సీతమ్మ కనుబొమ్మలు; స్వర్ణ ధనుసు
పోలిక
శివధనువును చిటికెలోన;
ఎత్తి, జరిపినట్టి, పూ బోణి
; ఈమేనా? కడు వింత! ||
విల్లుతోనె ముడిపడినది జానకీ జీవితము ;
విలు వంపుల మేని హొయలు నవ రత్న నిధుల విలువెత్తు!
ఆ......! ఔనా? ఆహా ఔనా?
ఔనౌనా? ||
స్వయంవరమండపమున;
కోటిలోన ఒక్కనిగా; ఆ నడచి వచ్చునది ఎవరే?
నీలమోహనుడు, మేఘశ్యాముడు
ఎవరమ్మా, చెప్పమ్మా ||
మునిజననుత, లోక వినుత; శ్రీరాముడు;
ఓ చెల్లీ!
అతనే కోదండపాణి, జగదేకవీరుడౌనమ్మా!
||
విలువేదిక వద్ద కేగి, కాలి బొటన
వ్రేలి క్రింద;
లోహ ధనువు నట్టిపెట్టి;
నారిని కొన కొమ్ముకు ఒడుపుగాను కట్టబోయె ||
(మన రాములు
సంధించెనొ? సారించెనొ?
ఇటు వింటి నారినీ;
సారించెను దృక్కులనూ
అటు సీత పైన కాబోలును)
ఫెళ్ళున విరిగిన దదేమి?
: “ఆ ధూర్తుల గర్వమ్ములు!”
ఝలు ఝల్లున + తొణికినవేమి?
: “సీత ఎడద మైమరపులు!”
లోకములకు ఆదర్శప్రాయ దాంపత్యపు సూచిక
; ఈ ఈశు ధనువు
అది "ఓమ్ కారము - ప్రతిబింబము!"
సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలో
ఓమ్ లిపిగా తనరంగా;
'ओम ओम' 'ओम
'ओम' 'ओम' ओम'
ఫణి భూషణు భుజములందు సర్పమ్ములు నాట్యమాడె! ||
శ్రీరామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!
శ్రీ రామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!
||
(
సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలొ/ లో
)
No comments:
Post a Comment