;
;
జడివాన ధారలై; కురియుచున్నాది;
ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
అది యమున తీరము;
రాధమ్మ నడుము నడిసంద్రపు టలల;
తేలాడుచున్నవి జడ కుచ్చు నౌకల్లు!
;
@1] ప్రశ్న:-
ఆ బంగారు కుచ్చుల్లు ఎవ్వరివి, చెలియా!
ఆటాడు జడకుచ్చు పడవ వైనాలను మాకు తెలుపవమ్మా!
||ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
@2] ప్రశ్న:- నీలవేణీ జడల నొడిసిపట్టినదెవరు?
సమాధానము:- "నీలల మై ఛాయ క్రిష్ణయ్యవే! సఖియ! క్రిష్ణయ్యవే!
జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! కన్నయ్య కర కమల దొన్నెలందున;
పసిడి జడగంటల సౌదామినీ రాశి; ఆదిశేషుడై వెలసె; ఆ అరచేతులందున! ;
క్రిష్ణమూరితికేమొ; అవధులు లేనంత అచ్చెరువులు!!
మరి, ||జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! ||
;
రాధ:- ఊరుకోండీ చెలులు! చాలు మీ అల్లరులు!
జడిసితే ఏమాయె! జడుపు జ్వరమొచ్చేను!
మా మాయదారి కన్న, నా కడనె కూర్చుండి, నను బుజ్జగించేను!
అందుకే పణతులూ! కాస్త ఆలకించండీ!
;
" ఉష్ణము కలిగెను, నీ రాధకు..." అనుచు,
వేణుగానలోలు చెవిలోన ఊదండి మీరు!
ఇది చాలు, మీ యొక్క గొప్ప ఉపకారము!||
;
జడిపించబోకే! (Link for nice photos)
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
Happy Janmashtami 2012
శ్రీ క్రిష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
No comments:
Post a Comment