Saturday, August 15, 2009
పింఛము నృత్యము
Friday, August 14, 2009
వెండి తెరపై బంగారు గానం

--
-
( కాంతా రావు,కృష్ణ కుమారి
-యుగళ గీతము )
(పల్లవి ) :::::వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది //
కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి //వెన్నెలకేలా //
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..//వెన్నెలకేలా //
మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
ఓ మరదలు పిల్లా! జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా .. //వెన్నెలకేలా //
--------------------------------------------------చిత్రం :కానిస్టేబుల్ కూతురు
రచన:ఆత్రేయ:
సంగీతము:ఆర్.గోవర్ధన్
గాయకుడు: పి.బి.శ్రీనివాస్
Tuesday, August 11, 2009
చిటుకూ చిటుకూ మ్యాజిక్కులు
1)చేతి వేళ్ళతో,పొగలు కక్కించడము ఎలాగ?
2)సెల్ ఫోనుతో మాజిక్కులు,జిమ్మిక్కులు ఈ వీడియోలలో చూడండి.
Monday, August 10, 2009
చిత్రం: ఆమె ఎవరు?రచన: దాశరధిసంగీతం: వేద********************************** (పల్లవి:)ఓ నా రాజా.. రావా రావా.. (2)చెలిని మరిచితివా? ఓ నా రాజా..రావా.. రావా....ఓ నా రాజా......(చరణం 1:)నీరూపే ఆశ రేపేనునీమాటే వీణ మీటేనూ.. (2) గతాలే నన్ను పిలిచాయి..ఆహా!ఏమి లేదోయికలగా కరిగిందంతాజగమే ఎంతో వింత!రేయి పగలూ నిన్నే వెతికేనోయి // ఓ నా రాజా //(చరణం 2:)-వృధాగా కాలమీదేనునిరాశ పొంగివొచ్చేను(2)తరంగంలా లాగా రావోయీ! ప్రియా!నన్ను ఆదుకోవోయిఏదో తీయని బాధ!కన్నీరొలికే గాథ,రేయి-పగలూ నిన్నే వెదికేనోయి // ఓ నా రాజా //(చరణం 3:)నీకోసం నేనే వచ్చానునీ ఇంటికి దీపమైనాను(2)నాతోనే ఆడుకోవయ్యా నీ కోపం నేడు నీకేలానీ అడుగులలో నేనూనాకన్నుల్లో నీవునాలో నీవు - నీలో నేనే // ఓ నా రాజా //(చరణం 4:)-వరించిన మంచి వధువును లే!స్పృశించే తీపి మధువును లే!ప్రియా!!! ప్రేమ కథనోయి! సదా నీ నీలి నీడనులే!ఏనాటిదో ఈ బంధం!ఎన్నడు చెడదీ బంధం!రేయీ,పగలూ,నిన్నే వేదికేనోయీ.. // ఓ నా రాజా /
Friday, August 7, 2009
వసంత సేన (సినిమా )

వసంత సేన (సినిమా పాట)(పద్మిని,నాగేశ్వర రావు);రచన:దాశరధి
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు;గానం:ఘంటసాల;జానకి
1)కొండలన్ని వెతికేను,కోనలన్ని తిరిగేనుచెలియా!సఖియా!నీకోసమే!రావే వయ్యారి!నా వలపు మయూరి!-(2)నవ్వులు చిందించి నటియించవే (2)2)చెంతచేరి రావొయి!చింతదీర్చి పోవోయి!వయసూ సొగసూ నీ కోసమేనేడే వసంతం,ఈ జగమున విరిసేనేడే వసంతం,నా మనసున విరిసేకోయిల కొమ్మల్లొ కోయన్నది ఓ.. (2)3)ఝుమ్మని రాగాలు పాడెను భ్రమరంకమ్మని తేనెలనందించు కుసుమంజల జల నాట్యాల ప్రవహించు నదులుసాగరు కౌగిట చేరేను తుదకు.4)నెలరాజు నేడేల పిలిచేను కలువ,కలువకై జాబిల్లి కదిలీ వచ్చేనువలచిన చెలికాని తలచేను చెలియ,చెలియను మురిపింప చేరేను ప్రియుడు5)నిజమైన అనురాగమదియే కదా:ఆ..నిజమైన అనురాగమిదియే కదా!చెంతచేరి రావొయి!చింతదీర్చి పోవోయివయసూ,సొగసూ నీ కోసమే!రావే వయ్యారి నా వలపు మయూరి (2)నవ్వులు చిందించి నటియించవే (2)ఓ సుందరీ..ఓ సుందరీ..ఓ సుందరీ!
శార్దూల ఛందస్సు,చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి
దే మార్గమ్మును కాదు; వీని దెదియో? ఈ వూర్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్తమా హేతువై,
ఈ వుచ్చిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ."
సత్యనారాయణగారికి గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో సన్మానం జరిగింది. ఆ సందర్భములో, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తొమ్మిది ఆశీర్వచన పద్యాలు చెప్పారు. వానిలోని ఎనిమిదవది పైన చెప్పిన శార్దూల ఛందస్సులోని పద్యము.
“నా శిష్యుడే అయినా, ఇతనిది నా పద్ధతి కాదు. నా తాత ముత్తాతల పద్ధతీ కాదు. (= మన పూర్వ కవులు) ఇతడిని సామాన్యుడు అని అనుకోకూడదు. కవితాసంరాడ్వ్తమాహేతువై ఈ నా శిష్యుడిని వరించింది. నాకెంతో సంతోషంగా ఉన్నది."
కోట సుందరరామశర్మగారు తమ కాలం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,ఇలాగ సెలవిచ్చారు"చెళ్ళపిళ్ళవారి శిష్యుడిని అని చెప్పుకోవడం మా రోజులలో తెలుగు కవులకి, పండితులకీ ఒక certificate , యోగ్యతాపత్రం లాంటివే!. ఒక నెలో, రెండునెలలో చెళ్ళపిళ్ళ వారి దగ్గిర చేరి, వారి శిష్యుడినే అని వందలమంది గర్వంగా,ఆనందంతో చెప్పుకునేవారు.".
(చూడుము:::30జూలై,2008-
"బాస, భాష" జొన్నలగడ్డ తో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి సంభాషణ
Monday, August 3, 2009
"సిరి సంపదలు"సినిమాలోని అలనాటి మాధుర్యం ఈ పాట.వెండి తెర మిద సావిత్రి,వాసంతి,గిరిజల నటన ప్రేక్షలకు అహ్లాదాన్ని కలిగించేవీనుల ,కన్నుల విందులు.****************************************
పల్లవి;వేణు గానమ్ము వినిపించెనే!చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే;వేణు గానమ్ము వినిపించెనేచిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే;వేణు గానమ్ము వినిపించెనే||
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
||వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...||
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
||వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
Sunday, August 2, 2009
దివ్య ధాత్రి

Saturday, August 1, 2009
వందేమాతరం!
||వందేమాతరం!వందేమాతరం!||
Tuesday, July 28, 2009
కర్ణామృతము
సామెతలు ,పలుకు బడులు
సామెతలు ,పలుకు బడులు :::,,,,,,,,,,,,,,,,,,,,,,, 1) "ఈ చెవిని విని,ఆ చెవిలో(నుండి) వదిలేయాలి."2)"'కర్ణా కర్ణిగా వినీ ,ఆ విన్నది నీకు చెప్పాను." 3)చెవిని (=చెవిలో) ఇల్లు కట్టి ,పోరుట.(=చెప్పదలుచుకున్న విషయాన్ని ,ఎదుటి వారి మనసుకు ఎక్కే దాకా ,విడువకుండా చెప్పుట)4)'నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి నేనీమైనా "చెవిలో పువ్వు "పెట్టుకుని కనిపిస్తున్నానా?'5)చెవిలో గుస గుసలు (=రహస్యాలు)6)'చెవులు మూసి,చేతి కిస్తా!' (=బాగా తన్నుట)7)చెవిటి వాని ముందు శంకు (=శంఖము) ఊదినట్లు .8)చెవులు పట్టి ఆడించుట
1)చెవులు మెలి పెట్టుట.(=ధాష్ఠీకము)2) చెవుల పిల్లి=కుందేలు.3)"నీకు ప్రమోషన్ వచ్చిందనీ మాట నాకు"చెవుల పండుగ"గా ఉన్నది.(/"వీనుల విందు")4)"చెవులు కొరుక్కొంటున్నారు," ఏమిటో,ఆ రహస్యాలు?, కాస్త మా చెవిలో కూడా వేయొచ్చును కదా!."(/చెవులు కరచుట)5)చెవిలో సొంఠి కొమ్ము ఊదుట. (=పరుషంగా ,కటువుగా మాట్లాడుట)6)కర్ణేజవుడు=కొండెములను,చాడీలను చెప్పే వాడు.7)కర్ణా కర్ణిగా వినుట=పుకార్లు మున్నగునవి.8).వింటి నారిని పార్ధ సారధి "ఆ కర్ణాంతము" లాగి,సంధించెను.9)కర్ణ రసాయనము=చెవులకు ఇంపైనది.10)శ్రుత పాండిత్యము =కేవలము వినుట తోడనే ,పట్టు బడిన విద్య.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1) శ్రోత =వినేవాడు.2) వినికిడి,("అతణ్ణే నాయకునిగా ఎన్నుకుంటున్నారని 'వినికిడీ .")3)"ఈ పురాణ గాధలను"విన్నా,కనినా' పుణ్యము లభిస్తుంది." /'విన్న వారూ ,కన్న వారూ తరిస్తారు.'.4)"ఇలాంటి వింతలూ,విడ్డూరాలనూ ఎన్నడైనా విన్నామా!కన్నామా!"5)"విన్నారా,కనుగొన్నారా?"6) "ఫ్లైయింగు సాసర్లూ అనేవి ఉంటాయని 'విన్న వాళ్ళే గాని ,చూసిన (/కన్న వాళ్ళు)లేరు."7)'విన్నది విన్నట్లుగా చెప్పూట.'8)"నా మాట విను!" (= ఆచరించు/పాటించు! )9)అధికారులకు 'విన్న వించుకొనుట.'10)వినతి, 'వినతి పత్రము 'ను సమర్పించుకొనుట
1)'శ్రీకారములాంటి చెవులు.2)చెవుల పోగులు ,చెవి కుండలాలు .3)కర్ణ భూషణాలు.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Kusuma Kumari లేబుళ్లు: కొన్ని సామెతలు, పలుకు బళ్ళు
పద మంజరి
vaaDuka bhaa shalOni aMdamaina telugu maaTalanu , parikiMchEMdukai , maa I chiru prayatnamu .
౧) పూల బాట ::: "బ్రతుకు పూల బాట అయ్యింది .
౨) వడ్డించిన విస్తరి ::: " నీకేం, నీ జీవితము వడ్డించిన విస్తరి ,అన్నీ అమరి ఉన్నా భాగ్య శాలినీవు .
"౩) కల గూర గంప ::: అన్నీ విషయాలూ ఉన్న పుస్తకం ఇది ,కల గూర గంప లాంటిది ."
౪) అనేక ఆశయాల , ఆలోచనల 'కల బోత '.
౫)ఆ పిల్లలు ,అందరితో 'కలివిడి 'గా ఉంటున్నారు .
౬)" అడుగులో అడుగు వేసి ,కలిసి నడుద్దాము ,మనము అందరమూ !"౭) కలిసి వచ్చిన కాలములో నడిచి వ చ్చే బిడ్డలు వస్తారు .
౮) aame గొంతు కలిపి ,పాడి ,అందరినీ మెప్పించినది .
౯) కలిసి ఉంటే కలదు సుఖము
.................................................................................................................
కొన్ని పదములు :::
:::::::::::::::::::::::::::
1)కలము ,పెన్ను . ౨) కల కలము ::: జనములో కల కలము రేగినది .
౩) మదిలో కల వరము ఆయెను .౩)కల యో ? వైష్ణవ మాయయో ???
4) కల్ల (= అబద్ధము ) ,నిజము౫) కలిగిన వారు = ధన వంతులు
౬) కలికి , కలికి 'చిలకల కొలికి ' . ౭)" కలవారి అలివేణి ' రావే!!!!!!"
౮) "కల గంటి నో యమ్మ ! కల గంటిని !.
"౯) కల ,కలలు , స్వప్నములు
౧౦)" కల కాలము ఎల్లరు వర్ధిల్లు దురు గాక !
.......................................................................................................
యుగళ గీతము (ఈ మహిమ నీదేనులే !)
పెండ్యాల నాగేశ్వర రావు "కళావతి(కలావతి) రాగములో కూర్చినది ఈ పాట,ఘంటసాల అత్యున్నత శిఖరములందున్నప్పుడు,వేరే పద్ధతిలో,వైవిధ్యముగా ఉదయించినది ఈ స్వరార్ణవము. జానకి స్వరముతో కలిసిన "యుగళ గీతము"గా శ్రోతలకుకర్ణాటక సంగీత విద్వాంసుడైన "బాల మురళీ కృష్ణ "గళములోని
ఒకానొక వైవిధ్య భరితమైన మాధుర్యాన్ని వీనులకు విందును చేకూర్చినది.
( చిత్రం: శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు
సంగీతము ;;;;; పెండ్యాల నాగేశ్వర రావు
రచన ;;;;;;; పింగళి నాగేంద్ర రావు
గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ, యస్. జానకి )
________________________________
వసంత గాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగి తూగి
ఒక మైకం కలిగేనులే !!!
ఈ మహిమ నీదేనులే !
ప్రేమతీరు ఇంతేనులే //
~1) రవంత సోకిన చల్లని గాలికి
మరింత కోరిన వసంతుడనగా
తనువు , మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులె
ఈ మహిమ నీదేనులే !
ఆహా భలే హాయిలే !!!
2)విలాస మాధురి వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే '
ఒక స్వర్గం కనుపించెనే !
ఈ మహిమ నీదేనులే !
ప్రేమ తీరు ఇంతేనులే //