Monday, August 13, 2012

వింటి నారి - వీణ తీగ


తరళాక్షి! కోమలీ!శ్రీ జానకీ!
ఏ వేళనందైన  భావనము నీదేను! -
మంగళ దాయినీ! మా మంగళారతులివే!
కరుణా కటాక్షముల వీక్షించవమ్మా!      ||

ఇందీవరాక్షీ! శ్రీరామ ప్రియ పత్ని!
మా మంచి ఆకాంక్షలను తీర్చవమ్మా!
దాశరధి అర్ధాంగి! వరదాయినీ!
చల్లనీ అనుగ్రహము వర్షించుమా!        ||  

వర వీణియను మీటు నీ పల్లవాంగుళి;
కోదండ ధను నారి(ని) మీటును
                    శ్రీ రాముల వేలు;
ధరణి వర పుత్రీ! అనుపముగ
ఈ ఇలను అనుగ్రహించుమా జననీ!  
మంగళ దాయినీ! మా మంగళారతులివే!
కరుణా కటాక్షముల వీక్షించవమ్మా!       ||


****************************;

******************************;

గోముగ మా పూజలందుకోవమ్మా +
ఆనంద రూపిణీ!   ( 1 - Link :- konamanini 2010)


భువన సామ్రాజ్ఞీ! శ్రీ కనక దుర్గా!  ( 2 - Link :- konamanini 2010)
               ఆదివారం 10 అక్టోబర్ 2010
నాద రూపిణీ
బిందు మండల వాసినీ!
సేద దీరగ రావె
నా మదియె నీ డోల ||


కర్పూర హారతులు కనక దుర్గమ్మా! ( 3 - Link :- konamanini 2010)
మంగళవారం 5 అక్టోబర్ 2010


వర మంజరీ సౌరభమ్ములను
ఈ - ధర వాసులకు ఒసగు కనక దుర్గమ్మా!!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||

మంగళవారం 12 అక్టోబర్ 2010


ఆనంద రూపిణీ!

హరుని హృదయేశ్వరీ! ఆనంద రూపిణీ!
సురుచిర హాసినీ! చిన్మయ రూపిణీ!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

నీదు వాత్సల్యమున
నవ నవోన్మేషమౌ హర్ష సుధలను గ్రోలు
నీ బిడ్డలము మేము
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

ఏ వేళనందైన
నీదు భావమ్ముల మావి చివురుల మెసవు
గాన కోకిలము మేము!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||No comments:

Post a Comment