Friday, July 10, 2009

మది పల్లకి బోయీలు

(పల్లవి: )ఒహ్హొహ్హొహోమ్ హోమ్!ఓ జనుడా! ఉవిదా!పెద్దలార!పిన్నలార! /

అనుపల్లవి:::::

నీదు హృదయమేమొ రాలుగాయి!

మాట వినని ఆకతాయి !

శ్రీరంగస్వామి చేసుకొనీ-

చేకొనెను గదా ఈ నాటికి-

ఈ ఎడదను శ్రీ చందన పల్లకిగా //


తుంబుర నారద గానము

దీనికి సమమౌతుందా?!

మరకత నీల ద్యుతిలో-కరిగి పోవు నాదమిదీ!

ఇదే గదా,వర నాదము! మన మదినీ ఇమ్మహినీ -//


రంభోర్వశి నాట్య లయలు -సురా పాన ఉన్మత్తత

దీనికి, సరి సమములనుట- తునికి తగవు తీర్పంట!

ఓంకార సమమైన నాదము ఇది, ప్రజలార!

బోయీల నడక సాగునులే! ఒహ్హొహ్హొ హ్హోమ్ అంటూ! //
కోరస్:::::

భక్తి ప్రపత్తులు, ప్రేమ-అనురాగం, మమత, రక్తి-

మన మానస పల్యంకికకు బోయీలురా!

కొనసాగును ఊత పదము!బ్రహ్మ నాద మోంకారము !

*********************************

(కోవెల : మది పల్లకి బోయీలు-

  • By kadambari piduri, )

No comments:

Post a Comment