Saturday, December 26, 2009

దామినీ! ఓ దామినీ !




-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
నీలి నింగి మెరుపులార!
అంబరాన సంబరాలు!

మబ్బులతో కబురులు
ఉరుములతో ఊసులు
హరి కథలను
దివికి చెబుతూ
సాగి పోవు క్రొమ్మించులార!
స్వాగతము! సుస్వాగతము!

పౌర్ణమీ జ్యోత్స్నా తతి మించును కద
సౌదామిని తళత్తళలు!
సూర్య కిరణాలకు -పోటా పోటీలుగా
గ్రుమ్మరించు మీ మెరుపులు!

కించిత్తూ ఝడిపిస్తూ
అందరితో మేలమాట
బాల బాలికల
కిల కిల నగవులు
మీకు హేమా హేమీలుగ
ధరణి పయిన వెదజల్లులు

Baala

దామినీ! ఓ దామినీ!

By kadambari piduri, Nov 19 2009 12:31PM

Tuesday, December 22, 2009

ఇంద్ర జాలమేనా ఇది!?!


కాయిన్సుతో మ్యాజిక్కులు అనేకం ఉన్నాయి.

వాటిలో కొన్ని తమాషాల గారడీలు మీ మిత్రులకు చూపించి,
సరదా సరదాల నవ్వులను, హుషారులను
వాతావరణంలో నింపండి;సరేనా!



{ The French Drop Illusion Magic Trick Explained
--- (vedieo ) } ;;;;;

http://www.ehow.com/video_2374840_the-french-drop- illusion-magic.html ఇక్కడ క్లిక్ చేసి,enjoy చేయండి;
వీలైతే నేర్చుకో వచ్చును కూడా!!!!

Wednesday, December 16, 2009

హేమ మాలిని అభినయ విలాసము; ;





-
-
-
-
-
-


జోహారు శిఖిపింఛ మౌళీ!~~~
జోహారు రస రమ్య గుణశాలి! వనమాలి!
జోహారు శిఖి పింఛ మౌళీ! ||జోహారు||

1. కలికి చూపులతోనే చెలులను కరగించి ;
కరకు చూపులతోనే అరులను జడిపించి ;
నయగార మొక కంట!
జయ వీర మొక కంట!
చిలకరించి చెలువు మించి, నిలిచిన
శ్రీకర! నర వర! సిరి దొర //జోహారు//

2.నీ నాద లహరిలో నిదురించు భువనాలు-
నీ నాట్య కేళిలో నినదించు గగనాలు-
నిగమాలకే నీవు సిగ బంతివైనావు
యుగ యుగాల దివ్య లీల-
నెరపిన అవతార మూర్తి!
ఘన సార కీర్తి //జోహారు//

3. చకిత చకిత హరిణేక్షణా-
వదన- చంద్ర కాంతు లివిగో!
చలిత లలిత రమణీ చేలాంచల--
చామరమ్ము లివిగో!
ఝళం ఝళిత సుర లలనా
నూపుర - కల రవమ్ము లివిగో!

మధు - కర రవమ్ములివిగో !
మంగళ రవమ్ములివిగో !
దిగంతముల, అనంతముగ గుబాళించు ;
సుదూర నందన సుమమ్ము లివిగో! ||జోహారు||

**********************************************
చిత్రం : శ్రీ కృష్ణ విజయము ;గానం : పి.సుశీల ;సంగీతం: పెండ్యా

Tuesday, December 15, 2009

నాణెములు - నాణెములు -magic



coins -Magic tricks
నాణెములు / కాయిన్సును ఎలాగ మాయం చేయ వచ్చును?

తిరిగి ఆ నాణాలను ,
వేరే జేబునుండి ప్రేక్షక మహాశయులకు చూపించి,
వారిని(surprise ) సర్ప్రైజ్ చేయ గలము?

మరి అలాంటి మ్యాజిక్కులను గురించి అర్ధం చేసుకోవాలి కదా!

అలాంటిలాంటి గారడీలకు మీరు కూడా రెడీనా?

అలాగైతే, ఇక్కడ వాటిని చూడండి మరి !!!!

కస్తూరి తిలక సౌదామినులు

-
-
-
-
-
-
-
-
-
-
-
-


Balaa ;

నీదు - ఆట పాటలు కూడ
వట పత్ర శాయి !
ఆట పట్టులు కదా ,
సౌమ్య భావనా చిత్రణా దామినులకు !

1.చివురు పాదము లెత్తి, కేరింతలాడ
పద పద్మములను గని, భ్రమసి పోయి
గగన తలమును వీడి - సూర్య దేవు
డిటు వచ్చి , తానె నవ్య కాంతులీనుచు
నీదు నుదుటను కస్తూరి తిలకమయ్యె!

2. గిలక కాయలు గుప్పిట పట్టి, పట్టి
ఎలమి ఊపెదవయ్య! యశోద పట్టి !
" వెండి జాబిలి చేరె మెట్టినింట. "
అనుచు నవ్వులు చిందె -
అంబికా పతి అపుడు !

Friday, December 4, 2009

పాల వెన్నెల శిల్పాలు





-
-
-
-
-
-
-
-
-
-
-
_
_
ఈ రేయి బోసిగా ఉన్నదీ? ఎందుకని?
విశ్వ కర్మకు ఉలి చేతిలో లేదనుచు ఉలికి పాటు!
మయ బ్రహ్మకు ఎంతో తటాపటాయింపు అందుకయనండీ !

బాలల చిరు మందహాసముల పసిడి ఉలులు,
ఇవిగో! దొరికెనండీ!
అంచెలంచెలుగా, ఆ కాంచనపు ఉలులతో
విదియ నెల వంకగా ఆరంభమై
నిండు పున్నమల నిట్టె తీర్చిదిద్దేను

అమోఘము కదటండీ - చల్ల చల్లనీ
ఆ శీతల చంద్రికల అద్భుత శిల్పములు

పాల వెన్నెల శిల్పాలు ;

బాలకృష్ణుని పాల అడుగులు






రేపల్లె పుట్టినింట - ఆ అడుగు దమ్ములెవరివే?
ఆ పద పద్మము గరిమలు - స రి గ మ - పద స్వరములే!

(అను పల్లవి):::
ఆ జాడలు రాధవీ! - కృష్ణాష్టమి నాడు ఇలను
మోహన శ్యాముని చరణ ముద్ర లందున
తన " గమనము" గమకములై ఒప్పు తీరు చూడరే! ||

1.ముక్కున నత్తున మణులు - పాపిట బిళ్ళల రవ్వలు
కాంతులెన్నొ వెద జల్లెను - ఈ చోద్యము చూడరే!-

"దొంగ"అనుచు,పట్ట బోవు - వనితలకు చిక్క కుండ
కన్నయ్యకు దారి చూపు ప్రజ్ఞలే!
మన రాధికవి - బహు చమత్కార ప్రజ్ఞలే ||

2.తన నడకలే నాట్యాలు! - పెదవి విరుపులేమో
వేణువునకు అందించే - సరి కొత్త రాగములే!
మురళి ఊదు చున్నాడు- యశోద గారాల పట్టి
మన- రాధ చేయి పట్టినట్టి ఘనుడు వీడు!
ఔనౌనే! వీడు కాక ఎవరంట? ||

నారాయణా! నారాయణా!


_
_
_
_
_
_
_
_
_
_
_
_
_

పాల మీద మీగడలు – నారాయణా!
నవనీతం తేరుకుంది – నారాయణా!



వెన్న కాస్తి; నెయ్యి చేస్తి - నారాయణా!
వెన్న గోకుడుల రుచి - నారాయణా!
ఎన్నగాను ఎవరి తరము – నారాయణా!

నెయ్యి కాచి వంచాను – నారాయణా!
“గోదారి మడ్డి” ఇదిగో – నారాయణా!
చప్పరిస్తు జుర్రుకోవోయ్! – నారాయణా!

నీ లొట్టల సడి లయల తోటి – నారాయణా!
మలయ పవన వీచికలు - నారాయణా!
యమునా తరగల పంక్తులు – నారాయణా!
కావ్య పంక్తులే ఆయెను – నారాయణా

Thursday, December 3, 2009

ఒట్టు తీసి గట్టుపై పెట్టాము !



-

-

-

-

Baala

ఒట్టు తీసి గట్టు మీద


ఉట్టి మీద దాపరికం - గుమ్మ పాలు, నవ నీతం
పాలకుండ దొంతులను - "ఉత్తుత్తినె దాచామని"
పల్లె పడుచుల బొంకులు - చిలిపి ఊసులతొ నత్తులు

తరిపి పాల వెన్న ముద్ద్దలను ఇట్టే పసికట్టినట్టి
యశోదా సుతుని వద్ద - సాగేనా ఈ ఒత్తులు?

అరరే! ఆగ్రహించిన తల్లి ఎదుట -
చిన్నారి గారాల బాలుడే కద అతడెపుడూ!
రెండు చెవులు మెలి పెట్టి -
బుద్ధి సుద్దులెన్నిటినో - గరిపెనదీ యశోదమ్మ.

"ఒత్తులుగా, దీర్ఘాలుగ ఆయెనయ్యో - మెలి పెట్ట బడిన
కన్నయ్య సుకుమారపు చెవులయ్యో!"
అనుచు, తల్లడిలుచు - అందరునూ
బాల కృష్ణు లాలిస్తూ హత్తు కొనిరి

"ఒట్టి మాట ! గట్టి ఒట్టుల"న్నిటినీ
ఇట్టె గట్టు మీద పెట్టితి"మని అన్నారు
గడ్డ పెరుగుతో పాటుగ - తమ, ప్రేమలను రంగరిస్తూ
వెన్న ముద్ద,మీగడలను - కన్నయ్యకు తినిపించిరి

By kadambari piduri

Sunday, November 29, 2009

మా మంచి పంచ కళ్యాణీ !

___

___

___

___

___

___

___

___

___

___


పంచ కళ్యాణీ! పంచ కళ్యాణీ!
పంచ దార నీ నోట్లో పోస్తా!
రెక్కలు కట్టుకు,రివ్వున ఎగిరీ
విశాల గగనం చేరమ్మా!

చంద మామ తో దోస్తీ చేయి
ఆకాయ్్ కీకాయ్్ముచ్చటలాడు !
చుక్కల అచ్చన గాయలు ఆడు
మబ్బుల దాగుడు మూతలు ఆడు


జాబిలమ్మకీ కబురు నీయవే !
వెన్నెల దీపం తేట వెలుగులు
మా పాపాయిల నవ్వులతోటి
"పున్నమి దోస్తీ" చేసెనని!

టక టక గుర్రం
మా పంచ కళ్యాణీ!


Thursday, September 17, 2009

కోపమా? చెలి!


---

---

---

---

---

---

---

---

---

కినుకకు , అలకకు - పర్యాయ పదం

చేసినావు గద! -అలమేల్మంగను !

తిరుమల రాయా! సద్దు ! సద్దులే!

1.అంగనా మణి అలివేల్ మంగమ

చెలియల తో రాయంచ నడకలతొ

అల్ల నల్లన అరు దెంచెనదే!

2.కుంకుమ కుప్పలు, కోక నదములు

పంకజ కస్తూరి కలయ బోసిన

పొంకపు జలముల -

"దిష్టి తీయుదు " నని

అల్లదె! వచ్చిన అతివను చూడక

పరాకు నుంటివి ! బాగు ! బాగురా!

3.పసుపు , జవ్వాజి - కోకల ' ముడి'చి

చిటికెడు సున్నము రంగరించి,

నీ - చరణ ద్వయికి -

పారాణి సొగసులను అలదు చుండగా,

పరాకు గుంటివి వరాల తండ్రీ !

బాగు ! బాగు !- బహు భళిరా ! భళిరే !

{{{ Kovelaకోపమా, చెలి?

By kadambari piduri, Aug 31 2009 4:}}}

Wednesday, September 16, 2009

నీలికలువల మాలిక

---
---
















అపరంజి ఊయెలందున పవ్వళించి కేరింత లాడు చుండ -
"బంగారు మొల త్రాడు ఒత్తుకొనె నయ్యయ్యొ !
నాదు - బంగారు తండ్రికి !"అనుచు,
మానసమెంతొ తల్లడిలగ
నీదు నడుముకు ముద్దు లేపనమ్ముల నలదె అమ్మ . -

ఒత్తుకొనిన నీ నడుముపైన
కమిలి ,డాగుల అచ్చు ముద్రలను కనుగొనిన
తేటి గుంపులు వ్రాలె, సంతసముగ - -
"నీలి కమలమ్ముల తోరణమ్ముల"నుచు ఎంచి!!!

"హుష్! హుష్ష"నుచు- మాత యశోద
కీటకమ్ముల నవలకు తొలగ త్రోయు లోపల
' భ్రమర జాతరల' నవలోకించుచున్న
"వాసంత రా రాణి"
వేగిర పడి, తానె దిగి వచ్చె సంభ్రమమున
కటిక గ్రీష్మములను వైదొలగ జేసి.
ఋతు ఆగమన సూచిక గంద్ర గోళమవగా -

బ్రహ్మ"ఇది ఏమి వ్యత్యస్త కాల మహిమ !"అనుచు
తత్తర పడుచుండ ,వీక్షించి .

( Baala నీలికలువల మాలిక ::::; )
By kadambari piduri, Sep 6 2009 5:40AM

Saturday, September 12, 2009

చక చకా నడుద్దాము !







విష్ణు భక్తి
__________

కోటి కోటి అనుభూతుల - గనులై
విరి పరిమళ ప్రోవై నడుద్దాము - ఈ త్రోవ
(అను పల్లవి ) : -
పయనింతము మనమంతా
స్వామి శ్రీ నామమ్మును
నింపుకునీ 'మనసంతా' ! ||

1.దవ్వు,దూరమని ఎంచక
నువ్వు, నేను, అందరమూ
ఎక్కుదాము సప్త గిరులు
2.విసుగు, విరామము లేక -
ఒకటి, రెండు, మూడనుచూ -
ఏడు కొండలిట్టిట్టే
చిటికెలోన ఎక్కుదము ||
3.కొమ్ము కాచి శ్రీ రమణుడు
అండ దండగా ఉండగ
శంకలేమి? సందేహమేల ?
కోరస్ >>>
_______

తడుముకోక ,ఊరకనే
తట పటయించకుండ
ఎక్కుదాము వరుస మెట్లు
అవి -
ముక్తి గమ్య - సోపాన పంక్తి ||

Friday, September 11, 2009

1. knol - సంస్థ అందిస్తూన్న సౌకర్యము ఇది.ఒక సారి చూడండి.
2.అనిమేషన్సు నేర్చుకొనుట ఎలా ? - కొన్ని ప్రాధమిక అంశాలను / ఫండమెంటల్సును బోధిస్తూన్న వీడియో ఇది; చూడండి .

http://knol.google.com/k/knol/knol/Help#

http://knol.google.com/k/knol/knol/Help#

Monday, August 31, 2009

తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

మురళిలోన తారాడే - మలయ పవన వీచిక


ఆయె రాగ మాలిక !- అది, ఎల్లరికీ వేడుక


బృందా-వనిలోన,అందందున - వలయ నాట్య హారములు భామినుల్ ఆట పాటలన్నీ -


యమునా తటి, యామినిపై వెద జల్లుతూన్న - కువలయ విరి సౌరభములు


రాస లీల వేళలలో - వెదురు పైన స్వామి వ్రేళ్ళు !


శూన్య వంశి" వేణువు "గా - అవతరించు క్షణములలో


శ్రీ కృష్ణుని నఖములపై - విరియు జ్యోత్స్నల కాంతుల


రిమ రిమలు, మిల మిలలు - జిలి బిలి జాబిల్లి నవులు


ఆ,కిల కిలల అలల పయిన - రిం ఝిం ఝిం -రిం ఝిం ఝిం

Saturday, August 29, 2009

రాసలీలా లోలుని రూప విలాసము

వ్రజ బాలుని నాసికాగ్రమున -
ఆణిముత్యములు కాంతు లీనెడు -
నీదు దంత పంక్తియా -
రమణి రాధికా!

రాసలీలా లోలుని మణి కుండలములు -
నీ నీలి కన్నులై మిలమిలమన్నవి

శౌరి కౌస్తుభాభరణము నీదు -
చక్కని పొక్కిలాయెనో? ఏమో?

శ్రీ హరి కస్తూరి తిలక రేఖలు, నీదు -
చివురు పెదవులుగ రూపు దీరెనో?! -

కుంజ విహారీ దేహ ధాళిమ -
కుంతలములుగ శాంతమొందెనో?! -

Kovela

రాసలీలా లోలుని రూప విలాసము

By kadambari piduri, Jul 2 2009 7:39PM )

Wednesday, August 26, 2009

ఆ బాల గోపాలము (ఆటలుకాని ఆటలు)

# Kovela #
ఆటలుకాని ఆటలు
# By - kadambari piduri, Jul 4 2009 5:44PM #

మృదు మధుహాసము
-మంజుల రూపము
కని కని మురిసెను
ఆ బాల గోపాలము //

1)నెమలి పింఛ మాడినది
నుదురు పయిన
నీలి నీలి ముంగురులాడినవి //

2)ఎరపు పెదవు లాడెను
పెదవి పయిన వేణువుపై
చివురు వ్రేళు లాడినవి //

3)కుండలములు ఆడినవి
గళములోన రంగు రంగు
పూల ; దండ నాట్యమాడినది //

4)హరి నడుము ఆడినది
సిరి మువ్వలు ఘలు ఘల్లన
పద పద్మము లాడినవి //

5)రస -ధునియై ఋతు హేల
ఉప్పొంగుచు దరహసించ
బృందావని నిలువెల్లా
కమనీయపు పులకింత //

Monday, August 24, 2009

వన మయూరి

Baala

గోడలపై నానుడులు

చిన్నోడా!చిన్నోడా!సరదాగా రారండీ!
పలక,బలపం పట్టి
పుస్తకం చేత పట్టి
పాఠశాల కెడదాము! //

1)అమ్మకు,అయ్యకు మనము
ఇప్పుడే చెబుదాము
వేలి ముద్రలను మాని
చే వ్రాళ్ళను చేదమనీ! //

2)గుడి గోడలపై పాటల
నిట్టే చదివేస్తాము
లెక్కలు,సైన్సులు నేర్చి
లోక జ్ఞానమలవడేను //

3)నోట్లు,అప్పు పత్రాలను
వివరా లు తెలుసుకుంటారు
ప్రపంచమ్ము చరిత్రలను
బాగ తెలుసుకుంటారు

************************************************

Baala

జీవనగమ్యం

ఊగూ ఊగూ ఉయ్యాలా!
ఉగ్గూ పాల జంపాలా!
లాలీ లాలీ జో!(2) //

రమ్యమైనదీ రామాయణము
ఆదర్శ జీవన పథ గమ్య మది !
లోకమ్ముల ధన్య పరచు
కాంతి "గది"గ నీదు మదిని
సృజియించే భక్తి నిధి, ఇది //

ఇతిహాసమ్ముల నెలవు
పవిత్రతల కొలువు
సన్మార్గముల నడిపే
ధ్యేయమైన గురువు //

*********************************************************

మయూరి అందాలు

అంద చందాల నెమలి
ఆట లెన్నొ ఆడింది
పురి విప్పి సందడిగా
నాట్యాలే చేసినది //

నెమలి కనుల సోయగాలు
ఆమని గీతాలకు
ఆమోదపు పల్లవులను,
అను పల్లవి,చరణాలను
సమ కూర్చును ముచ్చటగా//

చంద మామ వెన్నెలలు
తోట పైకి జారాయి
చెట్ల ఆకు సందులలో
సన సన్నని నవ్వులుగా //

ఉద్యానంలో జాడలు
నింగిలోని తారకలు
విప్పారిన నెమలి పురికి
ఏ మాత్రం సాటి వచ్చు!?! //

********************************************************

చిరు గాలికి గిలి గింతల జిలిబిలి

Kovela

ధరణీకాంతుడు

కొంగు బంగారు ముడి
శ్రీ కాంతుని వేంకట గిరి //

దివి అంతయు గాలించి
భువిని-ఇచ్చగించి తానె
దిగి వచ్చెను తిరుమలకు!
సప్త గిరుల హారమునకు!

శ్రీ లక్ష్మీ రమణుని గిరి
శ్రీమంత నివాసము //

శ్రీ వేంకట నాయకుని
తోడిదే మా లోకము
అఱ చేతికి అందినట్టి
దివియే కద ఈ సన్నిధి!

ఈ సన్నిధి యే పెన్నిధి
ఆసాంతం మన సొంతము //

******************************************

Kovela

అనురాగమాలిక

By kadambari piduri, Aug 18 2009 5:10AM
శిఖి పింఛ ధారీ!
శ్రీ కృష్ణ!వన మాలీ!
నీ మురళీ రవళులు
చిరు గాలికి
గిలి గింతల జిలిబిలి ||

అల్లదే!అల్లదే!
మలయ పవన వీచిక
వేణు గాన లోలుని
ఆగమనపు సూచిక ||

మారుతములకు
అందెనులే నేడు
మంచి ఆశీస్సులు!
"చిరంజీవ!"దీవెనలు !
అవి, అవిరళ శృతి రాగమ్ములు ||

మందార మృదు బాల -రాధిక
ఆనంద బాలునుకు అభిమానపు సేవిక
అనురాగముల వర మాలిక
అరుదెంచినదదిగో!అందాల అభి సారిక
చక చకా! చక చకా! ( 2 )

******************************************************


మానసధామం

ఏ పొద్దూ,నవ నవముగ
తిరు వేంగళ నాధుని
చిరు నవ్వుల ముగ్గులందు
విర బూసే వన్నియలు ||
మేఘ శ్యాము హృదయము
సు - విశాల గగన ధామము
పూ సౌరభ దామినులకు
నీల మోహనుని మేను
ఆయె నయ్యారె ! ఆవాసము ||

శత పుష్ప దళమ్ములార !
స్వామి - తనువునందున
పరిమళ శతకమ్ములార !
గడించినారు గడుసు వరము
అందులకా గీర్వాణము ||

లతా ప్రసూనమ్ములార!
పత్ర పూ ఫలమ్ములార!
ప్రకృతికి ప్రతి కృతి
ఎలమి స్వామి దేహము
మీ సుందర హర్మ్యమ్ము ||
( కోరస్ ) ::::::
మేఘ శ్యాము హృదయము
సువిశాల -గగన ధామము
ఏ పొద్దూ,నవ నవముగ
తిరు వేంగళ నాధుని
చిరు నవ్వుల ముగ్గులందు
విర బూసే వన్నియలు
చెప్పొద్దూ,ఎంతొ ముద్దు!
చెప్ప రానంత ముద్దు ||

_

Saturday, August 22, 2009

ముద్దు గుమ్మడు


కమ్మనైన గుమ్మ పాలు - తెండీ!తెండీ!
ముద్దు గుమ్మడు కన్నయ్యకు-ఇవ్వండి,ఇవ్వండీ!

చెమ్మ చెక్క ఆటలన్ని మనవేనండీ!
"ని-జమ్ము"!యమున - చూసినది గోపాలుని లీలలు!

గోవర్ధన గిరియె-"గొడుగు"టమ్మా!చోద్యం!
రండమ్మా!కన్నయ్యకు దిష్టిని తీద్దాం!

"తుమ్ము-'శ్రీరామ రక్ష"పూ బొమ్మల్లారా!
కంటి దీ-పమ్ము కదా ప్రతి వారికి - కృష్ణుడు సుమ్మీ!

కన్నయ్య ప్రతి ఆటయు - బ్రహ్మ మించునటుల,
బమ్మెర పోతన్న శైలికింపును గూర్చెన్ .


-

-

Tuesday, August 18, 2009

నానా సూన వితాన వాసనలు

శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజములలో ప్రముఖుడు. ఈయన ,రాయలు భార్య,వినతి పై,రాసిన"పారిజాతాపహరణము"నకు,"రాయలు,రాణి పైన కోపగించుకోవడము " కూడా మూల కారణమైనది
సత్య భామా దేవి కినుకను తగ్గించడానికీ,ఆమె తన భర్తతో అనురాగముతో వర్తించడానికీ ఒక పద్యాన్ని రాసేసి ,
"ముక్కు తిమ్మన"గా లోక బిరుదును సంపాయించేసాడు ధూర్జటి.
ఆ నాసికాభరణము కాంతులు చూడండి/చదవండి.
"నానా సూన వితాన వాసనల నానందించు
సారంగ మేలా తన్నొల్లదటంచు
గంధ ఫలి బల్కానల్ తపం బొంది
యోశా నాసాకృతి బూనె సర్వ సుమన
సౌరభ్య సంవాసియై బూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .

"అన్ని పుష్పాల మీద వాలుతూంటుంది మిళిందము.
కానీ , ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలడం లేదు?" అని అలిగింది సంపెంగ పువ్వు.
దుర్గమారణ్యాలలోనికి వెళ్ళింది సంపంగి పూవు.తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని వరం కోరినది.
" ప్రేయసి నాసిక (= ముక్కు) గా పునర్జన్మను పొందినది. ఆ నాటి నుండీ,వర ప్రభావముచే అన్ని పూవుల వాసనలని ఆస్వాదించసాగినది .
ఇరు వైపులా "నయనములు -( గండు తుమ్మెద ) చూపులను తుమ్మెదల మాలగా ధరించింది .


"ముక్కు తిమ్మన "గా - వాసి కెక్కిన, ధూర్జటి వివరాలకై,"వేంకటార్య కవి"( పౌత్రుడు) రచించిన "శ్రీ కృష్ణ రాయ విజయము"ను ఆధారముగా భావిస్తారు. "భారద్వాజ గోత్ర ; పాక నాటి ; ఆర్వేల నియోగి ; అని తెలుస్తూన్నది. శ్రీ కాళ హస్తీశ్వర శతకము" మూలంగా ధూర్జటి మహా కవి,"శ్రీ కాళ హస్తి లో నివసించెనని " స్పష్టమౌతున్నది.

Monday, August 17, 2009

ధరణీకాంతుడు

-

-

-

-

-

-

Bali" word derives from "vAli".
vali,sugriva are the charecters in Ramayana".
This temple is in the country "Bali"
see and enjoy the marvellous sculpture.


2."bali chakravarthi"famous ,renowned for his "datRtva guNamu".


కొంగు బంగారు ముడి
శ్రీ కాంతుని వేంకట గిరి //

దివి అంతయు గాలించి
భువిని-ఇచ్చగించి తానె
దిగి వచ్చెను తిరుమలకు!
సప్త గిరుల హారమునకు!

శ్రీ లక్ష్మీ రమణుని గిరి
శ్రీమంత నివాసము //

శ్రీ వేంకట నాయకుని
తోడిదే మా లోకము
అఱ చేతికి అందినట్టి
దివియే కద ఈ సన్నిధి!

ఈ సన్నిధి యే పెన్నిధి
ఆసాంతం మన సొంతము //

(ధరణీకాంతుడు ;

By kadambari piduri, Aug 8 2009 8:16PM )

వటపత్ర శాయీ! - Kovela, Jan 6 2009 _ Jul 29 2009