
ఎంత బావుంటుంది!
---------------------------
ఏ పద గుంఫనలూ అవసరం లేని -
నిష్కల్మష భావం ఎదురై,
తన స్నేహ హస్తాన్ని చాచితే
ఎంత బావుంటుంది!
చిన్ని పాప చిరు నవ్వుల
వెలుతురు
పూతలలోనేను వెండి కొండనై పోవాలని ఉన్నది!
అరుణ రాగపు ముచ్చికలోన -
ఉదయారుణ ఉషోదయ పద్మపు గొడుగులో -
మంచి తనమే మనిషి తనమై -
సేద దీరుతూన్న మధుర క్షణాలను -
"చరిత్ర"గా -
కాల యవనిక"పై ఆవిష్కరిస్తే
ఎంత బాగుంటుంది!
No comments:
Post a Comment