ; 
amTUne urakaliDu waanajallulalOki!  ; ||
;
chinuku chinuku dhaara 'kshiiraabhishEkamulu ';  
Sreeramgadhaamuniki paalaabhishEkam ; 
nee mATa nepuDaina ; 
mEmu kaadamdumA!? chinnaari kannA! ;
;