Wednesday, August 4, 2010

ఆమోదము ఆ " మోదము"

















ఏ వేళల నందైనను -ఆమోదము ఆ " మోదము"
సమ్మోదకరమే సతతం ఆ పరవశము ||
ముకుళిత హస్తమ్ములతో శత కోటి వందనములు
సకల లోక ఏలికకు – మది పుష్పము నొసగు నప్పుడు
అకలంకం మోదమిది – అనుభవైక వేద్యమౌ
ఆ తన్మయ ,భక్తి పారవశ్యమ్ములు
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

బృందా వన వినోదికి దవనాలు, మరువాలు –
నవ రస భరితము ఎపుడూ- వనజ నాభు గాథలు
ధవళ తేజో మూర్తి ,దరిశనమున తరియించగ
ఆ తన్మయ ,భక్తి పారవశ్యమ్ములు
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

కనక చేల ధారికివే – కనకాంబర హారములు
వారిజాక్షు మ్రోల నివే – పారిజాత సుమ కోటి
జగముల నలరించు వాని కివే అలంకారములు
మా నయనమ్ముల కోవెలల కొలువుండుము స్వామి!
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

No comments:

Post a Comment