Friday, March 8, 2013

బర్మాలో ఐరావది నది


ఇరవాడి డాల్ఫిన్ (Irrawaddy dolphin (Orcaella brevirostris))
బర్మా నదీ ముఖద్వారాలలోనూ, అండమాన్ సాగరం లోనూ ఉంటాయి.
బర్మా (గతంలో "సయాం") లోని ముఖ్యమైన నది "ఇర్రవడి".

ఐరావది నదిని మునుపు "రావి" అనేవారు. హిందూ ఇతిహాస, పౌరాణిక గాధలలో
ఏనుగులకు ప్రత్యేక స్థానాలు ఉన్నవి. అష్ట దిగ్గజములు - అనగా ఎనిమిది ఏనుగులు,
ఇవి ఎనిమిది దిక్కులకు ప్రతీకలు.
అలాగే వీనికి జతలుగా, ఆడ ఏనుగులు-
అన్నిటికీ పేర్లు, 8+8= 16 కలవు.

ఈ అష్ట దిగ్గజములలో ఒకటి "ఐరావతము",
ఇది సురాధిపతి ఇంద్రుని వాహనము.
బర్మాలోని ఇరవదిడి నదికి - ఐరావతము- అనే నామము ఆధారము.
Ayeyarwaddy అని కూడా బర్మాలో (సంస్కృతము- పాలీ భాషా రూపము) పిలుస్తారు.

**********************;

మొట్టమొదట - విశాఖపట్టణము వద్ద బంగాళాఖాతంలో
1852 లో సర్ రిచర్డ్ ఓవెన్ కనుగొన్నారు;

విశాఖ వద్ద చూసిన Sir Richard Owen  1852 లో గ్రంధస్థం చేసి,
ప్రపంచ జంతు ప్రేమికులకు పరిచయం చేసాడు.
ఒరిస్సాలోని చిలక సరస్సు, కంబోడియా మున్నగు సీమలలో అగుపిస్తాయి.
సముద్ర, నదీ సంగమ జలములలో "డుగాంగ్", నక్షత్ర తాబేళ్ళు,
ఇంకా అసంఖ్యాక జలచర, పక్షులు ఉన్నవి.

***********************;
రుడ్యార్డ్ కిప్లింగ్ (30 డిసెంబర్- 1865 -18 జనవరి 1936) రాసిన "మాండలే" పద్యం
[Rudyard Kipling- "Mandalay"  ]
బర్మా జలధి వాతావరణాన్ని వివరిస్తుంది.
కిప్లింగ్ రచన జంగిల్ బుక్ -
ఆబాలగోపాలానికీ వినోదాన్ని పంచిపెట్టిన రచన
The Jungle Book
;






;




జంగిల్ బుక్స్ - కథా ప్రపంచాన ఏనుగులకు ముఖ్యమైన పాత్రలను పోషించాయి.
ఐరావది నదీ సుక్షేత్రాలలో పచ్చదనాలతో అలరారు అరణ్యాలు,
పైర్లు, ప్రకృతి సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
బర్మాలో _ ఏనుగులు - మహావృక్షాల మ్రానులనూ, దుంగలనూ
అవలీలగా నిర్దిష్ట గమ్యాలకు చేరుస్తూంటాయి.
మావటివాళ్ళు ఏనుగులకు శిక్షణ ఇచ్చి, కష్ట తరమైన పనులను సాధిస్తున్నారు.
మావటివారు "గజ విద్య" కళాత్మకంగా ఉంటూ,
సందర్శక, టూరిస్టులకు జిజ్ఞాస, ఆసక్తిని కలిగిస్తూంటుంది.
గజములు టేకు మాకులను తొండంతో చాకచక్యంగా ఎత్తి,
లక్ష్య ప్రదేశాలకు చేరుస్తూంటాయి.
"the hathis pilin' teak" అని ఈ హస్తి చలనాలకు పేరు.
'హాథీ'- అనేది హిందీ పదము నుంచి వచ్చింది.

"Mandalay" - poem బర్మా తీరాల అందాలను కవితాధారగా ప్రవహింపజేసింది.

రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన పద్యం On the road to Mandalay వలన, ఐరావడీ నదీ డెల్టా ప్రాంతాలు, అందమాన్   బేసిన్  జలధి - "మాండలే రోడ్" అని ప్రసిద్ధి చెందింది.

           On the road to Mandalay,
            Where the flyin' fishes play,
            An' the dawn comes up like thunder outer China
            'crost the Bay!


ఈ నది పేరునే అక్కడి నది, కడలి జలాలలోని ప్రత్యేక మత్స్యానికి పెట్టారు.
Irrawaddy dolphin














Irrawaddy dolphin
;
Rangoon to Mandalay  (Link - for poem)


No comments:

Post a Comment