Saturday, July 28, 2018

వేణువింత చిన్నది - రవళికింత శక్తి!

నమో నమో కృష్ణ కృష్ణ మురళీ కృష్ణ ;
వేణురవమదే - సుధా సమానం ;  || 

అడుగడుగున ఓమ్ కారం ; 
వేణు గాన రస ధ్యానం ; 
బృందావన ధామం ; 
అను నిత్యం అభిషిక్తం ;  ||
;
దిశలన్నియు డోలలుగా ;
చిరు మురళీ గానములు ;
ఊగాడును, తూగాడును ;
జగతి పారవశ్యాలు ;  ||
;
వేణువింత చిన్నది ;
రవళికింత శక్తియా!?
ఎల్ల ప్రకృతి దాసోహం ;
భక్తి పొందు సమ్మోహం ;  || 
;
నమో నమో మురళీ కృష్ణ ;
\\\\\\\\\\\\\\\\\\\\\\
             sudhaaraagamu  ;  ;
=================;
;
namO namO muraLI kRshNa ;  
wENurawamadE - sudhaa samaanam ;  || 

aDugaDuguna Omm kaaram ; 
wENu gaana rasa dhyaanam ; 
bRmdaawana dhaamam ; 
anu nityam abhishiktam ;  ||
;
diSalanniyu DOlalugaa ;
ciru muraLii gaanamulu ;
uugaaDunu, tuugaaDunu ;
jagati paarawaSyaalu ;  ||
;
wENuwimta cinnadi ;
rawaLikimta Saktiyaa!?
ella prakRti daasOham ;
bhakti pomdu sammOham ;  || 
;
namO namO muraLI kRshNa ;   

పద యుగళ చిత్రాలు - వింత!

వేణువింత చిన్నది ;
రవళికింత శక్తియా!?
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
క్రిష్ణ, పదములింత చిన్నవి ;
పెను నాగు పడగలపై ; 
అరుణ పద్మ చిత్రాలను ;
అచ్చు వేసె, నెంత వింత!? ;
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
క్రిష్ణ నడుము ఇంత చిన్నది ;
కోపించిన జనని కట్టె ;
బంధనముల రోలు లాగి ;
పెను మద్దుల కూల్చె వింత ;
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
===========================; ;
;
wENuwimta cinnadi ;
rawaLikimta Saktiyaa!?
wimta emta koluwagalanu!?  ||
;
krishNa, padamulimta cinnawi ;
penu naagu paDagalapai ; 
aruNa padma citraalanu ;
accu wEse, nemta wimta!? ;  ||
;
krishNa naDumu IMTA cinnadi  ;
kOpimcina janani kaTTe ;
bamdhanamula rOlu laagi ;

penu maddula kuulce wimta ;  ||
;

ఓమ్ కార జలఘోష

కాళింది నది జనని ;  
అందుకో హారతి ;  ||
;
నీలాంబర చుంబితం కాళింది కెరటాలు ;
నీల మేఘ శ్యామ - వినీలోత్పన్నం విరాళి ; 
ఉవ్వెత్తు ఉవ్వెత్తు ఉరికే తరంగములు ;
అలల శంఖాలన్ని చేరె అవనీ పతిని ;
ఓమ్ కార జలఘోష - సమ్మిళిత వ్యాహ్యాళి ;  ||
;
అవధి అన్నది లేని శ్రీక్రిష్ణ నాట్యాలు ;
మోహనం ధవళిమ - తరళతల అరుణిమ ;
ఎగసెగసి ఎగసెగసి చరణోత్పలం ధూళి ;
ఆదిశేషుని రూపు ఆకట్టుకొను జగతి  ;
వాణికి అందినది వర మురళి రసకేళి ;  ||
;
కాళింది నది జనని ;
అందుకే హారతి ;
అందుకో అందుకో అందుకో హారతి  ;  || 
;
===========================; ;
;
kaaLimdi nadi janani ;

amdukO haarati ;  ||
;
neelaambara cumbitam kaaLimdi keraTAlu ;;

neela mEGa SyAma wineelOtpalam wirALi ; ;
uwwettu uwwettu urikE taramgamulu ;
alala SamKAlanni ;
awanipati cErinawi ;

Omm kaara jala ghOsha sammiLita wyaahyaaLi ;
;
awadhi annadi lEnidi Sree krishNa nATyaalu ;
mOhanam dhawaLima - taraLatala aruNima ;

egasegasi caraNOtpalam dhuuLi ;
Adi SEshuni ruupu aakaTTukonu jagati ; 
wANiki amdinadi wara muraLi rasakELi ;
;
 kaaLimdi nadi janai ;
amdukE haarati  ;

amdukO amdukO amdukO haarati ;  ||

ప్రేమికా శిల్పిక

పదములన్ని తొణికించును ; 
పెను - అనురాగ భావముల ;
పదములన్ని తొణికించును ;  ||  
;
పలు మమతానురాగ ;
భావములను చిలికించును రాధిక ;
చిలకరించేను క్రిష్ణ ప్రేమిక  ;  ||  
;  
లోహ పదములను -
ఇరుమారు ముమ్మార్లు 
- పుటం పెట్టి - సానబట్టి ;
పసిడి ప్రతిమ గీతిగా మలిచి ;
నిలిపినది- రాధిక - ప్రేమికా శిల్పిక ;  || 
;
ప్రణయాలయ అర్చిణి* ; 
రాధమ్మా!
నీదు పెదవిని మృదు వాణి, 
చలువ రాయి వేదిక ; 
పేర్చుమా ఇవ్వుమా ;
వినూత్న శశి వెన్నెల వేదిక ;  || 
;
అర్చిణి* ;  = స్త్రీ - అర్చన + ; అర్చకురాలు ;
===============;
;

palu mamataanuraaga ;
bhaawamulanu cilikimcunu raadhika ;
cilakarimcEnu krishNa prEmika ; 
;
lOha padamulanu ; irumaaru mummaarlu ;
puTam peTTi - saana baTTi ;
pasiDi pratima geetigaa malici ;
nilipinadi- raadhika - prEmikaa Silpika ;
;
praNayaalaya arciNi* ; 
raadhammaa!
needu pedawini mRdu wANi ;
caluwaraayi wEdika ; 
pErcumaa iwwumaa ; 
winuutna SaSi wennela wEdika ;  ||
;
arciNi* ;  = stree - arcana + ; 

భావ రధము అపూర్వం

మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||
;
క్రిష్ణ రాధ ప్రియ జగతి ;
పదముల గతి - భావ గీతి ;
ఈ తూరి,  మరో తూరి ;
ఎన్నిసార్లు నుడివినా ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||

భావ రధము అపూర్వం ;
అనురాగం సారధి ;
మునుముందుకు సాగేటి ;
త్వరిత తురగ వల్గనం ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||

గమనమ్మనితర సాధ్యం ;

ప్రణయ మహిమ శక్తికి ;
ఆ వేగం అతి సాక్ష్యము ;
బహుళ ప్రబల సాక్ష్యము ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||  

చెప్పరాని అల్లరికి పదవల్లరి

ఎంతెంతో అల్లరి ; 
పదే పదే చెప్పరాని అల్లరి ;
హరి హరీ,
ఇది - క్రిష్ణ లీలల లహరి ;  ||

ప్రాణేశుని మనోరధం ;
ఈడేరెడు పదవల్లరి ; 
రాధా - అధరమ్ముల మాటున ; 
చేయుచుండె అల్లరి ; 
హరి హరీ ;
ఎంతెంతో అల్లరి ;  ||
;
అనురాగ భావ జగతి ;
స్ఫటిక ప్రణయ ఆకృతి ;
రాధికా సంస్కృతి ;
యుగ ప్రబంధ సత్కృతి ;
సరి, సరి ;
కవి కలములకిదియె ఆస్థి ;  ||
=
emtemtO allari ;
padE padE cepparaani allari ;
hari haree,
idi /krishNa leelala lahari ;  || [+ amtaa] ;;;;;;;

prANESuni  manOradham ;
eeDEreDu padawallari ; 
raadhaa adharammula mATuna ; 
cEyucumDe emtemtO allari ; 
hari haree ;
emtemtO allari ;  ;  ||
;;  ;
anu;raaga bhaawa jagati ;
sphaTika praNaya aakRti ;
raadhikaa samskRti ;
yuga prabamdha satkRti ;
kawi kalamula kidiye aasthi ;  ||

లెక్కపెట్టగలమా శ్రీకృష్ణలీలలు

ఇన్ని ఏల, లెక్కలేల, 
ఏ వేళనైన లెక్కపెట్టగలమా ; 
క్రిష్ణయ్యా, నీ లీలలు ;  ||  

గోవర్ధన గిరిని నీదు కొనగోటి పైన ;
కుదురుగ్గా  నిలిపి గొడుగు చేసి ;
భద్రముగా కాపాడిన నీ చాతుర్యం అచ్చెరువు ; 
ప్రజలందరిని వైనంగా; 
కాపాడిన చాతుర్యం అచ్చెరువు ;  ||  
;
గీతాచార్యుడివి ఐనా ; గానలోలుడివి ఐనా ; 
లాస నర్తనా నిపుణుడివే ఐనాను ; 
నీదు ముగ్ధ మోహనాల నవ్వు ; 
అవే చాలు కోటి విలువ ; 
ఇన్ని ఏల, లెక్కలేల, 
లెక్కపెట్ట గలమా క్రిష్ణయ్యా, నీ లీలలు ;  || 

మాటలకు మౌన ముద్ర

మనసిచ్చి మాటాడు మగువ 
ఇపుడు ఇంత ;
మౌన ముద్ర పట్టెనేమేమి!?
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
పెదవి గొడుగు నీడలందు ; 
తల దాచుకున్నాయా ;
మాటలు తల దాచుకున్నాయా ;
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
నిశ్శబ్దం, మౌనములను ;
మోసి మోసి పెదవులు ;
అలసిపోవునో ఏమో, 
;
= నిశ్శబ్దం, మౌనములను ;
ఈ పగిదిని మోసి మోసి ;
తన కోమల పెదవులు 
అలసిపోవునో ఏమో, 
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
మాటలకు మౌన ముద్ర ;

Sunday, October 29, 2017

పాల వెన్నెలకు అద్దిన రంగులు

జంటల లీలలు ; జాబిలి కంటను పడినాయి ; 
మింటను, జాబిల్లి కంటను - పడనే పడినాయి ;   || 
;
రజనీనాధుని కంటను పడనే పడినాయి ;   
రేరాజు కిలకిలా  ; రాకా చంద్రుడేల నవ్వుచుండె ; 
జాబిల్లి కంట పడిన మధు దృశ్యం - అది ఏమై ఉండును!???  ; 
;
కాముని పున్నమి రంగుల హేలల ;
పాల వెన్నెలకు అద్దుతు అతివలు ;
రాసక్రీడల హంగుల మేళా ;   || 
వనితల వలువలు వన్నెల చందము ;
చంద్రుని తెల్లని వెన్నెల సైతం ;
వర్ణభరితము ఆయెనులే ; 
మేలిముసుగుల అన్ని రంగులకు - 
దోబూచాటలు చాలా చాలా ; 
;
"చాలంటే అది ఒప్పదులే!
చాలని తనమే మేలిమి కళయై ;
చంద్రకళలకు సోయగమద్ది ;
మది మది నెమ్మది - రంగవల్లియై ;   || 
;
=========================;
;
jamTala leelalu jaabili kamTanu paDinaayi ; 
mimTanu - jaabilli kamTanu paDanE paDinaayi ; ||
;
rajaneenaadhuni kamTanu paDanE paDinaayi ;   
rEraaju kilakilaa ; raakaa camdruDEla nawwucumDe ;  
jaabilli kamTa paDina madhu dRSyam - adi Emai umDunu????? ; 
;
kaamuni punnami ramgula hEla ;
paala wennelalaku addutu atiwalu ;
raasakreeDala hamgula mELA :  ||
wanitala waluwalu wannela camdamu ;
camdruni tellani wennela saitam ;
warNabharitamu aayenulE ; 
mElimusugula anni ramgulaku - 
dObUcATalu caalaa caalaa ; 
;
"caalamTE adi oppadulE!
caalani tanamE mElimi kaLayai ;
camdrakaLalaku sOyagamaddi ;
madi madi nemmadi - ramgawalliyai ; ||
;

పూస వెన్న కిటుకులు భలే భలే

నవనీత చోరుని పట్టుకుంటిమి ; 
ఒడుపుగాను, నేర్పుగాను పట్టేసాము  ;  ||
;
ఇంద్రనీల ఛాయ వాని దేహము పయి ;
చాల పాల తుంపరలు - 
వెన్న తుప్పరల ముత్యాల సిరులు ; 
దొంగ ఆనవాలు ఇట్టె ;
పట్టించి ఇచ్చేను గదా ;  ||
;
మౌక్తిక హారముల సొబగు భలే భలే ; 
పూస వెన్న కిటుకులు భలే భలే ;
తెలి ముత్యపు దండల - కోటి చంద్రికల ధవళిమ ;
ఇల కెపుడును పున్నమ ;
శీతలాహ్లాదముల నిత్య పున్నమ  ;  ||
;
======================;
;
indra neela CAya waani payi ;
caala paala tumparalu - 
wenna tupparala mutyaala sirulu ; 
domga aanawaalu iTTe ;
paTTimci iccEnu gadaa ;  ||
;
mauktika haaraముla sobagu BalE BalE ; 
puusa wenna kiTukulu BalE BalE ;
teli mutyapu damDala kOTi camdrikala dhawaLima ;
ila kepuDunu punnama ;
Siitalaahlaadamula nitya punnama  ;  ||
;

జరుగుబాటు ఉంటే చలామణీ

పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ;
అలకనంద కోపమును తీర్చును గోవిందుడు ; 
;
పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ; 
జరుగుబాటు ఉంటే ఆజ్ఞలు, ఆదేశాలు ; 
ఛప్పన్నారు దేశాలలోన చలామణీ ఔతాయి ; 
అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే :  || 
;
చెలి చూపులలోన ; 
కాయును ఎర్రని పగడాలు ; ; 
ఎర్రెర్రని పగడాలు ; 
కోపాలు, కినుకలు, అలుకలును ;
ఇంతటి విలువైనవి ; 
|| అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే || 
;
తన నిరసనలు అమూల్యాలు ; 
క్రిష్ణయ్యకు తెలుసెపుడో ; 
అతివ రాధ అతిశయం - ఎంతో ముద్దు ; 
అనునయాల విద్యలలో 
నిపుణుడు, మన గోవిందుడు ;
||అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే! || 
;
అకారణం కోపం కోమలి రాధమ్మది ; 
ఆ అభినయము,  అనునయము ; 
ఈ అభినయము, ఈ అనునయము ; 
రసజ్ఞతా ప్రబంధము ;  ; 
కావ్య జగతికి  ఆలంబనము, ఆలవాలము ; 
|| అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే || 
;
======================;
;
padE padE aluguTalO aaritEre raadhamma ; 
alakanamda kOpam ; teercunu gOwimduDu ;  ||
;
padE padE aluguTalO aaritEre raadhamma ; 
jarugubATu umTE ;aaj~nalu, aadESAlu ; 
Cappannaaru dESAlalOna calAmaNI autAyi kadaa : 
ani telisenu manaku nEDu 
amtElE, adi amtElE :  ||

;
celi cuupulalOna ; kaayunu errani pagaDAlu ; ; 

errerrani pagaDAlu ; 
kOpaalu kinukalu, alukalunu ; + 

imtaTi  wiluwainawi ; 
||ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE ||
;
tana nirasanalu amuulyaalu ; 
krishNayyaku telusepuDO ; 
atiwa raadha atiSayam - emtO muddu ; 
anunayaala widyalalO 
nipuNuDu - mana gOwimduDu ;
|ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE || 
;
akaaraNam kOpam kOmali raadhammadi ; 
aa abhinayamu, aa anunayam ;
ee abhinayamu, ee anunayamu ; 
rasaj~nataa prabamdhamu ;
 ;
kaawya jagatiki  ;
aalambanamu, aalawaalamu ;
||ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE ||
;

రాధ మదిని గుబులు, గుంజాటన

అంబరాన తొలకరుల ;
మబ్బులు గుంపులు గుంపులు ;
రాధ మదిని గుంజాటన ;
గుబులు గుబులు గుంపులు ;  ||
;
పెరటి జామ దోర పళ్ళు ;
ఎత్తైన చెట్ల కొమ్మలందున్న సపోటాలు ;   
మేలి ముసుగులోన కుక్కి ; 
మూట కట్టి, బయలు దేరె రాధమ్మ ;  ||
;
పల్లవాధర క్రిష్ణుడు, వేణు గాన లోలుడు ; 
మురళీ వాదనలో క్రిష్ణ - ఆకలినే మరచును ; 
మొదలసలే తన ఆకలినే మరచును ; 
అనుచు - రాధ మదిని గుంజాటన ;  ||
;
పరుగులెత్తు గోవులతో  చికాకులు ;
దుష్టుల అజ్ఞాన పనులతోటి చిరాకులు ;
లోక రక్షణల వేగే క్రిష్ణమూర్తి ; 
ఆకలినే - మరచుననుచు - 
రాధ మదిని గుంజాటన ;  ||
;
ఏమరుపాటున మనము ;
ఉంటే ఎట్లాగమ్మా!?  
గుర్తు చేయాలి కదటమ్మా , 
రాధ మదిని గుంజాటన 
గుబులు గుబులు గుంపులు ;  ||
;
=======================;
;
;
ambaraana tolakarula ;
mabbulu gumpulu gumpulu ;
raadha madini gumjATana ;
gubulu gubulu gumpulu ;  ||  
peraTi jaama dOra paLLu ;
ettaina ceTla kommalamdunna sapOTAlu ;   
mEli musugulOna kukki ; 
muuTa kaTTi, bayalu dEre raadhamma ;  ||
;
pallawaadhara krishNuDu, wENu gaana lOluDu ; 
muraLI waadanalO krishNayya aakalinE maracunu ; 
modalasalE tana aakalinE maracunu ; ;
anucu - raadha madini gumjATana ; || 
;
parugulettu gOwulatO  cikaakulu ;
dushTula aj~naana panulatOTi ciraakulu ;
lOka rakshaNala wEgE krishNamuurti ; 
aakalinE maracunu - raadha madini gumjATana ;
;
EmarupATuna manamu ; 
umTE eTlAgammA!?  
gurtu cEyaali kadaTammaa , 
raadha madini gumjATana ;
gubulu gubulu gumpulu ;  ||
;