1)చివురు పాదములెత్తి కేరింతలాడ -
పద పద్మముల గని,మురిసి పోయి -
గగన తలమును వీడి,సూర్య దేవుడిటు వచ్చి -
కస్తూరి తిలకమున తానొదిగి పోయేను.
2)'గిలక కాయలు' గుప్పిట పట్టి పట్టి -
ఎలమి ఊపెదవయ్య!యశోద పట్టి!
"వెండి జాబిలి" చేరె మెట్టినింటను!"
అనుచు నవ్వులు చిందె నీశ్వరుండు!
3)బంగారుమొల తాడు ఒత్తు కొనె నయ్యయ్యొ!
నాదు బంగరు తండ్రికి"అనుచు మానసమెంతొ -
తల్లడిల్లగ ,తా తల్ల్ల్లి తీసెను నగను వేగపడుచు.
ఒత్తుకొని పోయిన మేని నొక్కు లు చూచి -
నీలి పూవుల దండ"అని తోచగా -
తేటి గుంపులు ముసిరె నయ్యారే !కనుడు!
4)"అస్సురుస్సురు!"అనుచు -పులుగులను త్రోయుచూ -
అమ్మ ఆతృత తోడ నిను దాచు లోపల -
"భ్రమర జాతర!"లంచు వాసంత ఋతు హేల -
ఉరికి వచ్చేసింది,వ్రేపల్లె లోగిలికి.
Baalaవాసంత ఋతు హేలBy kadambari piduri,
No comments:
Post a Comment