శ్రీ జగన్మాతా! శ్రీ ఆది ప్రకృతీ! -
నిన్నె - నెర నమ్మినామమ్మ కదంబవనవాసినీ!
నీ నామమెప్పుడూ - పుష్ప ఛత్రమ్ము!
మాకు పుష్ప ఛత్రమ్ము!
|| శ్రీ జగన్మాతా! శ్రీ ఆది ప్రకృతీ! ||
వాత్సల్యమున నీదు-
భక్తులను లాలించు-జననివమ్మా! -
దుర్గా భవాని!-
చంద్రశేఖరు జటల - సిగ పూవు నీవమ్మ!
||శ్రీ జగన్మాతా! శ్రీ ఆది ప్రకృతీ!||
చల్లనీ చూపులతొ-శ్రీ విశాలాక్షీ!:::
శ్రీ గౌరి దేవీ!-
నిఖిల లోకమ్ములను; తిలకించుమమ్మా!
సాంబశివు అర్ధాంగి! రాగరాగిణివీ!
నీవు-అఖిల జగముల బ్రోచు తరళాక్షివి!
||శ్రీ జగన్మాతా! శ్రీ ఆది ప్రకృతీ!||
ఇలను నిన్నే నమ్మి పూజింతుము!
శ్రీ పరాశక్తి!-
ఎల్లరను లాలనగ; చూచు భారము నీది! ||
మా,ఇలవేల్పువు నీవు!-
మృదుహాసినీ!
నిన్నె-నెర నమ్మినామమ్మ!నీలవేణీ! ||
|| శ్రీ జగన్మాతా! శ్రీ ఆది ప్రకృతీ! ||
నిన్నె-నెర నమ్మినామమ్మ వనవాసినీ!
కదంబవనవాసినీ!
నీ నామమెప్పుడూ పుష్ప ఛత్రమ్ము! ||
;
**********************************;
కోణమానిని; 2010 అక్టోబర్ Total (Link)
ఆదివారం 31 అక్టోబర్ 2010
ఆహ్లాద దీపావళి
▼ October (17)
ఆహ్లాద దీపావళి
తుమ్మెదల మెట్ట దాకా పరుగు
అయస్కాంతము చెట్టు; " శివానంద లహరి"లోని 61,
గజేంద్రుల “కుంద గ్రామము”
తూలిక చమత్కారం
గాంధీ పాదుకా పట్టాభిషేకము
శ్రీ ఈశుని పార్వతి దేవి
"అమర కోశము" నిఘంటువు - (“Dictionaries Day” )
విజయ రాఘవ నాయకుని కొలువులో "శారదా ధ్వజము"
ఆనంద రూపిణీ!
kandahar - మలయాళ భాష సినిమా
భువన సామ్రాజ్ఞీ! శ్రీ కనక దుర్గా!
బొట్టు,సింధూరము - కథ,కమామిషూ
నచ్చని మీసాల మహేష్
కర్పూర హారతులు కనక దుర్గమ్మా!
ఆ ఫొటో
నేడు అక్టోబర్ 1 - International Music Day
No comments:
Post a Comment