Saturday, August 28, 2010

జగదేక మాతా! కనక దుర్గా!

















గిరిని వెలసిన కనక దుర్గా!
జగదేక మాతా! వాగ్దేవీ!
జేజేలు జోతలు
జేజేలు జోతలు ||

పొద్దు పొడుపున అరుణ రేఖలు
ముద్దు గొలుపు నీ లలాట రేఖల
బొద్దు కలిమిల పెంపు ఇంపుల
సద్దు సేయక చేరు చునుండును ||

నిగమ వర్ణిత విభవ రూపిణి
ముగురు వేల్పుల మూల జననివి
గగన వన్నెల మిసిమి దాతవు
సొగసు మమతల సాన్నిధ్యమీవె ||
*********************************
girini velasina kanaka durgaa!
jagadEka maataa! vaagdEvii!
jEjElu jOtalu
jEjElu jOtalu ||

poddu poDupuna aruNa rEKalu
muddu golupu nI lalaaTa rEKala
boddu kalimila peMpu iMpula
saddu sEyaka chEru chunuMDunu ||

nigama varNita vibhava rUpiNi
muguru vElpula mUla jananivi
gagana vannela misimi daatavu
sogasu mamatala saannidhyamiive ||
*********************************

Friday, August 27, 2010

చిలక సింహాసనము



















చిలక చిలక రామ చిలక
కళింగ సీమల చిలక సరస్సు
పక్షుల సంబర సామ్రాజ్యమ్ము
చిలక చిలక రామ చిలక
గోదా దేవి భుజమును గారంగ
చేసుకున్నది తన సింహాసనము

చిలక చిలక రామ చిలక
రతీ మదనుల జంటకు కుదిరిన
హొయలుల ప్రియమౌ వాహనము

చిలక చిలక రామ చిలక
మధుర మీనాక్షితొ సావాసమ్ము
చిలక జ్యోతిష్యము లోక ప్రసిద్ధము

*************************************



Chilaka chilaka raama chilaka
kaLiMga siimala chilaka sarassu
pakshula saMbara saamraajyammu
chilaka chilaka raama chilaka
gOdaa dEvi bhujamunu gaaraMga
chEsukunnadi tana siMhaasanamu

chilaka chilaka raama chilaka
ratii madanula jaMTaku kudirina
hoyalula priyamau vaahanamu

chilaka chilaka raama chilaka
madhura mInaakshito saavaasammu
chilaka jyOtishyamu lOka prasiddhamu

చిలకాకు పచ్చ


















చిలక చిలక రామ చిలక
సితాకోకకు తను అక్క?????

చిలక చిలక రామ చిలక
చిలక ముక్కుకు దొండ పండట!
"చిలక పలుకుల"ని
జాతీయాలు, సామెతలున్నూ!

చిలక చిలక రామ చిలక
ఆకు పచ్చకు దీటుగ తాను
సరి కొత్త రంగును సృష్టించినది ;
చిలకాకు పచ్చగా పేరొందెనది

చిలక చిలక రామ చిలక
చిలక కొయ్యలు,చిలక ముక్కులు
చిలకల పందిరి ఊయెలలు
చిలకల అంచుల జరీ వలువలు

చిలకకు చెప్పిన రీతిగ ఇన్నీ.........
నే - చెబ్తూ ఉంటే ఫక్కుమన్నది
గడసరి శుకము, సొగసు విహంగము
చిలక చిలక రామ చిలక

****************************

chilaka chilaka raama chilaka
sitaakOkaku tanu akka?????

chilaka chilaka raama chilaka
chilaka mukkuku doMDa paMDaTa!
"chilaka palukula"ni
jaatIyaalu, saametalunnuu!

chilaka chilaka raama chilaka
aaku pachchaku dITuga taanu
sari kotta raMgunu sRshTiMchinadi ;
chilaakaaku pachchagaa pEroMdenadi

chilaka chilaka raama chilaka
chilaka koyyalu,chilaka mukkulu
chilakala paMdiri Uyelalu
chilakala aMchula jarii valuvalu

chilakaku cheppina rItiga innii.........
nE - chebtU uMTE phakkumannadi
gaDasari Sukamu, sogasu vihaMgamu
chilaka chilaka raama chilaka

చిటారు కొమ్మన చిలకమ్మా!


















చిటారు కొమ్మన చిలకమ్మా!
నిటారు నీలుగు వలదమ్మా! ||

బుట్ట గౌనులివి బాలల కోసం;
చిలకాకు పచ్చనీ రంగులవి;
బొట్టు కాటుకలు పెట్టి మరీ .........
అడగాలా నీ అభిప్రాయమును?;
parrot green నీ వరముగ దొరికెను
చక్కని వన్నెల చూసి మెచ్చుమా! ||

చిలక కొట్టుడు దోర జామలను
చిటికెలొ ఎంపిక చేసే నేర్పరి
తీయని వెపుడూ చిలక పలుకులట!.......
చాలిస్తావా నీదర్పం, దరువులు
అరువుగ పిల్లల పలుకులు గొనుమోయ్!
బాలల పలుకులె నీకు గురువులు ||

**************************************


chiTAru kommana chilakammaa!
niTAru nIlugu valadammaa! ||

buTTa gaunulivi baalala kOsaM;
chilakaaku pachchanii raMgulavi;
boTTu kaaTukalu peTTi marI
aDagaalaa nI aBipraayamunu?;
#parrot green# nI varamuga dorikenu
chakkani vannela chUsi mechchumaa! ||
chilaka koTTuDu dOra jaamalanu
chiTikelo eMpika chEsE nErpari
tIyani vepuDU chilaka palukulaTa!

chaalistaavaa nIdarpaM, daruvulu
aruvuga pillala palukulu gonumOy!
baalala palukule nIku guruvulu ||

Tuesday, August 10, 2010

పెదవులపైన ఇంద్ర ధనుసులు

















బాగుగ చల్లలు యశోద చిలుకగ
వేగు చుక్కకు మెలకువ రాగా
క్షీరాబ్ధిశయనుడు బిర బిర వచ్చెను
విరాజిల్లెను నిఖిల లోకమ్ములు ||

ఉగ్గు గిన్నెతో వచ్చేసి
క్రిష్ణుడు , అమ్మ చెంగును గుంజాడు
“గుక్కెడు వెన్న, చిక్కటి మీగడ
గ్రక్కున ఇవ్వు, అంతే! చాలనె " ||

కొడుకు ముంగురులు సవరిస్తూ
“దుడుకు తనములను మానా”లంటూ -
పొంగు నురుగుల గుమ్మ పాలను
తల్లి ఇవ్వగా - చిన్ని క్రిష్ణుడు
చెంగున గెంతి, గడ గడ త్రాగెను

కెంపు పెదవులన్ తరిపి నురుగులు,
ఇంపుగ ప్రభాత కిరణాళి
వంపుల హరి విల్లులు విరిసెను
సొంపౌ కౌస్తుభ మణులై మెరిసెను ||

తంబుర తీగల రాగము లెలమిని
నారద మౌనికి లభియించంగా
మహతీ తంత్రులు సవరించేను
మా మానసములు కుందన పుటలయె ||

యాత్రా ఉదంతం

















---------------------------------
ఏడు కొండల స్వామి! వేంకట రమణా!
మా పాలి ఛత్రమ్ము నీ నామము;
నీ పేరు వెలుగుల మణి దీపము

పేర్మి తలచినంతనె(పేరు)
ఇడుములను బాపేను (మాపేను) ||

పెదవిపై పాటగా నీ భజనము కులుకంగ
మా మోములు ఘన ఇంద్ర సదనమ్ములు ||

నీ కోవెలకు చేరగా చేసే ప్రయాణం
జీవన పొత్తముల మధు సంతకం ||

మధురమౌ జ్ఞాపకం యాత్రా ఉదంతం
తేట జల పాతము పునీతమౌ చిత్తం ||

{యాత్రా ఉదంతం }

&&&&&&&&&&&&&&&&&&&&&&&&
yaatraa udaMtaM
_______________
EDu koMDala svaami! vEMkaTa ramaNaa!
maa paali Catrammu nii naamamu;
nI pEru velugula maNi diipamu

pErmi talachinaMtane pEru
iDumulanu baapaali ( maapaali) ||

pedavipai paaTagaa nI Bajanamu kulukaMga
maa mOmulu Gana iMdra sadanammulu ||

nI kOvelaku chEra chEsE prayaaNaM
jIvana pottamula madhu saMtakaM ||
madhuramau j~naapakaM yaatraa udaMtaM
tETa jala paatamu puniitamau chittaM ||

Monday, August 9, 2010

రామ చక్కని పిల్లడు















రావె రాధా! రావె రమణీ! –రండి చెలియలు చెలువము మీర ||

సరసుల దరిని – మనల నెంతగా వేసట బెట్టెనొ నిన్నకు నిన్న;
ఏమి దరువులు వేయు చుండెనో- రామ చక్కని చిన్న పిల్లడు ||

సతతము మనలను సతాయించును - నిత్యము వీనితొ సంత గోలలే!
“హితుడను నేనే,మీకు “ అనుచును – మాటల గారడి ని ముంచెత్తును ||

కొమ్మల కొనలను ఎక్కి కూర్చుని – మన వలువలు దాచి
“కొమ్మలార! నన్నే వినుడ”ని – వింత వేదాంత బోధలు గరపును ||

చిటారు కొమ్మల మిఠాయి పొట్లా – లవి ఏమిటొ కను గొన్నారా!?
“అరరే! వనితల కోకలు గాదే!? – అవి మన మేనుల దుస్తులు ఓ యమ్మా!” ||

Wednesday, August 4, 2010

ఆమోదము ఆ " మోదము"

















ఏ వేళల నందైనను -ఆమోదము ఆ " మోదము"
సమ్మోదకరమే సతతం ఆ పరవశము ||
ముకుళిత హస్తమ్ములతో శత కోటి వందనములు
సకల లోక ఏలికకు – మది పుష్పము నొసగు నప్పుడు
అకలంకం మోదమిది – అనుభవైక వేద్యమౌ
ఆ తన్మయ ,భక్తి పారవశ్యమ్ములు
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

బృందా వన వినోదికి దవనాలు, మరువాలు –
నవ రస భరితము ఎపుడూ- వనజ నాభు గాథలు
ధవళ తేజో మూర్తి ,దరిశనమున తరియించగ
ఆ తన్మయ ,భక్తి పారవశ్యమ్ములు
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

కనక చేల ధారికివే – కనకాంబర హారములు
వారిజాక్షు మ్రోల నివే – పారిజాత సుమ కోటి
జగముల నలరించు వాని కివే అలంకారములు
మా నయనమ్ముల కోవెలల కొలువుండుము స్వామి!
ఏ వేళల నందైనను -ఆమోదము ఆ మోదము ||

Monday, August 2, 2010

ఋతు శోభ

















ఋతు జనని ఆగమనం
ఆ బాల గోపాలం హర్ష సంరంభము!
భం భం బోలేరే!!!భం భం బోలేరే!! ||

అల్లదిగో! అదిగదిగో!
నీలాల గగనమ్ములోన
రత్నాల తేరు మేఘ మాల ||

ఋతు జననితొ చేయి కలిపి
ప్రేమగ పెన వేసుకునీ
వర్ష రాణి దర్జాగా
చేస్తూన్నది షికార్లు! ||

ఆశువుగా చెప్పగా
మువ్వల సందడిగా
వాక్కునందున పద్యం! ||

గోముగ తెలి పుటలపైన
మంజిర నాదములుగా
రాసినపుడు అది కావ్యం! ||

------------
***************************
Rtu SOBa
________
Rtu janani aagamanaM
aa baala gOpaalaM harsha saMraMBamu!
BaM BaM bOlErE!!!BaM BaM bOlErE!! ||

alladigO! adigadigO!
nIlaala gaganammulOna
ratnaala tEru mEGa maala ||

Rtu jananito chEyi kalipi
prEmaga pena vEsukunI
varsha raaNi darjAgA
chEstUnnadi shikaarlu! ||

ASuvugaa cheppagaa
muvvala saMdaDigaa
vaakkunaMduna padyaM! ||

gOmuga teli puTalapaina
maMjira naadamulugaa
raasinapuDu adi kaavyaM! ||

Sunday, August 1, 2010

మెరుపుల వాహనాలు


















వాన జల్లు చినుకులార!
వర్ష ధార చినుకులార!
పుడమికి విచ్చేయండి! ||

మేఘాల పుట్టిల్లు నుండి
చలాకిగా,చమక్కుల
ధరణికి వచ్చేయండి! ||

వసుధ అత్త వారింటికీ
హుషారుగా దిగి రండీ!
దబ్బున వచ్చేయండీ! ||

మెరుపు హౌరా బండి
మీ కోసం రెడీ! రెడీ!
గమ్మున వచ్చేయండీ! ||


%%%%%%%%%%%%%
___________________
vaana jallu chinukulaara!
puDamiki vichchEyaMDi! ||
varsha dhaara chinukulaara!
mEGAla puTTillu – lOna
odigi unnaaru mIru

vasudha atta vaariMTikii
hushaarugaa digi raMDI!
dabbuna vachchEyaMDI! ||

merupu hauraa baMDi
mI kOsaM reDI! reDI!
gammuna vachchEyaMDI!

pachcha pairu paMTalatO
maitri kalupukuMduru gaani
gaBAluna raMDi raMDi ||

వేణువుతో వీణా ప్రజ్ఞ

















రాగ భావములె సంగీత లహరులై
ఇహ పర జగతుల శాంత తన్మయ నిశ్రేణులుగా
వన మారుతముల ఇంపుగ పొదిగెను ||


భువన మోహిని రాధా దేవి
వాలు చూపుల వీణా తంత్రుల
సవరించేవారెవ్వరే?

"మువ్వల మురిపెపు
ముద్దుల క్రిష్ణుడు,ఓయమ్మా!"
వైణికుడెపుడిటులాయేనో?! ||

వల్మీకములో ఆది శేషుడై
కన్నని ఉరమున దవన మాలలో
చిక్కిన వాల్జడ తోచు చున్నది;

దవ్వుల జనులు
పరుగున పరుగున వచ్చేరా?
"మన భ్రమ ఇది"అని నవ్వేరా!!!! ||

చంద్ర పూర్ణిమా నందన వనములలో
తకిట తకిట తై, తథ్థై ఆటలు
చక చక సాగగ, అవి నాట్యమ్ములు;
సకల వసుంధర ఓం కారమ్మై ||

****************************


vENuvutO vINA praj~na
_____________________
raaga bhaavamule saMgIta laharulai
iha para jagatula SAMta tanmaya niSrENulugaa
vana maarutamula iMpuga podigenu ||

Buvana mOhini raadhaa dEvi
vaalu chUpula vINA taMtrula
savariMchEvaarevvarE?

"muvvala muripepu
muddula krishNuDu,Oyammaa!"
vaiNikuDepuDiTulaayEnO?! ||

valmIkamulO aadi SEshuDai
kannani uramuna davana maalalO
chikkina vaaljaDa tOchu chunnadi;

davvula janulu
paruguna paruguna vachchErA?
"mana Brama idi"ani navvErA!!!! ||

chaMdra pUrNimaa naMdana vanamulalO
takiTa takiTa tai, taththai aaTalu
chaka chaka saagaga, avi naaTyammulu;
sakala vasuMdhara OM kaarammai ||