మాణిక్య వీణను సవరింపుమా!
మా తల్లి! కామాక్షి!
అణువణువు ఈ విశ్వమే హర్షమై,
జల తరంగిణీ రాగ హేలోజ్జ్వలముగా
ఉప్పొంగుతూ పులకించగా ||
శత కోటి సన్నుతులు వెల్లువలుగా
సతతమ్ము వెన్నెలలు జాల్వారగా
మా గళములే స్వర్ణాలయములై
శోభిల్లు మణి ద్యుతులు ఇవె! అందుకోవమ్మ! ||
తరళాక్షి! శ్రీ చక్రసంచారిణీ!
సుర పూజితా! నీరద నీల వేణీ!
జిత మదన పరమేశు ప్రియ భామినీ!
రాజిల్లు అర్చనలు అందుకోవమ్మా! ||
;
(మా గళ హేమ ఆలయములు)
;
No comments:
Post a Comment