Wednesday, January 14, 2015

పౌష్య దేవీ సిరికలశాలు

శ్రీవిష్ణుపత్ని - 
'పైరు పచ్చల సిరుల'   
సంక్రాంతి కలశమున తెచ్చెనండీ మనకు! 
||
శ్రీమహాలక్ష్మీదేవి 
సంక్రాంతి కలశమును తెచ్చెనండీ మనకు! ||  
  
ధాన్యలక్ష్మీ జనని  
భృకుటి ద్వయ ప్రభలందు ధనురాశి పొదుగగా; 
మకర రాశికి కొత్త అడుగుజాడలలోన పద్మములు విలసిల్లె   
||శ్రీమహాలక్ష్మీదేవి 
సంక్రాంతి కలశమును తెచ్చెనండీ మనకు! ||  

పుష్యమాసము మెచ్చు; 
హేమంత ఋతు సొగసు పీఠికాసనమందు; 
ఆసీన ఐనదీ అష్టలక్ష్మీదేవి; సంపదలను మన కిచ్చు
|| శ్రీమహాలక్ష్మీదేవి 
సంక్రాంతి కలశమును తెచ్చెనండీ మనకు! ||  
*************************
[పౌష్య దేవీ సిరి కలశాలు]  
 pongal  wishes 

No comments:

Post a Comment