Friday, April 9, 2010

ప్రణవ నాద పర్ణ కుటీరము




















కుడి రెక్క మనకు ఆప్త దైవ
మిక్కడ నెలకొన్నాడు
"సామి! గోవిందా!"పలుకులతో
ఎక్కుదాము సప్త గిరులు ||

1.ఇంచక్కా అందరికీ - నిక్కపు నవ రత్న రాశి
దక్కినాడు శ్రీ ధాముడు -
అందుకనే,చక్కని అలమేల్ పతికి
మిక్కుటముగ జేజేలు జేజేలు ||
2.అదె హారతి కర్పూరపు ధూమమ్ములు అల్లికలై,
రసవత్తర ఓం కారము రూపొందగ - ధరా తలము
ప్రణవ నాద కుటీరమున భద్రమ్మయె
ప్రజావళికి శాంత ధనము లభియించెను ||

( ప్రణవ నాద పర్ణ కుటీరము ) :::::
{ రచన ; కాదంబరి }
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

( praNava naada parNa kuTIramu ) :::::
kuDi rekka manaku aapta daiva
mikkaDa nelakonnaaDu
"saami, gOviMdaa! palukulatO
ekkudaamu sapta girulu ||

1.iMchakkaa aMdarikii - nikkapu nava ratna raaSi
dakkinaaDu SrI dhaamuDu -
aMdukanE,chakkani alamEl patiki
mikkuTamuga jEjElu jEjElu ||
2.ade haarati karpUrapu dhuumammulu allikalai,
rasavattara OM kaaramu rUpoMdaga - dharaa talamu
praNava naada kuTIramuna bhadrammaye
prajaavaLiki SAMta dhanamu labhiyiMchenu ||


{ rachana : kadambari piduri }

No comments:

Post a Comment