-
-
-
-
-
-
జోహారు రస రమ్య గుణశాలి! వనమాలి!
జోహారు శిఖి పింఛ మౌళీ! ||జోహారు||
1. కలికి చూపులతోనే చెలులను కరగించి ;
కరకు చూపులతోనే అరులను జడిపించి ;
నయగార మొక కంట!
జయ వీర మొక కంట!
చిలకరించి చెలువు మించి, నిలిచిన
శ్రీకర! నర వర! సిరి దొర //జోహారు//
2.నీ నాద లహరిలో నిదురించు భువనాలు-
నీ నాట్య కేళిలో నినదించు గగనాలు-
నిగమాలకే నీవు సిగ బంతివైనావు
యుగ యుగాల దివ్య లీల-
నెరపిన అవతార మూర్తి!
ఘన సార కీర్తి //జోహారు//
3. చకిత చకిత హరిణేక్షణా-
వదన- చంద్ర కాంతు లివిగో!
చలిత లలిత రమణీ చేలాంచల--
చామరమ్ము లివిగో!
ఝళం ఝళిత సుర లలనా
నూపుర - కల రవమ్ము లివిగో!
మధు - కర రవమ్ములివిగో !
మంగళ రవమ్ములివిగో !
దిగంతముల, అనంతముగ గుబాళించు ;
సుదూర నందన సుమమ్ము లివిగో! ||జోహారు||
**********************************************
చిత్రం : శ్రీ కృష్ణ విజయము ;గానం : పి.సుశీల ;సంగీతం: పెండ్యాల
No comments:
Post a Comment