#నడవాలో అమ్మాయిల ఆటల సందడి;
బొమ్మల కొలువులు, బూజం బంతులు,
పెళ్ళి సందడికి షడ్రుచి విందులు:
నీరెండ వసారాలో క్రీనీడల సోయగాలను పరుస్తున్నవి:
అలనాటి నా బాల్యాన్ని,
నా కనుదోయి వాకిలిలోనికి తెస్తూన్నవి:
ఎదురింటి ప్రభాస్ కెమేరా కట్టుకుని వచ్చి వాలాడు
“ఫ్రెండ్! ఈ చిన్నారుల కేళీఛాయలు,
మేరా (मेरा) కెమేరా నేత్రం పసికట్టింది:
అందుకే వచ్చేసాను,
ఈ తడవ నా ఫొటోగ్రఫీకి బహుమతి ఖచ్చితం!”
కెమేరా లెన్సును సరిచేసుకున్నాడు,
నిజమే! మండువా కేళీ దృశ్యాన్ని,
చిటికెలో కనిపెట్టింది నా నేస్తం మనో రసస్పందన!
మిత్రుని హృదయ రంగాన
ఆవిష్కరణోత్సవ సంరంభాన్ని నెలకొల్పుతూన్నది!
;
;
అది సరే! మరి ఇప్పుడు
ఈ పంచలోని
ఈ పంచదార బొమ్మల చక్కని ఆటపాటలు,
నా మానస సరోవర తీరాన్ని –
అందచందాలకు నెలవులుగా రూపొందిస్తూన్న
ఈ వింత వింత వైనాలను;
నవలగానో, కథగానో మలిచే
ఒక అక్షర శిల్పి -
నిలుచున్న పళాన- ఎదురైతే
ఎంత కుశాలుగా ఉంటుంది!
నా భావాలను
రసరమ్య మందిరంగా చిత్రించే ఓ రచయిత్రి
తటాలున తటస్థపడితే ఎంత బాగుంటుంది!!!!!
************************,
ప్రభృతి - photo link:-
http://www.rgbstock.com/bigphoto/n4Cz51a/Watching+the+Sun
(వరండాలో నీడలు - చక్కెరబొమ్మలు ప్రభృతి ;
రచన:: కాదంబరి)
******************************************;
No comments:
Post a Comment