
రావె రాధా! రావె రమణీ! –రండి చెలియలు చెలువము మీర ||సరసుల దరిని – మనల నెంతగా వేసట బెట్టెనొ నిన్నకు నిన్న;ఏమి దరువులు వేయు చుండెనో- రామ చక్కని చిన్న పిల్లడు ||సతతము మనలను సతాయించును - నిత్యము వీనితొ సంత గోలలే!“హితుడను నేనే,మీకు “ అనుచును – మాటల గారడి ని ముంచెత్తును ||కొమ్మల కొనలను ఎక్కి కూర్చుని – మన వలువలు దాచి“కొమ్మలార! నన్నే వినుడ”ని – వింత వేదాంత బోధలు గరపును ||చిటారు కొమ్మల మిఠాయి పొట్లా – లవి ఏమిటొ కను గొన్నారా!?“అరరే! వనితల కోకలు గాదే!? – అవి మన మేనుల దుస్తులు ఓ యమ్మా!” ||
No comments:
Post a Comment