కబీరు సుభాషితాలు ;;;;;;;(పార్టు ౨)
============
కబీరు తన జీవితమునే ప్రతిఫలింప జేస్తూ,
ఉటంకించిన అనేక "సుభాషితము"లు
ఆ కాంతి రత్నములు ఇవిగో!
1)"మాయ జిలుగు జరీల ;లౌకిక ,వస్త్రములను, కట్టినాను.
2)"తుహిన, కణము ,దాహమును ,తీర్చునా?
3)"వంగిన వాడు,నీరు త్రాగును;నిక్కిన వానికి ,దప్పిక తీరదు."
4)"'మాయ 'అనునది ,బహు మాయల మారి;
అది , వన ,జంగమ,సాధువులనూ ,కట్టి వేసినది;
పూజా స్వాములను ఆక్రమించినది;
అర్ధ విచార పడియలను , లో బరచుకున్నది.
అందరినీ త్రాడుతో కట్టి , వేసినది."
5)"పర మాత్మను చేరుట కష్టము.;భాగ్య వశాత్తూ చేర గలిగి నప్పుడు విడి పోవలదు.
అట్లు భగవంతునితో వేరు అయినప్పుడు,
శిరసున అదృష్ట మణిని కలిగి ఉన్నవారు మాత్రమే,,
తిరిగి ఆ భగవానుని చేర గలరు."
6)కబీరు దాసు తన అన్వేషణా యాత్రను గురించి ,
వ్యక్తీకరించిన పద్యాలు అమూల్య చారిత్రక నిధులు.
"కృత యుగమున "పావు కోళ్ళు"వేసుకునాను.
త్రేతా యుగమున "పతాక"ను పట్టుకుని నిలిచాను.
ద్వాపర యుగమున నడిమిని నడిచే (కడలి)బిందువును ఐనాను.
కలి యుగమున ఖండ ఖండాంతరములను తిరిగాను.
***********************************************
ఈ యాత్రావ్వేషణలో , వివిధ అనుభవాలను రుచి చూసాడు కబీరు దాసు.
శ్రీ కృష్ణ భక్తురాలైన 'సతీ సక్కు బాయి 'గృహమునకు సాధు బిక్షకై వెళ్ళాడు కబీరు.
ఆమె అత్త పరమ గయ్యాళి.
కోడలైన సక్కు బాయిని విపరీతముగా వేధిస్తూ ,ఆరళ్ళు పెట్టేది.
అపుడు తటస్థ పడిన కబీరు కూడా ఆ అత్త గారి తిట్లూ,దూషణలకు , గురి , కాక ,తప్ప లేదు.
బహుశా అలాంటి సందర్భములలో ద్యోతకమైన భావాలు
ఆయన "వచనము 'లలో అగుపిస్తాయి.
" సప్త సముద్రాలనూ తిరిగి "జంబూ ద్వీపము"(=భారత దేశము)ను చేరాను.
పర నిందను చేయని వారు అరుదుగా కన పడ్డారు."
ఇవి నేటికీ అక్షర సత్యములే కదా!
2)"సాధువుల జాతిని అడగ వద్దు.
వారి జ్ఞానమును గూర్చి మాత్రమే యోచించు.
మనకు కావలసినది ,లోపల ఉన్న కత్తికి ఎంత పదును ఉన్నది? అనేకానీ,
దాని పైన ఉన్న 'ఒర ' ఎలా ఉన్నదీ ! ,అని కాదు ,కదా!"
ఈ భావముతో ఉన్న ఈ "దోహా"ను తిలకించండి.
"జాతి న పూఛే కీ :
పూఛిలీ జయే జ్ఞాన్ ;
మోల్ కరోతర్ వార్ కా ;
పడా రహన్ దో మ్యాస్."
కబీరు వంటి సాధువులు,
లోకమున శాంతిని నెల కొల్పుటకై శ్రమించిన "మహాత్ములు".
జనులకు సదా ప్రేమను పరస్పర అను రాగమును ,
శాంత జీవనమును,మనో , తృప్తినీ , బోధిస్తూనే ఉన్నారు.
**************************************************
"అహం బ్రహ్మాస్మి."అనే ఉపనిషద్ వాక్కులలో సారము ఇదే!
కబీరు ఇలాగ అన్నాడు ,
"నేను ఉండినప్పుడు 'గురుడు 'కాన రా లేదు.
ఇప్పుడు 'గురుడు '(అనగా భగవానుడు)ఉన్నాడు.
నేను లేను.(దైవములో , లీనము , ఐనాను.)
ప్రేమ మార్గము ఎంతో ఇరుకైనది.
అందు రెండిటికీ , తావు , లేదు.(ఒక్కటి మాత్రమే అక్కడ నెల కొన గలదు.)"
అని కబీరు దాసు అన్నాడు.
నిజముగా ఇవి,"గులాబీ పూవుల గుబాళింపులే కదూ!
మరి కొన్ని చక్కెర పలుకులు చదవండి
"ఈ కబీరు తన కడుపులో , ప్రేమ 'అనే పాత్రనే అట్టి పెట్టు కున్నాడు.
ఆ ప్రేమ రోమ రోమమమున ఉద్భవిల్లుచూ తిరుగాడు చున్నది.
మరి అంత కన్ననూ తినుటకై మంచి పదార్ధము ఏమి దొరుకును!?!
"''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
యోగాభ్యాసములు,యోగాసనములు
కబీరుకు తెలుసుననేందుకు ఈ పద్యములు నిదర్శనములు.
"ఇడ" పడుగుగానూ ;
"పింగళ"ను పేక గానూ :
"సుషుమ్న"ను దారముగానూ స్వీకరించి , ఈ దుప్పటిని నేసాను."
పడుగు,పేకలు మున్నగు పదములు ,నేత వృత్తికి సంబంధించినవి.
ఆ నాటి సమాజములో "చేనేత "వృత్తి అత్యున్నత గౌరవమును పొందినది.
వాణిజ్య పరముగా మన చేనేత వస్త్రములు ,
ప్రపంచములోనే మన భారత దేశమును అగ్ర శిఖరములపై నిలిపినది.
కబీరు దాసు నుడివిన దోహాలు,పద్యములు ,
వృత్తుల విలువను తెలిపే వాడుక మాటలను మనకు అందించిన మేధావి.
సాధారణముగా "సమ కాలీనులు తమ సాటి వారి చేతలను మెచ్చుకోరు."
ఈ కోణములో చూస్తే, కబీరు దాసు నిజముగా అదృష్ట వంతుడే!
ఆతను తన సమ కాలీన సమాజములో మన్ననలను పొందిన 'భాగ్య శాలియే'!
కనుకనే ,"అభంగములు"రచించిన
ప్రసిద్ధ మరాఠీ కవి "భక్త తుకారాము" ఇలాగ అన్నాడు కదా!,
"నాకు నలుగురు మిత్రులు లభించినారు.
వారే జ్ఞాన దేవ్,నామ దేవ్,ఏక నాధ్,కబీర్‌లు."
****************************************************
(1జూన్ ౨౦౦౯ న
కబీరు దాసు (పార్టు ౧)
No comments:
Post a Comment