Tuesday, August 23, 2016

శ్రీరామరక్ష

చుట్టు  చుట్టు తిరిగేవు, 
అమ్మ చుట్టు తిరిగేవు ; 
ఇట్టె మాయమయ్యేవు, 
                    అమ్మక చెల్లా! ||
;
గోరు చుట్టు మొలిచెనంటు ; 
దొంగ వేషాలు వేసి ; 
నోరు తెరచి విశ్వమంత - చూపు 
సంభ్రమాల లీల లేల? || 
;
 వింతలెన్ని చూపినా 
అమ్మ వద్ద, క్రిష్ణయ్యా! ; 
చిన్ని బాలుడివే లేరా!  
;     
అమ్మ చేతి గోరుముద్ద, 
నీదు – చిన్ని బొజ్జలోన ; 
“శ్రీరామరక్ష”యే లేరా! ||
;
==============================,                  
      
 #            Sriiraamaraksha ;-    
;
chuTTu ; chuTTu tirigEwu, 
amma chuTTu tirigEwu ; 
iTTe maayamayyEwu, 
ammaka chellaa! ||
gOru chuTTu molichenamTu ; 
dogma wEshaalu wEsi ; 
nOru terachi wiSwamamta - chuupu 
sambhramaala liila lEla? || 
wimtalenni chuupinaa 
amma wadda, krishNayyaa! ; 
chinni baaluDiwE lErA! 
amma chEti gOrumudda, 
niidu – chini bojjalOna ; 
“Sriiraamaraksha”yE, lEraa ||
;
 [ పాట 35 - బుక్ పేజీ 35 ]

చల్లని చూపులు

నోరు బుంగమూతి చుట్టి ; ; 
వేళ్ళు మడిచి, కాయ చుట్టి, 
‘పచ్చి' అంటు పలికేవు! అమ్మకచెల్లా!   ||
;
పాము చుట్టలందున పవ్వళించిన సొగసులా!? ; 
నీ మేనున  ఇవి కుబుస ముద్రలా!? ;
అనంతనాగుని కుబుస ముద్రలా!?   || 
;
అమ్మ లక్ష్మి వింజామర వీచుచుండగా ; 
మణి భూషణముల పొడులు ; 
నీ - దేహమునకు కవచములవ ;
అవి కుసుమ పరాగములా!? : -
అని అందరు విస్మయచకితులు అవగా || 
;
లోకాలను చుట్టిన, 
నీ చల్లని చూపులలోనే ; 
ఒడలెల్లా పొంగగా, నే పెడుదును ; 
దణ్ణాలు, వేల కోటి దండాలు!  
;
=================== ;
;
        challani chuupulu ; -   
;
nOru bumgamuuti chuTTi ; 
wELLu maDichi, kaaya chuTTi, 
‘pachchi' amTu palikEwu! ammakachellA!
;
; paamu chuTTalamduna pawwaLimcina sogasulaa!? ; 
nii mEnuna  iwi kubusa mudralaa!? ; 
anamtanaaguni     ||
;
amma lakshmi wimjaamara luupuchumDagaa ; 
maNi BUshaNamula poDulu ; 
nii dEhamuna kawachamulawa ; 
awi kusumaparaagamulaa!? : 
ani amdaru wismayachakitulu aguchumdagaa     ||
;
lOkaalanu chuTTina, 
nii callani cuupulalOnE ; 
oDalellA pomgagaa, 
nE peDudunu daNNAlu, 
wEla kOTi damDAlu! 
;
**************; 
[ పాట  33 - 34 - బుక్ పేజీ 34 ]:-     

ముత్యాల పలుకులు

తల్లి ఒడి లోపల ; 
తాను,  చల్లగా ఒదిగి ఒదిగి ; 
చిట్టి ముత్యాల పలుకుల పాటలల్లి ; 
అల్లిబిల్లి ఆటల ఈ గారాల పట్టి ||
;
గోరు ముద్దలు తనదు బుగ్గల పట్టి పెట్టి ; 
బూరెబుగ్గల భరిణలోన దాచిపెట్టి ; 
అమ్మనిటుల మాటి మాటికి బులిపించునట్టి ; 
తీరులెంతయు పసిడి రాసుల తేనె తుట్టె! ; 
;
చిట్టి వ్రేళుల , యశోదమ్మ చుబుకమును పుణికిపెడ్తూ ; 
చిట్టిబాలుడు ఇటుల మురిపించునట్టి తీరు ; 
భక్త కవులకు నుతుల కవితలకు ఉండునా కొదవ!?    
;
===========================================,
;               
#                        mutyaala palukulu 

talli oDi lOpala ; 
taanu,  
challagaa odigi odigi ; 
chiTTi mutyaala palukula pATalalli ; 
allibilli aaTala ii gaaraala paTTi ||
;
gOru muddalu tanadu buggala paTTi peTTi ; 
buurebuggala bhariNalOna daachipeTTi ; 
ammaniTula mATi maaTiki bulipimchunaTTi ; 
tiirulemtayu pasiDi rAsula tEne tuTTe! ; 
chiTTi wrELula , 
yaSOdamma chubukamunu puNikipeDtuu ; 
chiTTibaaluDu iTula muripimchunaTTi tiiru ; 
bhakta kawulaku nutula kawitalaku umDunaa kodawa!?                                                         
;
ముత్యాల పలుకులు  ;- [ పాట 22 & 23 - బుక్ పేజీ 33  శ్రీకృష్ణగీతాలు ]

జ్యోత్స్నామయం

వ్రజనాయకం  ;  కలభాషణం ; 
గోవర్ధనాద్రి సముద్ధితం ; 
మురళీరవం , కరకంకణం || 
;
మంజీరశింజిత మధు మోహనం : 
గోపీజనం , హేలా ఘనం ; 
లీలావిలాస  లసత్ ; 
యమునా తరంగ రంగిత ; 
జ్యోత్స్నామయం || 
 
 ======================================================;                                   
                  jyOtsnaamayam ;- :

wrajanaayakam  ;  kalabhaashaNam ; 
gOwardhanaadri samuddhitam ; 
muraLIrawam , karakamkaNam || 
;
mamjiiraSimjita madhu mOhanam : 
gOpIjanam , hElA Ganam ; 
liilaawilaasa  lasat ; 
yamunaa taramga ramgita ; 
jyOtsnaamayam || 
;
 [ పాట 22  - బుక్ పేజీ 33  శ్రీకృష్ణగీతాలు ]   

వన భోజనములు

బంతి భోజనముల వేళ మించిపోవురా! ; 
వన జనముల సందడులు; 
నోట నీరు ఊరుచుండు, 
ఒకటే ఉవ్విళ్ళు : 
రా రా! కృష్ణా! వేగమె రారా! కృష్ణా! ||
;
బంతులాటా లాడేవు; బంతులేసి; 
పరుగు లెత్తి, దోబూచులు ఆడెదవు ; 
వేళమించి పోవురా! వైళమె ఇటు రారా కృష్ణా! || 
;
పూబంతి, చేమంతి, కనకాంబర పూవులను ; 
వనితా కేశములందున ; ఇట్టే తురుముతావు ; 
“అందున్ సప్తమి “ అంటూ చిలిపిగాను నవ్వెదవు ||
;
తుంటరిగా – వెక్కిరింపు పేర్లు – ఎన్నొ పెడతావు ; 
కొంటెకోణంగికి ‘నామ - వాచకము ‘ లన్నియు ; 
తెలుసుననే సంగతి మాకెప్పుడో తెలుసునురా! ||:-
;
========================;

# ; wana bhOjanamulu ;-

bamti bhOjanamula wELa mimchipOwuraa! ; 
wana janamula samdaDulu; 
nOTa niiru uuruchumDu, okaTE uwwiLLu : 
raa raa! kRshNA! wEgame raaraa! kRshNA! || 
;
bamtulaaTA laaDEwu; bamtulEsi; 
parugu letti, dObuuchulu ADedawu ; 
wELamimchi pOwuraa! waiLame iTu raaraa kRshNaa! || 
;
; puubamti, chEmamti, kanakAmbara puuwulanu ; 
wanitA kESamulamduna ; iTTE turumutaawu ; 
“ amdun saptami “ amTU chilipigaanu nawwedawu ||
;
tumTarigaa – wekkirimpu pErlu pErlu – enno peDataawu ; 
komTekONamgiki ‘naama - waachakamu ‘ lanniyu ;
telusunanE samgati maakeppuDO telusunurA! ||
;
వన భోజనములు ;-   [ పాట 21 ; బుక్ పేజీ 32  , శ్రీకృష్ణగీతాలు ] 
& రాధామనోహర 

Saturday, August 20, 2016

నీరజనాభా!

నీరజనాభా! భక్తవల్లభా! శ్రీనాధా!  
లీలామానుష సూత్రధారీ! 
ఏ రీతిని నే చేరుదు  నీ దరి? 
నీవే చూపవ దారి!  ||లీలా||
;
నీరాజనముల జలకమాడుదువ? 
నీరజనాభా! 'బాష్ప నీరాజనముల ' స్వీకరింతువా!?          
తోమాలలను ధరియింతువ మెడలో! వనమాలీ!  
వలపు తోమాలలను ధరియించుదువా?                  ||లీలా|| 
;
శ్రీ చందనములను అలదమందువా! 
రాస విహారీ!హరి చందనములను అలదమందువా!
క్షీరాన్నములను భుజియించుదువా!? 
క్షీరాంబుధిశయనా! ; 
కేళీ క్షీరాన్నములను భుజియించుదువా!?   ;||లీలా||
;
పత్ర పుష్పములు గైకొనెద ననుదువా!? ; 
కమలలోచనా! ; ఫల తోయములే చాలునందువా!?;  
ధూప దీప ఆరాధనలకే సంతసింతువా? నంద కిశోరా! ; 
ఈ రాధా హృదయ తల్పమున శయనింతు నందువా!?    ||లీలా|| ;
;
 =================================,
;
neerajanaabhaa! bhaktawallabhaa! SrInaadhaa! 
leelaamaanusha suutradhaarI! 
E rItini nE chErudu  
nI dari? neewE chuupawa dAri!  ||leelaa||
;
neeraajanamula jalakamADuduwa? 
neerajanaabhA! 'baashpa neeraajanamula' 
sweekarimtuwA!? ;;; 
tOmaalalanu dhariyimtuwa meDalO! 
wanamAlI! walapu tOmaalalanu dhariyimchuduwaa?    ||leelaa||
;
SrI chamdanamulanu aladamamduwA! 
rAsa wihaarI!;hari chamdanamulanu aladamamduwA!
ksheeraannamulanu bhujiyimchuduwA!? 
kshiiraambudhiSayanA! ; 
kELI ksheeraannamulanu bhujiyimchuduwA!?   ;||leelaa||
;
patra pushpamulu gaikoneda nanuduwA!? ; 
kamalalOchanA! ; phala tOyamulE chAlunamduwaa!?;
dhuupa deepa aaraadhanalakE samtasimtuwA? namda kiSOrA! ; 
ii raadhaa hRdaya talpamuna Sayanimtu namduwA!?   ;||leelaa|| ; 
;
 ;  ] [పాట  56 ;  బుక్ పేజీ 61  , శ్రీకృష్ణగీతాలు ]

Thursday, August 4, 2016

ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్?

ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్?
(answer):::
ఘీంకరిస్తూ అడవికి పోతా!
(ప్రశ్న) :::
అడవికి పోయి అటేమి చేస్తావ్?
( answer ):::
పద్మావతినీ భయ పెడతాను
అయ్యవారిని చేరును అమ్మ! 
శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి
సాష్టాంగం!దండ ప్రణామం!

అమ్మకు,అయ్యకు కళ్యాణం
అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా!
నా వీపు పైన అంబారి కట్టి
వధూ వరులను కూర్చుండ బెట్టి
ఊరేగిస్తా ముల్లోకములు. 
;
*************************;
; konamanini.blog 12, మే 2009, మంగళవారం ;- = "పెళ్ళిపెద్ద"

Wednesday, August 3, 2016

శ్రీరామ నామ దీపము

నవద్వీపం నడిబొడ్డున ; 
నవనవలాడే దీపము
శ్రీరామ నామ దీపము ; ||
;
కారడవిని దారి తప్పి ; 
చరియించే వేళలందు ; 
ఆలంబన దీపము ;
కారు చీకట్లు ముసిరినపుడు ; 
ఆధారం దీపము ; || 
;
రాయిరప్పలందున 
దారితెన్ను తెలియ రాక ; 
బాట వేసుకొనుటకు ; 
క్రొమ్మించు దీపము ;  ||
;
మునుముందుకు
తొట్రుపడక నడచుటకు ; 
దారి చూపు దీపము; 
;
[ రామనిధి ]

***********************************,

[ శ్రీరామ సుధ, శ్రీరామ గీతములు ]

Tuesday, August 2, 2016

వనమాలీ! సరిసాటి!

వనమాలీ! ఈ అవనీతలము ; 
నీ పావన పదముల ముద్దాడెనురా!  
శౌరి! మురారీ! మదన కదనమున ; 
సరిసాటి! నీకు నీవేరా సరి సాటి! 
సరి సరి! ; సరే! సరి!    ||వనమాలీ!||  
;
గోవర్ధన గిరిధారీ! శౌరీ! ; 
సౌదామినులల తోరణమ్ములను కట్టెనురా! ; 
అల శరత్ జ్యోత్స్నలు ; 
నీదు శిరసుపై ; 
"సిరి ఛత్రములై వెలసెనురా ; 
బర్హి పింఛధారీ! మురారీ!  ||వనమాలీ!|| 
;
నీ దరహాస తుహినములు వెల్లివిరిసెనురా! 
తుహిన మాలలను తాము ముడువగా ; 
ముచ్చట మల్లిక లానకట్టలను వేసెనురా! ;   ||వనమాలీ!||
;
గీతం ;- 
======================================,

geetam ;- 

wanamaalii! ii awaneetalamu ; 
nee paawana padamula muddADenuraa!  
Sauri! muraarI! madana kadanamuna ; 
sarisATi! neeku neewErA sari sATi! 
sari sari! ; sarE! sari!    ||wanamaalii!||  ;
;
gOwardhana giridhaarI! SaurI! ; 
saudaaminulala tOraNammulanu kaTTenurA! ; 
ala Sarat jyOtsnalu ; 
needu Sirasupai ; 
"siri Catramulai welasenurA ; barhi 
pimCadhArI! murArI!  ||wanamaalii!|| 
;
nee darahaasa tuhinamulu welliwirisenuraa! 
tuhina maalalanu taamu muDuwagA ; 
muchchaTa mallika laanakaTTalanu wEsenurA! ;   ||wanamaalii!||
;
******************************************,
 another SONG :- 
         వనమాలి రాకకై నాదు ;  కనులు కాయలు కాచెనమ్మా ; 
                    wanamaali ;[పాట 50 ; బుక్ పేజీ 56]  ;
 [పాట 55 ; బుక్ పేజీ 60] , శ్రీకృష్ణగీతాలు ] [పాట 55  ;  బుక్ పేజీ  60 ] , శ్రీకృష్ణగీతాలు ] 

రాధిక వలపులు

వలసినదేమో తెలుపవిదేల? ; 
కావలసినదేమో తెలుపవిదేల?
రాధిక వలపుల దోచిన రేడా!;   ||వలసిన||
;
చందన మలిదేదా? శ్యామా!; 
గంధము పూసేదా? 
కుందమాలలను కూర్చితి లేరా ; 
నీకై ముకుంద, మాధవ, గోవిందా! ||వలసిన||
;
ద్రాక్షా పాకము త్రాగుదువా? 
మదన కదన కౌతూహల శౌరీ! ; 
కదళీ ఫలముల గ్రోలుదువా?  ;   ||వలసిన||
;
నారికేళాములు కావలెనా? 
"నారీ జన మన" సరసీ హంసా! 
మరి, ఇక్షు రసములను గ్రోలుదువా?  ;   ||వలసిన|| 
;
తృణ రాడ్రసములు వరియించెదవా? ; 
ఆర్త త్రాణ పరాయణ దేవా! ; 
సురలోకపు సుధకై ; 
గోముగ మారాము సేయుదువా? ;   ||వలసిన||  

మోహన మురళిని వలచుదువా! ; 
యదు వంశీకృష్ణా! 
మరి, రాధిక , 
అధరామృతమును వాంఛించెదవా?;   ||వలసిన|| 
;
=======================;

         raadhika walapulu ;- 

walasinadEmO telupawidEla? ; 
kaawalasinadEmO telupawidEla?
raadhika walapula dOchina rEDA!;   ||walasina||
;
chamdana malidEdA? SyAmA!; 
gamdhamu pUsEdA? 
kumdamaalalanu kuurchiti lErA ; 
neekai mukumda, maadhawa, gOwimdA! ||walasina||
;
draakshaa paakamu traaguduwA? 
madana kadana kautuuhala SaurI! ; 
kadaLI phalamula grOluduwA?  ;   ||walasina||
;
naarikELAmulu kaawalenA?
"naarI jana mana" sarasI hamsA! 
mari, ikshu rasamulanu grOluduwaa?  ;   ||walasina|| 
;
tRNa rADrasamulu wariyimchedawaa? ; 
aarta trANa parAyaNa dEwA! ; 
suralOkapu sudhakai; 
gOmuga maaraamu sEyuduwA? ;   ||walasina||  
;
mOhana muraLini walachuduwaa! ; 
yadu wamSIkRshNA! mari, raadhika , 
adharaamRtamunu waamCimchedawaa?;   ||walasina||
;
పాట ;  బుక్ పేజీ  , శ్రీకృష్ణగీతాలు  పాట ;  బుక్ పేజీ  , శ్రీకృష్ణగీతాలు   పాట ;  బుక్ పేజీ  , శ్రీకృష్ణగీతాలు ;- 

   రాధిక వలపులు ;- [పాట 54 ;  బుక్ పేజీ 59  , శ్రీకృష్ణగీతాలు ]

Monday, August 1, 2016

వేణు గాన వినోది

పల్లవాధరముల నొక పరి ; 
పలికించవా, వేణు గానామృతమును ||
;
పగడాల పెదవిపై నొక పరి ; 
ఒలికించవా దరహాస రసములను ; 
నీలాల కన్నుల నొక పరి ; 
తిలకించవా దీనారవిందయౌ రాధను, 
                                    నీ రాధను ;
;
===========================;
;
                  wENu gAna winOdi ;-

pallawaadharamula noka pari ; 
palikimchawaa, wENu gAnaamRtamunu ||
;
pagaDAla pedawipai noka pari ; 
olikimchawaa darahaasa rasamulanu ; 
neelaala kannula noka pari ; 
tilakimchawaa deenaarawimdayau raadhanu, 
                                         nee raadhanu ; 

[వేణు గాన వినోది ; [ [పాట 53 బుక్ పేజీ 59] ]

రాధామోహన రూపము

రాధా మోహన రూపము ; 
తన్మయమందిన ప్రేమ భావము ;
వర్ణింపగ చాలదు ఎట్టి పదమును ;   ||
;
"మదనుని విల్లై" వంగెను రాధ: 
అరవిందలోచనుని ఆనంద ; 
రసార్ణవ ప్రమదావనమున ;   ||
శరదిందు జ్యోత్స్నయై విరిసెను రాధ ; 
కుంజవిహారీ చుంబన సరసున ;   ||
;
================================,
;
                     raadhaa mOhana ruupamu ; -
 
raadhaamOhana ruupamu
tanmayamamdina prEma BAwamu ;
warNimpaga chAladu eTTi padamunu ;   ||
;
"madanuni willai" wamgenu rAdha: 
arawimdalOchanuni aanamda ; 
rasaarNawa pramadaawanamuna ;   || 
;
Saradimdu jyOtsnayai wirisenu raadha ; 
kumjawihaaree chumbana sarasuna ;   ||

;
రాధామోహన రూపము :-       [పాట 52 ; బుక్ పేజీ 54 ]