Monday, April 26, 2010

యాత్రా ఉదంతం


















మా పాలి ఛత్రమ్ము నీ నామము;
నీ పేరు వెలుగుల మణి దీపము
పేర్మి తలచినంతనె పేరు
ఇడుములను బాపాలి ( మాపాలి) ||

పెదవిపై పాటగా నీ భజనము కులుకంగ
మా మోములు ఘన ఇంద్ర సదనమ్ములు ||

నీ కోవెలకు చేర చేసే ప్రయాణం
జీవన పొత్తముల మధు సంతకం ||
మధురమౌ జ్ఞాపకం యాత్రా ఉదంతం
తేట జల పాతము పునీతమౌ చిత్తం ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


EDu koMDala svaami! vEMkaTa ramaNaa!
maa paali Catrammu nii naamamu;
nI pEru velugula maNi diipamu
pErmi talachinaMtane pEru
iDumulanu baapaali ( maapaali) ||

pedavipai paaTagaa nI Bajanamu kulukaMga
maa mOmulu Gana iMdra sadanammulu ||

nI kOvelaku chEra chEsE prayaaNaM
jIvana pottamula madhu saMtakaM ||

madhuramau j~naapakaM yaatraa udaMtaM
tETa jala paatamu puniitamau chittaM ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Monday, April 19, 2010

ప్రభాత లావణ్యం


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ప్రాగ్ దిశ
ప్రభాకర కిరణాళి కొసలలో
మేఘ మాలికలు –
సృష్టిని చిత్రిస్తూన్న
కుంచె (brush) ల్లాగా ;

ఇప్పుడే వర వీణను
సవరించింది కాబోలును శారదాంబ ;
విహగాళి కిల కిలారావాలతో - కు
ప్రకృతి తంత్రీ సమూహాలు
తమ ఒడలు విరుచుకుని
స్వాగత వేదికలౌతున్నాయి;

"బ్రాహ్మీ ముహూర్త నిశ్శబ్దాన్ని"
'నిశి రాతిరి జడ కొసలకు' రిబ్బను ముడిగా వేసి,
వీడ్కోలు చెబ్తూన్నది ఉషా రాణి.

తమో యవనిక వెనకాతల
ముడుచుకు కూర్చుని
బద్ధకంగా కునుకులు తీస్తూన్న
ఛాయలు నవ్యోత్సాహంతో తటాలున లేచి నిల బడ్డాయి;

ప్రతి వస్తువుకూ,
ప్రతి చైతన్యానికీ
ఆ నీడలు
తామే – ప్రతిమలుగా మారుతూ
సకల లోకాలనూ
ఒకటే బులిపిస్తూన్నాయి;

సౌందర్య వాహినీ వేగాలు
నిరంతరమూ
నిత్య విలాస స్నానాలు చేస్తూనే ఉన్నాయి.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

prabhaata laavaNyaM :
_________________

praag diSa
praBAkara kiraNALi kosalalO
mEGa maalikalu –
sRshTini chitristuunna
kuMche (brush) llaagaa ;

ippuDE vara vINanu savariMchiMdi kaabOlunu
SAradaaMba ;
vihagALi kila kilaaraavaalatO - ku
prakRti taMtrI samUhaalu
tama oDalu viruchukuni
svaagata vEdikalautunnaayi;

brAhmI muhuurta niSSabdaanni
niSi raatiri jaDa kosalaku ribbanu muDigaa vEsi,
vIDkOlu chebtuunnadi ushaa raaNi.

tamO yavanika venakaatala
muDuchuku kUrchuni
baddhakaMgaa kunukulu tIstuunna
CAyalu navyOtsaahaMtO taTAluna lEchi nila baDDAyi;

prati vastuvukuu,
prati chaitanyaanikii
aa nIDalu
taamE – pratimalugaa maarutU
sakala lOkaalanuu
okaTE bulipistuunnaayi;

sauMdarya vaahinI vEgaalu
niraMtaramuu
nitya vilaasa snaanaalu chEstUnE unnaayi.


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Selayeru

ప్రభాత లావణ్యం

By kadambari piduri, Apr 20 2010 2:16AM
Share|

Sunday, April 18, 2010

పెదవుల పైన పాల నురుగులు























బాగుగ చల్లలు యశోద చిలుకగ
వేగు చుక్కకు మెలకువ రాగా
క్షీరాబ్ధిశయనుడు బిర బిర వచ్చెను
విరాజిల్లెను నిఖిల లోకమ్ములు ||

ఉగ్గు గిన్నెతో వచ్చేసి
క్రిష్ణుడు , అమ్మ చెంగును గుంజాడు
“గుక్కెడు వెన్న, చిక్కటి మీగడ
గ్రక్కున ఇవ్వు, అంతే! చాల”నె; ||

కొడుకు ముంగురులు సవరిస్తూ
“దుడుకు తనములను మానా”లంటూ -
పొంగు నురుగుల గుమ్మ పాలను
తల్లి ఇవ్వగా - చిన్ని క్రిష్ణుడు
చెంగున గెంతి , గడ గడ త్రాగెను
కెంపు పెదవులన్ తరిపి నురుగులు,
ఇంపుగ ప్రభాత కిరణాళి
వంపుల హరి విల్లులు విరిసెను
సొంపౌ కౌస్తుభ మణులై మెరిసెను ||

తంబుర తీగల రాగము లెలమిని
నారద మౌనికి లభియించంగా
మహతీ తంత్రులు సవరించేను
మా మానసములు కుందన పుటలయె ||


పెదవుల పైన పాల నురుగులు ;;;;
_____________________

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

pedavulapaina paala nurugulu ;;;;
____________________

baaguga challalu yaSOda chilukaga

vEgu chukkaku melakuva raagaa

kshiiraabdhiSayanuDu bira bira vachchenu

viraajillenu niKila lOkammulu ||

uggu ginnetO vachchEsi

krishNuDu , amma cheMgunu guMjaaDu

“gukkeDu venna, chikkaTi mIgaDa

grakkuna ivvu, aMtE! chaala”ne; ||

koDuku muMgurulu savaristuu

“duDuku tanamulanu maanaa”laMTU -

poMgu nurugula gumma paalanu

talli ivvagaa - chinni krishNuDu

cheMguna geMti , gaDa gaDa traagenu

keMpu pedavulan taripi nurugulu,

iMpuga praBaata kiraNALi

vaMpula hari villulu virisenu

soMpau kaustuBa maNulai merisenu ||


taMbura tIgala raagamu lelamini

naarada mauniki laBiyiMchaMgaa

mahatii taMtrulu savariMchEnu

maa maanasamulu kuMdana puTalaye ||

&&&&&&&&&&&&&&&&&&&&&&

తమస్సు క్షేత్రములో సేద్యము
























శ్రీ వేంకట రమణుని
దివ్య చరణ యుగళమునకు
ప్రణమిల్లినాము భక్తులము!
“గోవిందా!” నామ జలజ
శత కోటీ అర్పణములు ||

1)సుజన కోటి భక్తి పొంగ
గజ మాలలు అల్లినాము ;
స్వామి గళమునందు ఉంచినాము
విశ్వ జనకుని సన్నిధి
నిజమౌ మా పెన్నిధి ||

2) శరత్తులలో వెన్నియలు
అమా - వాస్య నిశిని విత్తు లగుట
ఆ సత్తువ అద్భుతమే!
హత్తు కొనిన మా ఎడదలకు
అగరొత్తుల పరిమళములు ||
శ్రీ వేంకట రమణుని
దివ్య చరణ యుగళమునకు
ప్రణమిల్లినాము భక్తులము!
“గోవిందా!” నామ జలజ
శత కోటీ అర్పణములు ||

1)సుజన కోటి భక్తి పొంగ
గజ మాలలు అల్లినాము ;
స్వామి గళమునందు ఉంచినాము
విశ్వ జనకుని సన్నిధి
నిజమౌ మా పెన్నిధి ||

2) శరత్తులలో వెన్నియలు
అమా - వాస్య నిశిని విత్తు లగుట
ఆ సత్తువ అద్భుతమే!
హత్తు కొనిన మా ఎడదలku
aగరొత్తుల పరిమళములు ||


తమస్సు క్షేత్రములో సేద్యము ;;;;
_________________

&&&&&&&&&&&&&&&&&&&&&
tamassu kshEtramulO sEdyamu ;;;;
___________________________

SrI vEMkaTa ramaNuni
divya charaNa yugaLamunaku
praNamillinaamu Baktulamu!
“gOviMdA!” naama jalaja
Sata kOTI arpaNamulu ||

1)sujana kOTi Bakti poMga
gaja maalalu allinaamu ;
svaami gaLamunaMdu uMchinaamu
viSva janakuni sannidhi
nijamau maa pennidhi ||

2) SarattulalO venniyalu
amaa - vaasya niSini vittu laguTa
aa sattuva adButamE!
hattu konina maa eDadala
agarottula parimaLamulu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Sunday, April 11, 2010

చల్లని నీడ
























సాదరమున బ్రోచే సామి
మా దరిని ఉండేను
ఆదరమున అందుకొనేటి
వరద హస్తములు ఇవే!ఇవే! ||

భువన మోహన రూపుని కొలువు
అవనిని సర్వము నిండి ఉన్నదని ”
అవశ్యమ్ముగా ఇట్టే పసి కట్టితిని
ధవళ తేజుని, చిన్మయ మూర్తిని ||

శత సహస్ర నామమ్ములను
వితరణముగ చిత్రించ గలుగుచు ఉన్న
ఇతిహాసములే ఐనవి నేడు
చిత్రముగా మా చిత్తమ్ములొహో! ||


చల్లని నీడ ;; rachana ;; kadambari

&&&&&&&&&&&&&&&&&&&&&&

challani nIDa ;;

saadaramuna brOchE saami
maa darini uMDEnu
aadaramuna aMdukonETi
varada hastamulu ivE!ivE! ||

bhuvana mOhana rUpuni koluvu
avanini sarvamu niMDi unnadani ”
avaSyammugaa iTTE pasi kaTTitini
dhavaLa tEjuni, chinmaya mUrtini ||

Sata sahasra naamammulanu
vitaraNamuga chitriMcha galuguchu unna
itihaasamulE ainavi nEDu
chitramugaa maa chittammulohO! ||

&&&&&&&&&&&&&&&&&&&&

Friday, April 9, 2010

బుర్రు బురు పిట్ట


************************************************

బుర్రు బురు పిట్ట
తుర్రు తుర్రు పిట్ట
“నీ-ముక్కు సొత్త”అంటే
గుర్రు గుర్రు కోపం.
చర్రు చరున వ్రాలి
గింజ,విత్తులేరి
రివ్వు రివ్వున ఎగిరి
దవ్వు దవ్వులందు
విత్తులన్ని విసర
మొక్క,మ్రానులెదిగె!

చెట్టు చేమ పెరిగి
పచ్చ దనం నవ్వె!

పిన్న,పెద్దలంతా
రండి!రండి!త్వరగా!
దండిగాను నీళ్ళు
పోసి,పెంచుదాము!
హరిత వనం మనకు
గొప్పదైన వరము!
పూలు సౌరభాలు
ప్రకృతి ఆహ్లాదాల్!
తియ తీయని పళ్ళు
మానవాళి భోగం.
కలిసి మెలిసి ఎంచక్కా
అందరమూ తిందాం!


***********************
***********************


రచన: kadambari piduri

ప్రణవ నాద పర్ణ కుటీరము




















కుడి రెక్క మనకు ఆప్త దైవ
మిక్కడ నెలకొన్నాడు
"సామి! గోవిందా!"పలుకులతో
ఎక్కుదాము సప్త గిరులు ||

1.ఇంచక్కా అందరికీ - నిక్కపు నవ రత్న రాశి
దక్కినాడు శ్రీ ధాముడు -
అందుకనే,చక్కని అలమేల్ పతికి
మిక్కుటముగ జేజేలు జేజేలు ||
2.అదె హారతి కర్పూరపు ధూమమ్ములు అల్లికలై,
రసవత్తర ఓం కారము రూపొందగ - ధరా తలము
ప్రణవ నాద కుటీరమున భద్రమ్మయె
ప్రజావళికి శాంత ధనము లభియించెను ||

( ప్రణవ నాద పర్ణ కుటీరము ) :::::
{ రచన ; కాదంబరి }
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

( praNava naada parNa kuTIramu ) :::::
kuDi rekka manaku aapta daiva
mikkaDa nelakonnaaDu
"saami, gOviMdaa! palukulatO
ekkudaamu sapta girulu ||

1.iMchakkaa aMdarikii - nikkapu nava ratna raaSi
dakkinaaDu SrI dhaamuDu -
aMdukanE,chakkani alamEl patiki
mikkuTamuga jEjElu jEjElu ||
2.ade haarati karpUrapu dhuumammulu allikalai,
rasavattara OM kaaramu rUpoMdaga - dharaa talamu
praNava naada kuTIramuna bhadrammaye
prajaavaLiki SAMta dhanamu labhiyiMchenu ||


{ rachana : kadambari piduri }

Thursday, April 8, 2010

లోకములో? నవ నీతములో !?!!!!
















కళా కౌశలములకు పుట్టినిల్లు వాడేనే!
మిళాయింపు సుగంధాల కదంబ మాల క్రిష్ణుడే ||

తెల్లని వెన్నెల కాంతుల నఖములు
పిల్లన గ్రోవిని మెరిపించేను
బుల్లి బుగ్గలను పూరించగనే
అల్లరి అధరము లల్లన కదలగ
చల్లని రాగాల్ తీయగ మెరిసెను ||

భామల కూడిన కన్నని ఆటలు
యామిని కొలనున కెందామరలు;
వికసించినవవె దధి క్షీరములలొ
వెన్న ముద్దలో ?
మరి - నిఖిల లోకమ్ములో?
నయనాభిరాముని చిత్తరు వన్నెలో? ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

lOkamulO? nava nItamulO?
__________________________

kaLA kauSalamulaku puTTinillu vADEnE!
miLAyiMpu sugaMdhaala kadaMba maala krishNuDE ||
tellani vennela kaaMtula naKamulu
pillana grOvini meripiMchEnu

bulli buggalanu pUriMchaganE
allari adharamu lallana kadalaga
challani tIyani raagaal merisenu ||

Baamala kUDina kannani aaTalu
yaamini kolanuna keMdaamaralu;


vikasiMchinavave dadhi kshiiramulalo
venna muddalO ?
mari niKila lOkammulO?
nayanaaBiraamuni chittaru vannelO? ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, April 3, 2010

జారు! జారు!జల పాతాలు !













జారు! జారు!జల పాతాలు !
ఎత్తిపోతల జల పాతాలు :
వంశ ధార నది,పంచ ధారల,
కుంతల వాటర్ ఫాల్సు,ఓహో!
జారే జారే జల పాతాలలొ
సిరి వెన్నియల*1జల తారు పోగులు!

తూర్పు కొండల దిన మణి పింఛము!
జల ధారలలో హరివిల్లు లొహో!

జల పాతాలలొ సంతోషాల స్నానాలు!
ధార ధారనూ అల్లు కున్నవీ
పిన్నల,పెద్దల కోలాహలాలు,
“నవ్వు,కేరింతల”ఒప్పుల కుప్పలు


&&&&&&&&&&&&&&&&&

రచన;కాదంబరి - జాబిల్లి - ‘పాటలు’

Thursday, April 1, 2010

నెయ్యములల్లో నేరేళ్లో ! (annamacharya )















(పల్లవి ) ;;;;;;

నెయ్యములల్లో నేరేళ్లో !
ఒయ్యన ఊరెడి ఉవ్విళ్ళో! నెయ్యము

(చరణము ) :::::
_________

పలచని చెమటల బాహు మూలముల
చెలమలలోనాఁ జెలువములే
తళ తళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో నెయ్యము

చ (చరణము ) :::::
_________
తొట తొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి బొటి పొటి యలుకల చిరు నగవే
వట ఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో నెయ్యము

( చరణము ) :::::
_________

గర గరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు
మరుని వింటి కమ్మని అంప విరుల
గురి తాకు లినుప గుగ్గిళ్ళో నెయ్యము

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

పక్షుల పలుకులు




















“మాటలు అంటే
మానవులకు మాత్రమె
సొంతం” అంటే ఎట్లాగ?

మైనా పిట్టల
ఈల పాటలను,

రామ చిలుకల
మిమిక్రీలను,

పికిలి పిట్టల
కువ కువ గానాలు
వింటూ ఆనందించండి!
విని అచ్చెరువులు పొందండి!


&&&&&&&&&&&&&&&&&&&&&


click here :