|
మిలెరపా యోగి |
;
;మిలెరపా 1052 - 1135 లలోని మహా యోగి
ఘుంగ్థంగ్ (ghunglang) లో జన్మించిన ఈతని మొదటి నామము "మిలా తోపగా".
ప్రత్తి, ఉన్ని బేహారులకు - గుర్తింపు నామము
"మిలా" (Mila, the cotton clad)
ఆతని తండ్రి మిలా దోర్జెసెంగ్
ఉన్ని వ్యాపారస్థుడు, ధనవంతుడు.
మిలా దోర్జెసెంగ్ కుమారుని పేరు "
మిలాతోపగా", (The hero of this real story) ,
వీరి యొక్క కుమార్తె పేరు "
పేట".
*****************************;
మిలె తొపగా (మిలెరపా యోగి తొలి పేరు) పశ్చిమ టిబెట్ లో 1052 సంవత్సరములో జన్మించాడు.
తొపగా కంఠము మధురంగా ఉండేది.
(Mila Thöpaga, which means - "Mila who is a joy to hear.")
గొంతెత్తి పాడితే చాలా కమ్మని మాటలు, పాటలు, శ్రోతలను ఆకట్టుకునేవి.
చుట్టుపక్కల వారు ఆతని గళ మాధుర్యాన్ని ఆస్వాదించే వారు.
అకస్మాత్తుగా తండ్రి జబ్బు చేసి, మంచం పట్టాడు.
కుటుంబ సభ్యులు అతడి మరణంతో దిక్కు తోచని వాళ్ళు అయ్యారు.
అప్పటి దాకా మిలడోర్జె సెంగ్ సంపాదించిన ఆస్థిపాస్థులు
అన్నింటినీ, కుత్సితులైన ఆతని చుట్టాలు కాజేసారు.
దాంతో అతని కుటుంబం అష్ట కష్టాల పాలైనది.
ఒకప్పుడు భోగ భాగ్యాలతో తులతూగిన ఆ సంసారం
కట్టుబట్టలకూ, పూట కూడుకూ కూడా మొహం వాచిపోయిన స్థితిలో ఇరుక్కుపోయారు.
దీనికంతటికీ కారణం ఆతని మామ,
తక్కిన బంధువులు ఎవరూ వారికి- డబ్బు, వస్తువులు ఇవ్వకపోగా -
కనీసము మాట సాయం కూడా చేయలేదు.
మిలెరపా తల్లి, తన వారి సహాయంతో, దినభత్యం సంపాదనతో- రోజులు నెట్టుకురాసాగారు.
********************************;
అప్పటి ఆచారం ప్రకారం బాల్యంలోనే- అబ్బాయికి పెళ్ళి చేసుకోవలసిన అమ్మాయి నిశ్చయమై ఉండేది.
అదే రీతిలో తోపగా కు ఒక అమ్మాయి వివాహం చేసుకొన నిశ్చయమై ఉన్నది.
మిలెరపా పరిణయము చేసుకోదలచిన కన్నె పేరు
జెస్సే(
Zesay)
కానీ, "ఓడలు బళ్ళు- బండ్లు ఓడలు గా మార్చ గలిగిన కాల మహిమ".
"ఉన్నపాటున తలక్రిందులైన ఆర్ధిక స్థితిలో కూరుకుపోయిన ఈ బాలుడు తోపగా- కు
నా కూతురును ఇస్తే ఇక్కట్ల పాలౌతుంది.
కాబట్టి నేను నా పుత్రికను వీనికి ఇచ్చి, పెళ్ళి చేయను గాక చేయను" అని
చిన్ననాడు నిశ్చయం చేసిన
వధువు యొక్క తండ్రి - నిర్ద్వంద్వంగానిరాకరించాడు.
తోపగా తల్లి హతాశురాలైనది.
అప్పటికి తోపగా వయస్సు 15 ఏళ్ళు మాత్రమే!
కన్నతల్లినీ, చెల్లెలు పేట నూ పోషించాల్సిన బాధ్యత ఆతని భుజస్కంధాల పైన ఉన్నది.
*******************************;
అండ లేని సంసారము కదా!
తోపగా మామ, చుట్టాలు నిరాధారులైన వీరిని చేరదీసి ఆశ్రయం కల్పించకపోగా,
మీదుమిక్కిలి వారి సంపదలను కాజేసారు.
పైగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు.
తోపగా కుటుంబం పట్ల తగని కాఠిన్యంతో వ్యవహరించేవళ్ళు.
కుక్కలు తినే ఆహారము మాత్రమే వీరికి తినడానికి ఇచ్చేవారు,
హీనంగా జీవించవలసివచ్చింది.
ఆతని తల్లి పిల్లలు ఇరువురితో బంధువుల పంచన అలాగే కాలం వెళ్ళబుచ్చింది.
కాలచక్రంలో కొన్ని సంవత్సరములు తిరిగినవి.
"ఇప్పుడు నా కుమారునికి 15 సంవత్సరాల వయసు వచ్చింది.
వీరు పుట్టినప్పుడు నిశ్చయించబడిన వధువు – జెస్సే(Zssey)- వీరిద్దరికీ పెళ్ళి చేయాలి,
కాబట్టి మాకు డబ్బును ఇవ్వండి.
ఇన్నాళ్ళూ మా ఆస్థినే మీరు అనుభవించారు కదా!
ఇప్పటికైనా మాకు కొంత డబ్బు దస్కం ఇస్తే,
మా గృహములో శుభకార్యాలను నెరవేర్చుకుంటాను."
ఆమె అభ్యర్ధనను పెడచెవిని పెట్టారు,
అంతటితో ఊరుకోలేదు ఆ క్రూరాత్ములు.
ఆమె బంధువులైన ఆ దుష్ట దంపతులు.ఈ కుటుంబాన్ని వెళ్ళగొట్టారు.
మిలెరపా, అతని చెల్లెలు పేట నడి వీధిలో బేలలుగా నిలబడినప్పుడు,
తల్లి నేలపైన దొర్లుతూ విపరీతంగా విలపించింది.
క్రూరులు, దుష్టులైన - ఆ అంకుల్, ఆంటీల ఘాతుకాలకు నిశ్చేష్టురాలు ఐన ఆతని తల్లి
"
వారిపై పగ తీర్చుకోవాలి" అనే ఆలోచనలతో కుతకుతలాడింది.
కుమారుడు తొగపాను పిలిచి,
"నాయనా! మనం నీచులైన ఈ బంధువుల వలన చెప్పరానన్ని ఇక్కట్ల పాలౌతూన్నాము కదా!
ఇంక నాలో సహనశక్తి లేదు. వారిపై ఎలాగైనా
ప్రతీకారం తీర్చుకుని తీరాలి" అని నూరిపోసింది.
ఆమెకు పుట్టింటి వారు ఇచ్చిన కన్యాశుల్కము కొంచెం ఉన్నది. ఆ కొద్ది పొలాన్నీ అమ్మివేసినది.
అలాగ వచ్చిన కొంచెం సొమ్మునుకూడా -
ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరమునకై
వెచ్చించడానికి అతని తల్లి ఎంతమాత్రమూ వెనుకాడలేదు.
"నువ్వు క్షుద్ర విద్యలను నేర్చుకో!
కుమారా! నువ్వు
శక్తివంత విద్యలను నేర్చుకోకుండా తిరిగి వస్తే- నేను ఆత్మహత్య చేసుకుంటాను" అని అన్నది.
తల్లి మాటలు అనుసరించడం వినా, మిలెరపాకు వేరే గత్యంతరం లేకపోయింది.
*******************************;
(links: father's name was Mila Sherab Gyaltsen ;
sister Peta, )
తోపగా వేరే ఊళ్ళకు వెళ్ళాడు. ఎలాగో కష్టపడి, ఒక గురువు వద్ద చేరి, కొన్ని క్షుద్ర కిటుకులను అభ్యసించాడు.
విద్యా జీవితములో తొగపా-కు ఏర్పడిన కొత్త పేరు మిలెరపా.
తమ ఊరికి తిరిగి వచ్చాడు మిలెరపా.
అక్కడ తాను నేర్చిన దుష్ట క్రూరత్వమైన మంత్ర విద్యలను ప్రయోగించాడు.
అక్కడ పండిన బార్లీ పంటలు, కొందరి జీవాలు ధ్వంసమైనాయి.
తల్లి గర్వంతో వికటాట్టహాసం చేసింది. ఆమె హుంకరిస్తూ అందరికీ ఎలుగెత్తి చాటింది
"చూసారా? నా పుత్రుడు గొప్ప మహిమలు సాధించాడు. తలచుకోగానే తుఫానులను సృష్టించి, అందరినీ అతలాకుతలం చేసేయగలడు" విపరీతమైన శాడిస్టు ఆనందములతో అరిచి, చాటింది.
ప్రజలందరూ ఆమె పలుకులు వినగానే భీతితో బెంబేలెత్తారు.
వారికి భయంతోపాటు మిలెరపా పట్ల ఏహ్యభావం సైతం పెరగసాగింది.
దాంతో మిరెలెపాకు వారు అపకారం తలపెట్టసాగారు.
భాగ్యవశాత్తూ- అతడు వెంట్రుక వాసిలో అనేక కీడులను, అపాయాలను తప్పించుకోగలిగాడు.
మిలెరపా తన సోదరిని -
ఝాంగ్ ఝుంగ్సీమ రాజు (king of Zhang-zhung )కు ఇచ్చి పెళ్ళి చేసాడు.
*******************************;
మిలెరపాకు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే-
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను.
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి.
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయ కూడదు" అనుకున్నాడు.
మిలెరపాకు పశ్చాత్తాపం కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో
మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి.
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి,
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా",
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు.
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు.
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు.
ఐతే మార్పా (Yogi GURU/ philosophy teacher)
అప్పటికే తోపగా (మిలెరపా) వలన
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి
కర్ణాకర్ణిగా విని ఉన్నాడు.
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై,
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు.
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా!
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ,
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో-
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి.
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించికుని,
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా?
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అని మార్పా సందేహం.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు.
అన్ని పరీక్షలకూ మిలెరపా, సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
(His only consolation was Damema, the kind wife of Marpa)
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు చీకటిలో దొరికిన చిగురంత దీపమే
అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ (Dagmema).
ఆమె దయాశీలిని. మార్ప భార్య దామెమ్మ ఎండమావిలో మరీచికలా,
కన్న తల్లికన్న మిక్కుటముగా ప్రేమ అనురాగాన్ని,జాలిని చూపించేది.
ఆమె మిలెరపా ను "నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ, కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో, మిలెరపా బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు.
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో,
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో-
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది.
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి,
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.ను,
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి,
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను,
నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు.
*******************************;
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు.
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11, 12 నెలలు మిలెరపా దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను లిపి బద్ధము చేసి, లోకమునకు అందించినాడు మిలెరపా.
*******************************;
మిలెరపా కు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే-
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను.
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి.
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయకూడదు" అనుకున్నాడు.
మిలెరపాకు పశ్చాత్తాపంతో కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి.
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి,
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా",
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు.
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు.
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు.
ఐతే మార్పా అప్పటికే మిలెరపా వలన
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నాడు.
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై,
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు.
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా!
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ ,
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో-
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి.
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించుకుని,
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా?
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అనే
మార్పా సందేహం ఇంకా పూర్తిగా తీరలేదు.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు.
అన్ని పరీక్షలకూ మిలెరపా , సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు
చీకటిలో దొరికిన చిగురంత దీపమే అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ.
ఆమె దయాశీలిని. ఆమె మిలెరపాను
"నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
ఆమె బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ,
కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో,
మిలెరపా బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు.
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో,
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో-
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది.
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి,
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి,
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన
మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను, నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు.
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
*******************************;
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు.
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11 నెలలు మిలెరపా దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను లిపి బద్ధము చేసి,
లోకమునకు అందించినాడు మిలెరపా.
మిలెరపా ధార్మిక ప్రవచనాలు, పద్య కావ్యాలూ
అనేక ప్రపంచభాషలలోనికి అనువాదం ఐనవి.
మిలెరపా పాటలు, పద్యములు జగద్విఖ్యాతి గాంచినవి.
మిలెరపా స్థాపించిన "గంపోపా సాంప్రదాయము"ను
లోకవ్యాప్తముగా అనుయాయులు ఆచరిస్తూన్నారు.
(tradition- Gampopa)
మిలెరపాకు అసంఖ్యాక శిష్యగణములు ఉన్నారు.
మిలెరపా సూక్తిముక్తావళి బౌద్ధ అనుయాయులకు శిరోధార్యాలైనవి.
"Cease negative actions,
cultivate positive actions,
and tame you mind."
*******************************;
Milarepa సినిమా 2006 లో వచ్చినది.
Milarepa: Magician, Murderer, Saint
Directed by Neten Chokling
Tags:-
1) Milarepa first heard the Lama utter the name "Marpa",
he felt a thrill go through his body
2) Milarepa had countless disciples such as Rechung Dorje Drakpa,
Gampopa or Dhakpo Lhaje, the eight-heart-sons, and many others)
3)(Milarepa was born to Mila-Dorje-Senge in 1052 AD:
His father was Mila Sherap Gyaltsen and mother, Nyangtsa Kargyen.
He had one younger sister, Peta Paldron)
;