Sunday, April 11, 2010

చల్లని నీడ
























సాదరమున బ్రోచే సామి
మా దరిని ఉండేను
ఆదరమున అందుకొనేటి
వరద హస్తములు ఇవే!ఇవే! ||

భువన మోహన రూపుని కొలువు
అవనిని సర్వము నిండి ఉన్నదని ”
అవశ్యమ్ముగా ఇట్టే పసి కట్టితిని
ధవళ తేజుని, చిన్మయ మూర్తిని ||

శత సహస్ర నామమ్ములను
వితరణముగ చిత్రించ గలుగుచు ఉన్న
ఇతిహాసములే ఐనవి నేడు
చిత్రముగా మా చిత్తమ్ములొహో! ||


చల్లని నీడ ;; rachana ;; kadambari

&&&&&&&&&&&&&&&&&&&&&&

challani nIDa ;;

saadaramuna brOchE saami
maa darini uMDEnu
aadaramuna aMdukonETi
varada hastamulu ivE!ivE! ||

bhuvana mOhana rUpuni koluvu
avanini sarvamu niMDi unnadani ”
avaSyammugaa iTTE pasi kaTTitini
dhavaLa tEjuni, chinmaya mUrtini ||

Sata sahasra naamammulanu
vitaraNamuga chitriMcha galuguchu unna
itihaasamulE ainavi nEDu
chitramugaa maa chittammulohO! ||

&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment