Wednesday, October 5, 2011

చతుర్దశ భువన హారము


;

పదునాల్గు భువనముల సుమ మాలను;
సుతారముగ అల్లిన జగదేక జననీ!;
అంబ! జగన్మాత! జయ మంగళం!
 శ్రీ దుర్గ! నిత్య శుభ మంగళం!   ||  
;
నటరాజ దేవేరి! కరుణామయీ!
ఇటు ధాత్రి ప్రజలెల్ల నీ బిడ్డలే!
నీ కొంగు పటుతర దుర్గమ్ము మాకు
నీ ఒడియె మాకు మెత్తనీ పొత్తిళ్ళు ||
;
పరమేశు అర్ధాంగి, శుభదాయినీ!;
నీ - కర కమలద్యుతి,క్రొత్త అరుణోదయాలు;
మరలించు మత్తులను, బద్ధకమ్ములను;
తెరలించు శక్తులను, ఉత్సాహములను ||
;
ఫణి భూషణుని రాణి, పరమేశు భామినీ!
పదునాల్గు భువనముల సుమ మాలను;
ముదముగా అల్లిన గౌరీ! భవాని!;
అంబా! జగజ్జనని! జయ మంగళం!
ఓ అమ్మ! నిత్య శుభ మంగళం! ||
;
     చతుర్దశ భువన సుమ హారము ;

&&&&&&&&&&&&&&&&&&


padunaalgu bhuvanamula suma maalanu;
sutaaramuga allina jagadEka jananI!;
aMba! jaganmaata! jaya maMgaLaM! ||
;
naTaraaja dEvEri! karuNAmayI!;
iTu dhaatri prajalella nI biDDalE!; nI oDini;ye ;
paTutaramau durgammu mu O amma! ;
nI oDiye maaku mettanii pottiLLu ||
;
paramESu ardhaaMgi, SuBadaayinI!;
nI kara kamaladyuti,krotta aruNOdayaalu;
maraliMchu mattulanu, baddhakammulanu;
teraliMchu Saktulanu, utsaahamul/ lan nu ||
;
phaNi BUshaNuni rANi, paramESu bhaaminii ni!;
padunaalgu bhuvanamula suma maalanu;
mudamugaa allina tivi; gaurI! bhavaani!;
aMbaa! jagajjanani!
aMba! jaganmaata! jaya maMgaLaM! ||
;
&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment