పౌష్యలక్ష్మీ వస్తున్నది;
హంసగామిని రాక; ప్రకృతికి వేడుక
మకరసంక్రాంతికి పలుకుదము స్వాగతము ||
ఈరేడు లోకములు మత్తు నిద్దుర వీడ;
దరహాసకోటి ప్రభలను ప్రసరించినీవమ్మ!
నీ మందహాసముల ఉదయకిరణాళితో
వసుధ వెలుగుల -
"నిండు అపరంజి కలశమ్ము" ||
నిఖిల జగతికి జాగృతము సేయంగ; 
నీ వీక్షణములను; ప్రసరించవమ్మా!
నీ చల్లనిచూపులవెన్నెలలు విప్పార;
నెమలి ఆయెను జగతి; నాట్యచైతన్యాల ప్రగతి ||
హంసగామిని రాక; ప్రకృతికి వేడుక
మకరసంక్రాంతికి పలుకుదము స్వాగతము ||
ఈరేడు లోకములు మత్తు నిద్దుర వీడ;
దరహాసకోటి ప్రభలను ప్రసరించినీవమ్మ!
నీ మందహాసముల ఉదయకిరణాళితో
వసుధ వెలుగుల -
"నిండు అపరంజి కలశమ్ము" ||
నీ వీక్షణములను; ప్రసరించవమ్మా!
నీ చల్లనిచూపులవెన్నెలలు విప్పార;
నెమలి ఆయెను జగతి; నాట్యచైతన్యాల ప్రగతి ||
|  | 
| flying colors 
29284 - views  | 
 
 
No comments:
Post a Comment