Friday, March 8, 2013

గీత పల్యంకిక


నిశిరేయి తరువునకు;
పూసినవి తారకలు;
చుక్కల్ల మిణుగురుల
కాంతులను మోయుచూ;
సాగేను నా పాట
గగన పర్యంతమ్ము||
;
నా పాట పల్లకి
పదిలంగ ఉన్నాది;
కుదుపులు లేకుండ ;
తెమ్మెరల బోయీలు
మోయుచున్నారు ||
;
గీతాల పల్యంకిక,
కుశలముగ ఉన్నాది;
చెలియ కులుకుల్లార!
ముసిముసినవ్వులతొ;
విచ్చేసి వేడుకగ;
ఆసీనులవ్వండి ||
;






















****************************;


niSirEyi taruwunaku;
puusinawi taarakalu;
chukkalla miNugurula;
kaaMtulanu mOyuchuu;
saagEnu naa paaTa;
gagana paryaMtammu||
;
naa paaTa pallaki
padilaMga unnaadi;
kudupulu lEkumDa ;
temmerala bOyiilu
mOyuchunnaaru ||
;
giitaala palyamkika,
kuSalmuga unnaadi;
cheliya kulukullaara!
musimusinawwulato;
wichchEsi wEDukaga;
aasiinulawwamDi ||

****************************;
గీతాల పల్యంకిక కుశలముగ ఉన్నాది

No comments:

Post a Comment