Friday, March 8, 2013

మురిపించే ముత్యాలు


చిరు చిరు ఆశల చిగురుటాకుల లాహిరి!
పుష్ప మంజరీ సాహిరి:
చిత్ర భావముల అల్లరి - ప్రకృతి కిత్తును
నేను ఈ మధురసవాహినీ కావేరి!

అంబర నీలపు వస్త్రపు నేతను!
"నాకు నేర్ప"మని
మరి మరి అడుగుతూనె ఉంటాము మేము!
దేవీ చేలాంచలము కొసలను పట్టి;
తల్లి అడుగుల అడుగులు వేస్తూ వేస్తూ;
నడిచే మురిపెపు ముత్తెములం!
గారాబు పాపలమె మేమందరము!      

ఉదయ కిరణ ప్రభా మందిరము
తల్లీ! నీదే! ఐతే నేమి?
అందందందరి నుడువుల ముచ్చట్లు
        ప్రతిధ్వనిల్లగ జేసే చనువును
నీవే ఇచ్చితివమ్మా! కదుటమ్మా!?

భగవానుని ఒడిలో బుడి బుడి నడకల
          ఆడుతూన్న పసి కూనలము!
ఆది జనకుల కడ,
ఆమాత్రం - అనునయ, భేషజ అనురాగాలను-
ఒలికించే- గారాబం కలిగినవారము కదుటమ్మా!?  
భళిరే! మీవద్ద కాక మరి వేరెవ్వరి సన్నిధి
నింత సౌలభ్యత పొందగలుగుదుము,
మాతా! మీరే చెప్పండీ!
;













playing childrean (photo link)


(rachana: కుసుమ)

****************************;
కవిత "మురిపించే ముత్యాలు "


అఖిలవనిత
 20570 పేజీవీక్షణలు - 703 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 38339 పేజీవీక్షణలు - 967 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2320 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

No comments:

Post a Comment