Friday, March 15, 2013

పూర్ణ కుంభము


హేమ మహర్షి గొప్ప తపస్సు చేసాడు.
ప్రసన్నుడైన విష్ణుమూర్తి దివ్య రధములో దివి నుండి భువికి వచ్చాడు.
నాలుగు తురగములు, ఏనుగులను పూన్చి ఉన్నఆ దివ్య రధము అది.
స్వర్గమునుండి ఆ తేరులో తన భక్తుని వద్దకు దిగివచ్చాడు స్వామి.
శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహమును పొందిన
హేమఋషి ఆశ్రమము ఉన్నచోట
"మహా మాగ కొలం"  కొలను వెలసినది.
దానికి "పొత్రమరై" (Potra marai kulam)
 "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే నీటి సరసులు ఉన్నవి.
ఈ సరోవర ద్వయానికి ఉద్భవ గాధ కలదు.

************************,

శ్రీ సారంగపాణి కోవెల ఉన్న ఊరు "తిరుక్కుండతై".
ఈ కోవెల "కుంభకోణము" నకు
ఒకటిన్నర మైలు దూరాన ఉన్నది.
స్థల పురాణము ప్రకార గాధలు కొన్ని కలవు.
ప్రళయవేళల బ్రహ్మదేవుని భుజాలపై ఉన్న బాధ్యత "సృష్టి పునర్ నిర్మాణము".
అందుకై సృష్టికర్త - అమృతము మొదలైన సామగ్రిని సేకరించాడు.
విరించి తన సేకరణలను ఒక కుండలో నింపాడు.
ఆ మట్టికుండను "మేరు పర్వత శిఖరము" (Mountain Meru) పైన
విరించి జాగ్రత్తగా అట్టిపెట్టాడు.
ప్రళయ కాలం వచ్చి, తెంపులేని వర్షాలతో అతలాకుతలం అవసాగింది.
బ్రహ్మ - అమూల్య వస్తు పూర్ణకుంభమును జాగ్రత్తగా రక్షించ పూనుకున్నాడు.
వరదభీభత్సాలనుండి
కుంభపరిరక్షణ - తక్షణ కర్తవ్య దేవతలు కైలాసమునకు వెళ్ళారు.
దివ్యుల కోరికపై - భవుడు శరసంధానము చేసాడు.
నారి సారించి, అంబును విడిచాడు సాంబసదాశివుడు.
మహేశుడు విడిచిన బాణము కుండను తాకింది.
కుండ బ్రద్దలై  అందులోని సుధారసము అక్కడ రెండు భాగాలుగా పడినది.
అవే "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే రెండు కొలనులు.
శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల ఇక్కడ వెలిసినది.
 కుంభకోణమునకు 1 1/2 మైళ్ళు దూరములో
ఈ ";తిరు కుండతై Thirukkudanthai " ఉన్నది.
కుంభము భగ్నమైన చోటు –
కనుక “కుంభ కోణము”/ కుండతై (Kundatai) అనే పేరు వచ్చి,
నేడు పుణ్యతీర్ధముగా విలసిల్లుచున్నది)

************************,

మూలవరులు:- Thirukudanthai శ్రీ సారంగపాణి:
శ్రీ మహా విష్ణు ధనుస్సు పేరు "శార్ఙ్గము"
అందుచే ఈ స్వామి పేరు "సారంగపాణి".
ఈ స్వామి - ఆరా అముధన్, అభయాప్త మిరుతన్, ఉత్థాన శాయి
మున్నగు పేర్లతో కీర్తించబడుతున్నాడు.
హేమమహర్షికి  ప్రత్యక్షమైనది ఈ చోటులోనే!
మూలవరులు ఉద్యోగశయన భంగిమలో ఉన్నారు,
అనగా అప్పుడే నిద్రనుండి మేల్కొన్న పొజిషన్ లో ఉన్నారు.
కోమలవల్లీ తాయారు ఈ కోవెలలో
మరొక దర్శన అభయ వరప్రదాయిని ఐ,
భక్తులను అనుగ్రహిస్తూన్నది.

Sri Komalavalli Thayar. Also called as
"Padi Thanda Pathini" ie thayaar
would never (leave out) or leave away from her chamber.
She has her own seperate sannadhi in this temple.

************************,


తిరుపతి, శ్రీరంగం, కాటుమన్నార్ కోవిల్,
ఆల్వార్ తిరునగరి, తిరువెల్లారై, తిరుకండియూర్,
తిరుపుల్లాం భూతం కుడి మున్నగు వాని వలె -
"పరంధామ క్షేత్రము".
"శంఖ చక్ర గదా పాణిం అహం వందే|
  శ్రీ శార్ఙ్గ నందక కౌస్తుభ ధారిణం వందే||"
        (ముత్తుస్వామి  దీక్షితర్ కృతి)
************************,




Tags:-

(Thirupati, SriRangam, Kaatu Mannar Kovil,
Alwar Thirunagari, Thruvellarai, Thiruvekka,
Thiru Kandiyur, ThiruKarambanoor,
Thiruputkuzhi and Thirupullamboothamkudi.
This place is treated a
s the place which explains
the meaning of "Paramathma Thathuvam")

(Kaveri River ,Arasalar)

************************,
Thirukkudanthai   (Link)
Thirukkudanthai  - Sri Sarangapani Perumal Temple

Tags:-
Maha magha kulam, Potra marai kulam
temple is Sri Sarangapani. Aara Amudhan,
Abayaryaapthamiruthan and Utthanasayi

ర్ఙ్గ "r~mga ;

Sunday, March 10, 2013

సువర్ణభూమి/ కర్పూర ద్వీపం


"సువర్ణభూమి" అని సుపరిచిత నామం.
బోర్నియో ను మన పూర్వీకులు "సువర్ణభూమి",
"కర్పూర ద్వీపం" అని పిలిచేవారు.
జావా ద్వీప ప్రజలు "బోర్నియో పురద్వీప" అనేవాళ్ళు;
అంటే "రత్న రాజ్యము" అన్న మాట.
అడవూలకు, తత్కారణముతో అనేక జంతుజాల,
తరు సంపదలకు స్వర్గ ధామమైనది ఈ బోర్నియో.
అతి పెద్ద చెట్టును ఈ లింకు వద్ద చూడండి.

The land of giant Dipterocarp trees, Borneo
;
















Dipterocarp trees ; (Link)

టాన్ జుంగ్ నేషనల్ పార్కు లో
ఘన లతా సహిత మహా వృక్షమును  తిలకించండి.;

సారవాక్ మండలాన "బాకో నేషనల్ పార్క్ వద్ద ఒక చిన్న గుట్ట ఉన్నది;
ఇది సహజసిద్ధముగా ఏర్పడిన ప్రకృతి వింత!
ఈ కొండ అచ్చం కాళీయ మర్దనమునకై-
శ్రీకృష్ణుడు బయలుదేరేటందుకు పిలిస్తూన్నట్లు ఉన్నది కదూ!?!


Bako National Park,Sarawak  (photo link )















కోణమానిని తెలుగు ప్రపంచం  000 51270 {Views}  Friday, March 15, 2013 
~~~~~~~~~~~~~


 38621 పేజీవీక్షణలు - 968 పోస్ట్‌లు, చివరగా Mar 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
 20683 పేజీవీక్షణలు - 704 పోస్ట్‌లు, చివరగా Mar 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2342 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

Friday, March 8, 2013

మురిపించే ముత్యాలు


చిరు చిరు ఆశల చిగురుటాకుల లాహిరి!
పుష్ప మంజరీ సాహిరి:
చిత్ర భావముల అల్లరి - ప్రకృతి కిత్తును
నేను ఈ మధురసవాహినీ కావేరి!

అంబర నీలపు వస్త్రపు నేతను!
"నాకు నేర్ప"మని
మరి మరి అడుగుతూనె ఉంటాము మేము!
దేవీ చేలాంచలము కొసలను పట్టి;
తల్లి అడుగుల అడుగులు వేస్తూ వేస్తూ;
నడిచే మురిపెపు ముత్తెములం!
గారాబు పాపలమె మేమందరము!      

ఉదయ కిరణ ప్రభా మందిరము
తల్లీ! నీదే! ఐతే నేమి?
అందందందరి నుడువుల ముచ్చట్లు
        ప్రతిధ్వనిల్లగ జేసే చనువును
నీవే ఇచ్చితివమ్మా! కదుటమ్మా!?

భగవానుని ఒడిలో బుడి బుడి నడకల
          ఆడుతూన్న పసి కూనలము!
ఆది జనకుల కడ,
ఆమాత్రం - అనునయ, భేషజ అనురాగాలను-
ఒలికించే- గారాబం కలిగినవారము కదుటమ్మా!?  
భళిరే! మీవద్ద కాక మరి వేరెవ్వరి సన్నిధి
నింత సౌలభ్యత పొందగలుగుదుము,
మాతా! మీరే చెప్పండీ!
;













playing childrean (photo link)


(rachana: కుసుమ)

****************************;
కవిత "మురిపించే ముత్యాలు "


అఖిలవనిత
 20570 పేజీవీక్షణలు - 703 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 38339 పేజీవీక్షణలు - 967 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2320 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

గీత పల్యంకిక


నిశిరేయి తరువునకు;
పూసినవి తారకలు;
చుక్కల్ల మిణుగురుల
కాంతులను మోయుచూ;
సాగేను నా పాట
గగన పర్యంతమ్ము||
;
నా పాట పల్లకి
పదిలంగ ఉన్నాది;
కుదుపులు లేకుండ ;
తెమ్మెరల బోయీలు
మోయుచున్నారు ||
;
గీతాల పల్యంకిక,
కుశలముగ ఉన్నాది;
చెలియ కులుకుల్లార!
ముసిముసినవ్వులతొ;
విచ్చేసి వేడుకగ;
ఆసీనులవ్వండి ||
;






















****************************;


niSirEyi taruwunaku;
puusinawi taarakalu;
chukkalla miNugurula;
kaaMtulanu mOyuchuu;
saagEnu naa paaTa;
gagana paryaMtammu||
;
naa paaTa pallaki
padilaMga unnaadi;
kudupulu lEkumDa ;
temmerala bOyiilu
mOyuchunnaaru ||
;
giitaala palyamkika,
kuSalmuga unnaadi;
cheliya kulukullaara!
musimusinawwulato;
wichchEsi wEDukaga;
aasiinulawwamDi ||

****************************;
గీతాల పల్యంకిక కుశలముగ ఉన్నాది

వస పానీయాలు, ఉపయోగాలు


"వస పిట్ట" అనే మాట తెలుగులో తీయనైన జాతీయాలలో ఒకటి.
"వస పోసినట్లున్నారు, అంత ఎక్కువగా వాగుతున్నాడు" అని అంటూంటారు.
సరస్వతీచూర్ణము తయారీలో వాడే ఒక దినుసు ఇది.

సంస్కృతభాషలో "వచ!" అంటే మాట్లాడుట - అని అర్ధం.
కన్నడ భాషలో వచె, వజె - అనే పదాలు -
తెలుగు "వస" నుండి తీసుకొనబడినవే!

*********************,

శ్రీలంక లో  -1955 లో సంపూర్ణ సూర్యగ్రహణము - సంభవించినది.
అప్పుడు వేదవిదులు, పండితులు, సాంప్రదాయక వైద్యులు
"వసకొమ్ముల కషాయాన్ని పుచ్చుకోవాలి." అని సలహా ఇచ్చారు.
"గ్రహణ సమయాన చర్మం నల్లబడకుండా కాపాడే మూలిక ఇది.
కాబట్టి మీరు వస డికాక్షన్ ని త్రాగండి" అని దేశ ప్రజలకు హెచ్చరిక చేస్తూ
 "వఢకహ పానీయాన్ని", మూలికా విలువల గురించీ చాటారు.
అప్పుడు అక్కడి జనలు పెద్దల మాటలను పాటించారు.


అంతే కాదు, ఆ రోజులలో ఒక పాట కూడా సింహళ దేశాన  వెలువడింది.
ఆ పాట 2010 సింహళములోని ఎన్నికల గీతముగా ఐనది.

*********************,
Tags:-

 Acorus calamus (Sweet Flal, Calamus) ;

1955 total solar eclipse ;
drinking a concoction of "Vadhakaha";


Baila" song "Bivva ne~da vadakaha sudiya~".

2010 election song written to the tune of
"vadhakaha sudiya
Vacha,Sadgrantha

*********************
ఐదు "వ"కారములు; kadambamaala ; (Link) 

ఆదివారం 30 నవంబర్ 2008
"గాజు కుప్పెలోన కదలక దీపంబు; Konamanini 2008 (Link)


కోణమానిని views: 0051072;

అఖిలవనిత
 20493 పేజీవీక్షణలు - 701 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 38270 పేజీవీక్షణలు - 966 పోస్ట్‌లు, చివరగా Mar 7, 2013న ప్రచురించబడింది 
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2313 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది 


బర్మాలో ఐరావది నది


ఇరవాడి డాల్ఫిన్ (Irrawaddy dolphin (Orcaella brevirostris))
బర్మా నదీ ముఖద్వారాలలోనూ, అండమాన్ సాగరం లోనూ ఉంటాయి.
బర్మా (గతంలో "సయాం") లోని ముఖ్యమైన నది "ఇర్రవడి".

ఐరావది నదిని మునుపు "రావి" అనేవారు. హిందూ ఇతిహాస, పౌరాణిక గాధలలో
ఏనుగులకు ప్రత్యేక స్థానాలు ఉన్నవి. అష్ట దిగ్గజములు - అనగా ఎనిమిది ఏనుగులు,
ఇవి ఎనిమిది దిక్కులకు ప్రతీకలు.
అలాగే వీనికి జతలుగా, ఆడ ఏనుగులు-
అన్నిటికీ పేర్లు, 8+8= 16 కలవు.

ఈ అష్ట దిగ్గజములలో ఒకటి "ఐరావతము",
ఇది సురాధిపతి ఇంద్రుని వాహనము.
బర్మాలోని ఇరవదిడి నదికి - ఐరావతము- అనే నామము ఆధారము.
Ayeyarwaddy అని కూడా బర్మాలో (సంస్కృతము- పాలీ భాషా రూపము) పిలుస్తారు.

**********************;

మొట్టమొదట - విశాఖపట్టణము వద్ద బంగాళాఖాతంలో
1852 లో సర్ రిచర్డ్ ఓవెన్ కనుగొన్నారు;

విశాఖ వద్ద చూసిన Sir Richard Owen  1852 లో గ్రంధస్థం చేసి,
ప్రపంచ జంతు ప్రేమికులకు పరిచయం చేసాడు.
ఒరిస్సాలోని చిలక సరస్సు, కంబోడియా మున్నగు సీమలలో అగుపిస్తాయి.
సముద్ర, నదీ సంగమ జలములలో "డుగాంగ్", నక్షత్ర తాబేళ్ళు,
ఇంకా అసంఖ్యాక జలచర, పక్షులు ఉన్నవి.

***********************;
రుడ్యార్డ్ కిప్లింగ్ (30 డిసెంబర్- 1865 -18 జనవరి 1936) రాసిన "మాండలే" పద్యం
[Rudyard Kipling- "Mandalay"  ]
బర్మా జలధి వాతావరణాన్ని వివరిస్తుంది.
కిప్లింగ్ రచన జంగిల్ బుక్ -
ఆబాలగోపాలానికీ వినోదాన్ని పంచిపెట్టిన రచన
The Jungle Book
;






;




జంగిల్ బుక్స్ - కథా ప్రపంచాన ఏనుగులకు ముఖ్యమైన పాత్రలను పోషించాయి.
ఐరావది నదీ సుక్షేత్రాలలో పచ్చదనాలతో అలరారు అరణ్యాలు,
పైర్లు, ప్రకృతి సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
బర్మాలో _ ఏనుగులు - మహావృక్షాల మ్రానులనూ, దుంగలనూ
అవలీలగా నిర్దిష్ట గమ్యాలకు చేరుస్తూంటాయి.
మావటివాళ్ళు ఏనుగులకు శిక్షణ ఇచ్చి, కష్ట తరమైన పనులను సాధిస్తున్నారు.
మావటివారు "గజ విద్య" కళాత్మకంగా ఉంటూ,
సందర్శక, టూరిస్టులకు జిజ్ఞాస, ఆసక్తిని కలిగిస్తూంటుంది.
గజములు టేకు మాకులను తొండంతో చాకచక్యంగా ఎత్తి,
లక్ష్య ప్రదేశాలకు చేరుస్తూంటాయి.
"the hathis pilin' teak" అని ఈ హస్తి చలనాలకు పేరు.
'హాథీ'- అనేది హిందీ పదము నుంచి వచ్చింది.

"Mandalay" - poem బర్మా తీరాల అందాలను కవితాధారగా ప్రవహింపజేసింది.

రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన పద్యం On the road to Mandalay వలన, ఐరావడీ నదీ డెల్టా ప్రాంతాలు, అందమాన్   బేసిన్  జలధి - "మాండలే రోడ్" అని ప్రసిద్ధి చెందింది.

           On the road to Mandalay,
            Where the flyin' fishes play,
            An' the dawn comes up like thunder outer China
            'crost the Bay!


ఈ నది పేరునే అక్కడి నది, కడలి జలాలలోని ప్రత్యేక మత్స్యానికి పెట్టారు.
Irrawaddy dolphin














Irrawaddy dolphin
;
Rangoon to Mandalay  (Link - for poem)