Sunday, October 29, 2017

కుడి ఎడంగా అంతే కదా

ఆ స్వర్గానికి సరిసాటి ; 
ఈ పృధ్వీ తలము ;
కుడి ఎడమగ, ఔనమ్మా ;  ||
ఆలమందల మేపేను ; 
పచ్చిక బయలుల కిష్టయ్య ;  
ఆవులమందల మేపేను :  ||
;
ఆరుబయలుల పచ్చందనములు ; 
కన్నుదోయికి మేలు మేలు మేలు ;  
మేలైనట్టి షడ్రుచుల విందులు ; 
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము 
కుడి ఎడంగా, ఔనమ్మా ;  ||
;
ఉద్యానములలోన దోబూచి ఆటలు ; 
వనితల మేనుల సౌరభ వెల్లువలు ; 
పొదరింటి ప్రతి ఆకు, పువులు పొందేను ; 
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము 
కుడి ఎడంగా, ఔనమ్మా ;  ||
;
యమునలో క్రీడలు, రాసాటలు ; 
ఝరి నీరు పన్నీరు ఆయెనండీ ;
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము ;
కుడి ఎడంగా, ఔనమ్మా ;  || 
;
=======================;
;
aa swargaaniki sarisaaTi ; 
ee pRdhwee talamu - 
kuDi eDamaga, aunammA :  || 
aalamamdala mEpEnu ; 
paccikabayalula kishTayya ;  
aawulamamdala mEpEnu ;  ||
;
aarubayalula paccamdanamulu ; 
kannudOyiki mElu mElu  mElu ;
mEainaTTi shaDrucula wimdulu ; 
aa swargammu sarisaaTi ; 
ee pRdhwee talamu - kuDi eDamaga, aunammA :  ||
;
udyaanamulalOna dObUci ATalu ; 
wanitala mEnula saurabha welluwalu ; 
podarimTi prati aaku, puwulu pomdEnu ; 
aa swargammu sarisaaTi ; 
ee pRdhwee talammu -  
kuDi eDamaga, aunammA :  ||
;
diwya seemalaku sATi ;
mana  bhuu talamu 
kuDi eDamaga, aunammA :  ||
;
yamunalO kreeDalu, raasaaTalu ;
jhari neeru panneeru aayenamDI ;
diwya seemalaku sATi ;
mana  bhuu talamu 
kuDi eDamaga, aunammA :  || 
;
; [ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ;

తాత్సారం చేయకండి

తాత్సారం చేయకండి, వేళ ఆయెను ; 
గోవర్ధన గిరి పూజ వేళ ఆయెను ;  ||
;
ఉగ్రసేన తాతలు ; అవ్వలు, ముత్తవ్వలు ; 
ముత్తాతలు గునగునా ముందు నడుస్తున్నారు ; 
యువత మీకు మగత ఇంత!?, 
వడి వడిగా ముందుకు నడవండి ; 
మునుముందుకు నడవండి ;  || 
;
ఏడు తేజిల సూర్య - రధమును 
వడి ఓడిస్తూ ; 
మన బళ్ళు చకచకా సాగాలి ; 
మునుముందుకు  సాగాలి ; 
;
ఒంటెద్దు శకటముల జోరు ; 
జోడెడ్ల బళ్ళు - జోర్ జోరు జోర్ జోరు ;
మించగ గలదా వేగంలో ;
తూరుపున ప్రభాకరు తేరు ;  || 
;
కొనగోటిని కొండలను నిలుప గలుగు 
గోవిందుడు గోపాలుడు ;
ఇడిగో - మన అండ దండ ; 
నిర్విఘ్నంగా చేద్దాము పూజలను  ;  ||
;
===========================;
;
taatsaaram cEyakamDi ; wELa Ayenu ; 
gOwardhana giri pUja wELa Ayenu ;  ||
;
ugrasEna taatalu ; awwalu, muttawwalu ; 
muttaatalu ; gunagunaa mumdu naDustunnaaru ; 
yuwata meeku magata imta!?, 
waDi waDigA mumduku naDawamDi ; 
munumumduku naDawamDi ; ;; || 
;;
EDu tEjila suurya - radhamunu  
waDi ODistuu ; 
mana baLLu cakacakaa saagaali ; 
munumumduku saagaali ; 
omTeddu SakaTamula jOru ; 
jODeDla baLLu - jOr jOru  jOr jOru  ; 
mimcaga galadaa wEgamlO ; 
tuurupuna prabhaakaru tEru ;  || 
;
konagOTini komDalanu ; 
nilupa galugu gOwimduDu gOpAluDu ; 
iDigO - mana amDa damDa ; 
nirwighnamgaa cEddaamu puujalanu ;   || 
;
 [ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ;

రమణీయ మాణిక్య వీణ రాధిక ;

ఈ సన్నని తంత్రి ;
వీణకై గాలింపు ;
ఈ తీగ కొక ఆట ;;;;;
;
రమణీయ మాణిక్య వీణ మన రాధిక ; 
రాధ డెందము ఎపుడు ; క్రిష్ణ మమతల కొలువు ;  || 
;
వీణపై కెక్కిన రాగ మందారమే : 
రాగ మెక్కించుకొన ;; 
గాన సింగారమే ;  || 

కొన గోటి మీటులె చాలు ;
నిలువెల్ల పులకింత ; 
ఏడు స్వరములె చాలు 
ఇంద్ర భోగములు ;  ||  

ఎన్నెన్ని రాగాలు , 
ఏమి గీతాలు ; 
తీగ సన్ననిదోయి, 
రూపు మితమేనోయి ;; 
అమితమీ రాగముల ; 
తొణుకాడు మాధురి ;  || 
=======================;
;
ee sannani tamtri ; 
weeNakai gaalimpu ;; 
ee teega koka ATa ;
;
weeNapai kekkina raaga mamdaaramE : 
raaga mekkimcukona ;; 
gaana simgaaramE :  ||
;
kona gOTi mITule cAlu ;; 
niluwella pulakimta ; 
EDu swaramule cAlu; 
imdra BOgamulu ;  ||
;
ennenni raagaalu ; Emi gItAlu ; 
teega sannanidOyi ; ruupu mitamEnOyi ;; 
amitamee raagamula ; toNukADu maadhuri ;  || 
;

పౌనః పున్యం సత్యం

క్రిష్ణుడు, ఎరుగను నేను అంటాడు ; 
ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || 
;
కుండల వెన్నలు, మీగడలు ; జున్ను, పెరుగులు ; 
ఎట్లుంటాయో ఎరుగను, నేను అంటాడు, 
క్రిష్ణుడు, ఎరుగను నేను అంటాడు ; 
ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || 
;
అంతెత్తు ఉట్టి మీది ; చట్టి లెవరు దించారో ; 
వెన్నలన్ని ఖాళీ చేసి ; పగుల గొట్టారో ; 
ఎరుగనే ఎరగను - అంటున్నాడు ; 
క్రిష్ణుడు ఎరగను - అంటున్నాడు ;
ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || 
;
గోలే గోల, గోలే గోల ;
మోకులు విప్పి గోవు లేగలను ; 
విచ్చలవిడిగాను వదిలేసిన దెవరో, వేరెవరోను ; 
నేను కాదు అంటాడు ; ఒట్టేసి మరీ చెబుతాడు ;
క్రిష్ణుడు ఒట్టేసి మరీ చెబుతాడు ;
ఎంతమాత్రం నిజము కానే కాదు ;  || 
;
ఐనా మా బాగే ; ఆకతాయి చేష్ఠ్లలన్ని ముద్దే ముద్దు ; 
క్రిష్ణు నెపుడు వీడము ; ఇది మాత్రం నిజం నిజం ; 
పౌనః పున్యం ఈ సత్యం ; వీక్షణముల పుణ్యాలు ;  || 
;
====================================;
;
krishNuDu, eruganu, nEnu amTADu ; 
emtamaatram nijamu kaanE kAdu ;;  ||
kumDala wennalu, meegaDalu, junnu, perugulu ; 
eTlumTAyO eruganu, nEnu amTADu ;
krishNuDu, eruganu nEnu amTADu ;
emtamaatram nijamu kaanE kAdu ;  ||
;
amtettu uTTi meedi ; caTTi lewaru dimcArO ; 
wennalanni KALee cEsi, pagula goTTArO ; 
eruganE eraganu - amTunnADu ;
krishNuDu, eruganu, 
emtamaatram nijamu kaanE kAdu ; ||
;
gOlE gOla, gOlE gOla ;  
mOkulu wippi, gOwu lEgalanu ; 
wiccalawiDigaanu wadilEsina dewarO, wErewarOnu ; 
nEnu kaadu amTADu ; oTTEsi maree cebutaaDu ;  
krishNuDu oTTEsi maree cebutaaDu ; 
emtamaatram nijamu kaanE kAdu ;  || 
;
ainaa maa bAgE ; aakataayi cEshThalanni muddE muddu ; 
krishNu nepuDu wIDamu ; idi maatram nijam nijam ; 
pauna@punyam ee satyam ; weekshaNamula puNyaalu ;  ||
;
 [ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ; 

సాంద్రం, మంద్రం చిరు గాలి

సాంద్రం, మంద్రం చిరు గాలి ;  
కోపం వస్తే సుడి గాలి ;
రౌద్రం వస్తే సడిగాలి ; 
జడిపించేను లోకాల్ని ;
;
ఉడుకుమోతు ఐ చిరుగాలి ; 
మిడి మిడి మిడుకుతు ఉన్నట్టి 
ఈ ఈదురు గాలి ; 
గడ బిడ ముడి వడి - ఈదర గాలి ;  || 
;
సెగల ఊష్ణమౌ వడ గాలి ;
వానల వెల్లువ దడగాలి ;  
గమ్ముగ ఊరక ఉండదుగా ;
ప్రభంజనమ్ముగ హోరెత్తు  ;  ||
;
ఔషధ మొకటే తనకంట ; 
రవంత చోటు చాలంట ;
క్రిష్ణ మురళిలో ; 
రవంత చోటు చాలంట ;  ||    
;        
=======================;
;


;

సవ్య ప్రదక్షిణ గాలి

గుడు గుడు గుంచం ఆటల గాలి ; 
పొద్దు పుచ్చుతోంది - గాలి, 
బాగా పొద్దు పుచ్చుతోంది ;  || 
;
రాధా క్రిష్ణుల జంటకు చుట్టూ ; 
తిరుగుతు చేయు ప్రదక్షిణము, సవ్య ప్రదక్షిణము ;  ||  
;
సోగగ ఒక పరి ; షోకుగ మరొక్క తీరున ; 
తిరుగుచు చేయు ప్రదక్షిణము ; సవ్య ప్రదక్షిణము ;  || 
;
ఈ తూరిక్కడ - కాదు పొమ్మంటె ; బిగదీసుకొనును గాలి 
తూరి తూరికి ఈ చాదస్తం, మర్మ మెరుగ లేము ;  || 
;
======================================;
;
guDu guDu gumcam ATala gaali ; 
poddu puccutOmdi - gaali, 
baagaa poddu puccutOmdi ;;  ||
;
raadhaa krishNula jamTaku cuTTU ; 
tirugutu cEyu pradakshiNamu, 
sawya pradakshiNamu ;;  || 
;
sOgaga oka pari ; shOkuga marokka 
teeruna ; tirugucu cEyu pradakshiNamu ; 
sawya pradakshiNamu ;  || 
;
ee tuurikkaDa - kaadu pommamTe  ;bigadeesukonunu gaali ;; 
tuuri tuuriki ee caadastam - marma meruga lEmu ;  || 
;
[ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] 
;

ఈదురు గాలి గడబిడ

సాంద్రం, మంద్రం చిరుగాలి ;  
కోపం వస్తే సుడి గాలి ;
రౌద్రం వస్తే సడిగాలి ; 
జడిపించేను లోకాల్ని ;
;
ఉడుకుమోతు ఐ చిరుగాలి ; 
మిడి మిడి మిడుకుతు ఉన్నట్టి 
ఈ ఈదురు గాలి ; 
గడ బిడ ముడి వడి - ఈదర గాలి ;  || 
;
సెగల ఊష్ణమౌ వడ గాలి ;
వానల వెల్లువ దడగాలి ;  
గమ్ముగ ఊరక ఉండదుగా ;
ప్రభంజనమ్ముగ హోరెత్తు  ;  ||
;
ఔషధ మొకటే తనకంట ; 
రవంత చోటు చాలంట ;
క్రిష్ణ మురళిలో ; 
రవంత చోటు చాలంట ;  ||    
;        
=======================;
;
saamdram, mamdram ciru gaali ; 
kOpam wastE suDi gaali 
raudram wastE saDi gaali ; 
jaDipimcEnu lOkaalni ;  ||
;
uDukumOtu ai ciru gaali ; 
miDi miDi miDukutu unnaTTi 
ee eeduru  gaali ;  
gaDa biDa muDi waDi - iidara  gaali ;  || 
;
segala uushNamau waDa gaali ; 
waanala welluwa daDa gaali ; 
gammuga uuraka umDadugaa ; ; 
prabhamjanammuga hOrettu ; || 
;
aushadha mokaTE tanakamTa ; 
rawamta cOTu caalamTa ; 
krishNa muraLilO ; 
rawamta cOTu caalamTa ;  ||
;
ఈదురు గాలి గడ బిడ  ;-
[ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ;

జాలు పుప్పొడి సన్నాహం

జాలు పుప్పొడి సన్నాహం ; 
వేసెను దారి నీ కోసం ;
క్రిష్ణా, వేసె రహదారి నీ కోసం ;  ||

యమునా వాహిని నింపాది  ;
సోలుతు ఉన్నది తీరమున ;
ఎలమావి ఛాయల చిరు భీతి ;
రమణి నమ్మకం నీ పైన ; 
బేల రాధిక - ఎదురుచూపులు నీకోసం ;  ||
;
పున్నాగ పూవున సన్నాయి ; 
రాధ రాగమున వెదజల్లి, 
అనురాగమున వెదజల్లి ;
ఉబుకుబికి పరిమళం ఉవ్వెత్తు ;
నిఖిల ప్రకృతికి ఈ హాయి;  ||
;
నీరవ నిశ్శబ్దమీ రేయి ; 
రాధ కన్నుల జాల్వారు 
ఆనందాశ్రువుల జడి తడిసి ; 
పునీతమయ్యేటి రీతి వైచిత్రి ;
ప్రకృతి అగును కవయిత్రి ;  || =
;
=======================;
;
jaalu puppoDi sannaaham ; 
wEsenu daari nee kOsam ; 
krishNAnu rahadaari nee kOsam ;  ||
;
yamunaa waahini nimpaadi ; 
sOlutu unnadi teeramuna ;
elamaawi CAyala ciru bheeti ; 
ramaNi nammakam nee paina ; 
bEla raadhika - edurucuupulu neekOsam ;  ||  
;
punnaaga puuwuna sannaayi ; 
raadha raagamuna wedajalli, 
anuraagamuna wedajalli ;
ubukubiki parimaLam uwwettu ;
nikhila prakRtiki haayi ;  || 
;
neerawa niSSabdamI rEyi ; 
raadha kannula jaalwaaru ;
aanamdASruwula jaDi taDisi ; 
puneetamayyETi reeti waicitri  ;

prakRti agunu kawayitri ;  ||
;
[ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ;

పూల కుటీరం, ఆమ్రచ్ఛాయ

శరత్ చంద్రిక క్రిష్ణస్వామి ;
భక్తులెల్లరకు స్వామి ఆమని ;  || 

మిట మిట ఎండ ; 
చిటపట ఎండలు ; 
హడలి పోవుచుండె ; 
రాధ హడలి పోవుచుండె ;
"పూవుబోణి మన రాధ 
కందిపోవునను భయము ఏలనండీ!?
శంక ఏలనండీ!?  ....  ; "
|| శరత్ చంద్రిక క్రిష్ణస్వామి ;
భక్తులెల్లరకు స్వామి ఆమని || 
;
మిడి మిడి చలులు వీచిన గానీ ; 
జడ దడి వానలు కురిసిన గానీ ; 
ప్రచండ ఎండలు కాసినా గానీ ,  
తనకు అండగా నిలిచిన వాడు ;
శ్యామల క్రిష్ణుడు ఉన్నాడండీ :
;
సుంతైనా అనుమానములేల, 
పూల కుటీరం, ఆమ్రచ్ఛాయ,  
శ్రీక్రిష్ణస్వామి ఉన్నాడండీ : 
సుంతైనా అనుమానములేల, 
|| శరత్ చంద్రిక క్రిష్ణస్వామి ;
భక్తులెల్లరకు స్వామి ఆమని |||| 

===========================;
;
Sarat candrika  krishNa swaami 
bhaktulellaraku swaami aamani ;  || 
;
miTa miTa emDa ; 
ciTapaTa emDalu ; 
haDali pOwucumDe ; 
raadha haDali pOwucumDe ;  || 
;
SreekrishNa swaami unnaaDamDI : 
puuwubONi mana raadha ;
kamdipOwunanu bhayamu ElanamDI!?
Samka  ElanamDI!? ;  ||

miDi miDi calulu weecina gaanee ; 
jaDa daDi waanalu kurisina gaanee ; 
pracamDa emDalu kaasinaa gaanee ,  
tanaku amDagaa nilicina wADu ;
;
sumtainaa anumaanamulEla,
puula kuTIram, aamracCAya ;
Sree krishNa swaami unnaaDamDI : 
sumtainaa anumaanamulEla, 
;
||Sarat candrika  krishNa swaami ; 
bhaktulellaraku swaami aamani || 
;;
[[ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ]] ;

రాధ మనసు మెత్తన

మనసు మెత్తన ; 
రాధమ్మకు మనసు సుతి మెత్తన ;  ;  ||
;
కుదురుగ ఉండని తన తీరు ; 
వెన్న దొంగ ఐ, దెబ్బలు తింటూ ఉంటే ;
కళ్ళ నీళ్ళను పెట్టుకునే 
|| రాధ మనసు సుతి మెత్తనయా, 
ఏల తెలుసుకోవు!?  || ;
;
రక్కసులందువు, 
సర్పం, దుష్టుల మర్దన లందువు ;
ఏదో గడబిడ, గొడవలలోన ; 
వేలుబెడ్తూనె ఉంటావనుచూ ;
భీతిల్లును రాధ - 
మనసు సుతి మెత్తనని, 
ఏల తెలుసుకోవు!?
క్రిష్ణా! ఏల తెలుసుకోవు నీవు!? 
;
=====================;
;
manasu mettana ; 
raadhammaku manasu suti mettana ;  ;  ||
;
kuduruga umDani tana teeru ; 
wenna domga ai, debbalu timTU uMTE ;
kaLLa neeLLanu peTTukunE 
|| raadha manasu suti mettanayaa, Ela telusukOwu!?  || ;
;
rakkasulamduwu, sarpam, dushTula mardana lamduwu ;
EdO gaDabiDa, goDawalalOna ; 
wElubeDtuune umTAwanucuu ;
bheetilu  raadha manasu mettanani, 
Ela telusukOwu!? krishNA! Ela telusukOwu neewu!?  
;
[ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ; 

Sunday, October 1, 2017

చూపిన తర్జని నందలాల

అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి - నందలాల ;  ||
;
ఆరుబయలున చాల ;
ఆలమందలు గాచి ;
పని సోమరులకు నీవు ;
చూపిన తర్జని నందలాల ;  ||
;
మొండి గుర్రాలను ;
మచ్చికలు చేసేసి ;
ఐనావు రణమున ;
తేరుకు సారధి నందలాల ;  ||
;
నిలువెత్తు తార్కాణ
మీవె కార్యమ్ముల ;
చాటితివి జగతికి ;
లక్ష్య సిద్ధిని సూటి నందలాల ;  ||
;
జనని గీసిన గీటును దాటనంటూనే -
లోకముల కొసగావు -
మేటి భగవద్ గీత, నందలాల ;
భళి భళీ ఆనందలాల ;
;
అణువణువు ప్రకృతి ;
మనుగడకు అదె కృతి ;
మరపు రానీయవు ;
మానవాళికి తథ్యమీ
నిత్య ఫలశృతి నందలాల ;

అందించినావు కద నందలాల ;  ||  
;
=======================;
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
maanawALiki tathyamee
nitya phalaSRti  నందలాల;  ||
;
aarubayaluna caala ;
aalamamdalu gaaci ;
pani sOmarulaku neewu ;
cuupina tarjani నందలాల ;  ||
;
momDi gurraalanu ;
maccikalu cEsEsi ;
ainaawu raNamuna ;
tEruku saaradhi నందలాల ;  ||
;
niluwettu taarkaaNa
meewe kaaryammula ;
caaTitiwi jagatiki ;
lakshya siddhini suuTi నందలాల ;  ||
;
aNuwaNuwu prakRti ;
manugaDaku ade kRti ;
marapu raaneeyawu ;
maanawALiki tathyamee
nitya phalaSRti  నందలాల
amdimcinaawu kada నందలాల ;  || ;
;

Tuesday, July 11, 2017

కుంతీ పుత్రో వినాయకః

కుంతీ పుత్రో వినాయకః ;-
 గత దశాబ్దం వఱకు "కాపీ కొట్టుట" అనే మాట తఱచూ చర్చించబడేది. 
"గ్రంధ చౌర్యము" అనే అంశము వలన వాదోప వాదాలు జరుగుతూండేవి. 
రచన, సాహిత్య వర్గాలలో ఈ విషయమై ఇలాగ "గ్రంధ చౌర్యము, కాపీ కొట్టడము" లాంటి పదాలు 
వాడుకలో ఉన్నాయి. 
ఐతే సంగీత, నాట్యాది ఇతర కళలలో కూడా కాపీ సాధారణమే ఐనప్పటికీ, 
అచ్చట ఇలాంటి ప్రత్యేక పదమేదీ వాడుకలో ఉన్నట్టు కనుపట్టదు. 

***        ***        ***        

         ప్రాచీన లాక్షణికులు 
         "నాస్తి చోరః కవి జనాః" అనేశారు. 

         "చౌర్యం" అనే మాట సారస్వత వర్గాలలోనే మరింత ప్రాచుర్యములో ఉండటానికి కారణమేమిటి? 
సమాజంలో అభిప్రాయాలను రూపొందించడము, రచనల ద్వారా సత్వరమే సాధ్య పడుతూన్నది. 
కలం బలంతో, ప్రభుత్వాలనే మార్చిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఉంటూన్నాయి కాబట్టి, ఇతర కళల కన్నా "కలం బలమే మిన్న, అతి శక్తి మంతము" అని తోస్తూన్నది. ఈ కాపీ కొట్టడమనేది సినిమాలలో సుస్పష్టంగా గోచరిస్తూంటున్నది. 

         సినీ ప్రపంచము సర్వ కళా సమన్వయ వేదిక! కాబట్టే, అక్కడ కథ, సంభాషణలు, సంగీతము, డాన్సు, కెమేరా ఇలా ఒకటేమిటి, దాదాపు అన్ని కోణాలలోనూ కాస్తో కూస్తో కొండొకచో దాదాపు అంతా "కాపీ" వ్యవహారం విస్పష్టంగానే ఉంటుంది. అత్యంత ఖరీదైనది కాబట్టి ఇది రమా రమిగా ఆమోదించ బడ్తూన్నది కూడా! 

         "దేవ దాసు" వంటి (శరత్ చంద్ర ఛటర్జీ )నవలలు కొద్ది కొద్ది మార్పులతో, అనేక పర్యాయాలు వెండితెరకు ఎక్కి విజయ భేరీని మ్రోగించినాయి కదా! 

***        ***        ***        

         ఐతే "రచనలు, కళలు ఎంత మేఱకు కాపీ చేయ వచ్చును?" అని అభిజ్ఞుల ప్రశ్నయే ఇప్పుడు వ్యాసానికి ప్రాతి పదిక. "కాపీ కొట్టడమే తప్పు" ఇది నిర్వివాదాంశమే! తమాషా ఏమిటంటే, కొన్ని సార్లు మూల రచయిత/కళా సృజన కర్తలకు ఈ పరిణామం అతి విచిత్రంగా, మూల కర్తలకు "భక్తితో ఒసగే హారతి" గా పరిఢవిల్లుతూన్నది. 
"అబద్ధం వా    సుబద్ధం వా     కుంతీ పుత్రో వినాయకః||"
         "అనుకరణ" ను, కాపీ చేయడాన్ని ఆమోదించినప్పటికీ, మూల కర్తలకు "కృతజ్ఞతలను" ప్రకటించాలి. అది వారి సంస్కారానికి నిదర్శనమే కదా! 
;;
AF - ఇతిహాస దరహాస చాటువులు Essay ;  LINK ;
My File - Documents - 2010 KONamAnini ;;;;;;;;;;;;