;; ప్రణవ సరసున అనుక్షణమును
ఓలలాడు కేళీ హంసవు! మా అమ్మా! గౌరీ!
తొణుకులాడును మా మానసముల
నీ స్పర్శతొ పావనమైన జలములు ||
గాంధర్వ గానముల లాహిరిగా;
సౌందర్య వర్ణముల ఇంద్ర ధనువుగా
ప్రతి కెరటము ఎగయగ ఉల్లాసముగా
మనసులు మానస సరోవరమ్ములే! ||తొణుకు||
ఈ మరువపు వరముల గుబాళింపులు
రంగరించిన అగరు పన్నీరులు
నిండుట భక్తుల హృదయములు
నీ చల్లని చూపుల అనుగ్రహమ్ములే! ||తొణుకు||
( మా మనసులు నిండుట
నీ అనుగ్రహము )
No comments:
Post a Comment