Friday, January 23, 2015

క్రిష్ణుని బరువు ఎంత?

కొమ్మల్లో నక్కాడు, చక్కనోడు; ఎవ్వరికీ అంతు చిక్కనోడు; 
అందరి దరినే ఉంటూ మాయలు చేసేటి వాడు; ||

పొన్నకాయ లాంటోడు; పొగడ కొమ్మలపైకెక్కాడు;
మూడు లోకాలను మూడడుగుల కొలిచినాడు;
వాని బరువు నీ కొమ్మలు మోయగలుగునా? ||

పైన తాను దాచినట్టి, కోకల మాటున నుండి;
తొంగి తొంగి చూస్తాడు; వంగి వంగి చూస్తాడు  
ఆ రంగు రంగు చీరలెనక; నల్లనోడు; నక్కి నక్కి చూస్తుంటే
హరివిల్లు వెనుక నల్లమబ్బు తునక వెలసె నేడు|| 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౨౦౧౫ 

kommallO nakkADu chakkanODu; 
ewwarikii amtu chikkanODu; 
amdari darinE umTU maayalu chEsETi wADu; ||

ponnakaaya laamTODu; pogaDa kommalapaikekkaaDu;
muuDu lOkaalanu muuDaDugula kolichinaaDu;
waani baruwu nii kommalu mOyagalugunaa? ||

paina taanu daachinaTTi, kOkala maaTuna numDi;
tomgi tomgi chuustaau;
aa ramgu ramgu chiiralenaka; nallanODu;
hariwillu wenuka nallamabbu tunaka welase nEDu||  

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౨౦౧౫
 floor designs 











{మూడు లోకాలను మూడడుగుల కొలిచినాడు;
  వాని బరువు నీ కొమ్మలు మోయగలుగునా? ||}
© కుసుమాంబ(౧౯౫౫)

No comments:

Post a Comment