ముల్లోకములకు పారవశ్యము
మంజుల వాణీ! శార్వాణీ!
పినాక పాణి, హృదయ రాణివి!
అమ్మా!
నీ ఒడిలోన
ముల్లోకములు మైమరచేను! ||
అమ్మా!
నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల
ముల్లోకములు మైమరచేను! ||
తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను ;
నిండిన చల్లని దరహాసములందున ;
ముల్లోకములు మైమరచేను! ||
(ఎల్ల లోకములకు పారవశ్యము )
;
No comments:
Post a Comment