Monday, December 5, 2016

గాన వినోది

కాముడు పగ బూనెను, నే నోప లేనమ్మా! ; 
జాలములను విసరు ఆగడాలకు సైచి ,
నే వేగలేనమ్మా, సైప జాల లేనమ్మా! ;  || 
;
అరవిందముల పస ఏమొ గాని ; 
అరవిందలోచనుని ; 
వలపు టున్మాద గాలమమ్ములందున ; 
చిక్కుకొంటినే ఓ యమ్మా! :  || 
;
అశోకములు ఎంత వాడి యైనవో, 
వేణు వినోదీ తాపపు టుచ్చున ; 
తగులుకొంటినే ఓ యమ్మా! :  || 
;
చూత పుష్పముల పదునెంతో మరి ; 
బల్ చిద్విలాసుని - మోహ రాగ జలధిలోన ; 
మునిగిపోతినే ఓ యమ్మా! :  || 
;
నవ మల్లికల, నీలోత్పలముల 
   దండుల దాడికి ; 
నవ మోహనాంగుడు కూడా 
ఓడి పోయేనే! ; ఓ యమ్మా! :  || 
;
రాధాక్రిష్ణ రాగ రాజ్యమే 
    వెలసినది ఓ యమ్మా! 
      ఇట నిలచినది ఓ యమ్మా!:  ||    
;
==========================;
;
                   gaana winOdi ;- 

kaamuDu paga buunenu, nE nOpa lEnammA! ; 
jaalamulanu wisaru aagaDaalaku saichi ,
nE wEgalEnammA, saipa jAla lEnammA! ;  || 
;
arawimdamula pasa Emo gaani ; 
arawimdalOchanuni ; 
walapu Tunmaada gaalamammulamduna ; 
chikkukomTinE O yammA! :  || 
;
aSOkamulu emta wADi yainawO, 
wENu winOdI taapapu Tuchchuna ; 
tagulukomTinE O yammA! :  || 
;
chuuta pushpamula padunemtO mari ; 
bal chidwilaasuni - mOha raaga jaladhilOna ; 
munigipOtinE O yammA! :  || 
;
nawa mallikala, niilOtpalamula 
   damDula dADiki ; 
nawa mOhanaamguDu kUDA 
ODi pOyEnE! ; O yammA! :  || 
;
raadhaakrishNa raaga raajyamE 
    welasinadi O yammA! 
      iTa nilachinadi O yammA!:  ||    
;   
[ పాట 97  ; బుక్ పేజీ 102  , శ్రీకృష్ణగీతాలు ]

చెలియా!

రాధ ;- రాకేందు లోచనుడెందు దాగేనే? ; 
చెలికత్తె ;- రాధా హృదిలో, తెలుసును లేవే!; 
;
రాధ ;- 
కృష్ణుని తలపులు 
నిండిన డెందపు తలుపులు 
తెరచి ఉంచితిని ; 
రానే లేదే రాసలోలుడు ; 
     ఇంకా రానే లేదే రాసలోలుడు ; || 
రాధ :- 
అల్లరి కృష్ణుడు అల్లన మొయిలులో ; 
దాగి ఉండేనేమొ!? 
పట్టున దెటులో తెలుపగ రాదే!? ;
చెలి ;- 
నల్లని వానిని, అల్లరి వానిని ; 
కారుమొయిలులో ; పట్టగ నగునా 
నుడువవె చటుకున, ఓ రాధా! 
; 
రాధ ;- చల్లల నమ్మెడు గొల్లకాంతల ; 
కొంగులలోనా దాగెనొ, ఏమో? 
పట్టగ రాదే? ఓ చెలియా! ;; 
;
చెలి - 
చెంగు చెంగున ఆడే గోవిందుని - 
చెంగుల వెనుక, వెదుకగలమటే, ఓ రాధా! ''' 

అటు నిటు వెదుకగ నేలమ్మా! 
నింగిని నేలను అంతట తానై ; 
అగుపించెడు వాడు మేఘ శ్యాముడు ;
;
నీ మనసు డోలలలొ ఉండెను లేవే! 
  జగముల నేలే ఆ గోవిందుడు : 
     ఈ రాధా మాధవ రస స్వరూపమే 
            నిశ్చయముగా ఓ రాధా!   
;
=================================;
;
                 cheliyA! :- 
;
rAdha- raakEmdu lOchanuDemdu daagEnE? ; 
chelikatte ;- rAdhaa hRdilO, telusunu lEwE!; 
;
rAdha ;- 
kRshNuni talapulu 
nimDina Demdapu talupulu 
terachi umchitini ; 
rAnE lEdE rAsalOluDu ; 
     imkaa rAnE lEdE rAsalOluDu ; || 
rAdha :- 
allari kRshNuDu allana moyilulO ; 
daagi umDEnEmo!? 
paTTuna deTulO telupaga raadE!? ;
cheli ;- 
nallani waanini, allari waanini ; 
kaarumoyilulO ; paTTaga nagunA 
nuDuwawe chaTukuna, O rAdhaa! 
; 
rAdha ;- challala nammeDu gollakaamtala ; 
komgulalOnaa daageno, EmO? 
paTTaga raadE? O cheliyA! ;; 
;
cheli - 
chemgu chemguna ADE gOwimduni - 
chemgula wenuka, wedukagalamaTE, O rAdhaa! ''' 

aTu niTu wedukaga nElammaa! 
nimgini nElanu amtaTa taanai ; 
agupimcheDu wADu mEgha SyAmuDu ;''''' 
;
nee manasu DOlalalo umDenu lEwE! 
jagamula nElE aa gOwimduDu : 
I rAdhaa maadhawa rasa swaruupamE 
        niSchayamugA O rAdhaa! #  
;
[ పాట 96 ; బుక్ పేజీ 101 , శ్రీకృష్ణగీతాలు ] ;

నీ తలపులు

విరిసిన పూవులలో ముసిరెను తావులు ; 
మురిసిన తావులలో కురిసెను వెన్నెలలు ; 
కొసరిన వెన్నెలలో తడిసెను భావములు ; 
తనిసిన భావమలో నీ రూపే, 
              కృష్ణా! నీ రూపే ;   || 
;
రాలిన పత్ర, పుష్పాలను ఓదార్చెను భూ పరాగం ; 
ఎగసిన సింధూరమా శిఖరములకు తెలిపెనురా ; 
"వగకాడు గోపాలుడు నేడు చూడు!; 
ఈ గోపిని విరహాగ్నిని వేచేనని! వేగించేనని!" ;  || 
;
రాలిన ఒక తారక 'నిల' దాచినది- తన ఒడిని ; 
వగచిన సాగరపు టలలు నీరదమ్ములకు తెలిపెను ; 
"వగలమారి మా మురారి కరగని శిలయే! 
ఈ గోపిని "కన్నీటి కడలి"ని ముంచేనని ;  || 
; 
 ======================================;

                       nii talapulu ;-
;
wirisina puuwulalO musirenu taawulu ; 
murisina taawulalO kurisenu wennelalu ; 
kosarina wennelalO taDisenu BAwamulu ; 
tanisina BAwamalO nI ruupE, 
              kRshNA! nI ruupE ;   || 
;
raalina patra, pushpaalanu OdArchenu BU parAgam ; 
egasina simdhuuramaa SiKaramulaku telipenuraa ; 
"wagakADu gOpAluDu nEDu chUDu!; 
I gOpini wirahAgnini wEchEnani! wEgimchEnani!" ;  || 
;
raalina oka taaraka 'nila ' daachinadi- tana oDini ; 
wagachina saagarapu Talalu niiradammulaku telipenu ; 
"wagalamAri mA murAri karagani SilayE! 
I gOpini "kannITi kaDali"ni mumchEnani ;  || 
; 
[ పాట 95 ; బుక్ పేజీ 100  , శ్రీకృష్ణగీతాలు ]

రాగవీణ

కరుణను చూపరె దిక్పాలకులార! 
దిక్కు తోచని ఈ రాధిక పైన ఇసుమంతైనా ;  ||  
;
రాగవీణ పయి మూర్ఛనలను ; 
పలికించిన రాధిక,
మూర్ఛన తానే ఐనది, 
ఆ పై,
గమకమయము అయి, 
         లయమై పోయెను;  || 
;
విభుని కోసమై ఎదురు చూచినది ;
ఎదురుతెన్నుల ఇసక తిన్నెల ; 
మూర్ఛిల్లెను రాధిక - సేదదీర్చరే!? 
పారిజాత సుమ గంధములార!
   సుమ సుగంధములార!;  || 
;
హృదయాలయమున జ్యోతులు ; 
వెలిగించెను రాధిక ; 
కృష్ణుని కొరకై ; 
అర్చన చేసి చేసి ; 
సొమ్మసిల్లినది రాధిక సేదదీర్చరే 
మలయ శీతల సమీరములార! :  ||
  ;
===========================;
;
                   raagawINa ;-
;
karuNanu chUpare dikpAlakulaara! 
dikku tOchani ii raadhika paina isumamtainaa ;  ||  
;
raagawINa payi muurCanalanu ; 
palikimchina raadhika,
muurCana taanE ainadi, 
aa pai,
gamakamayamu ayi, layamai pOyenu;  || 
;
wibhuni kOsamai eduru chuuchinadi ;
edurutennula isaka tinnela ; 
muurCillenu raadhika - sEdadiircharE!? 
paarijaata suma gamdhamulAra!
   suma sugamdhamulAra!;  || 
;
hRdayaalayamuna jyOtulu ; 
weligimchenu raadhika ; 
kRshNuni korakai ; 
archana chEsi chEsi ; 
sommasillinadi raadhika sEdadIrcharE 
malaya SItala samIramulAra! :  || ;
;
[ పాట 94; బుక్ పేజీ 99  , శ్రీకృష్ణగీతాలు ] 
 ]  
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

పదే పదే

చిత్తమనెడు పొత్తములో ;
వ్రాసితిని నామం ; 
వ్రాసితి 'నీ' నామం ; 
శత సహస్ర నామం ;  || 
;
యశోదను తరియించిన నామం ; 
ప్రణయ రాగముల మిళితమీ పేరు ; 
మమతలు వెల్లి విరిసిన నామం ; 
భక్తజనము ప్రణుతించిన నామం ;  || 
;
దేవకి మనమున మంగళ గీతం ; 
దేవేంద్రుని పాలిట శాఖారావం ; 
దేవతా జన మన మంత్రారావం ; 
పార్ధుడు తలచిన గీతా గానం ;   || 
;
పదే పదే నే తలచే నామం; 
గోపీ జన మన మందిరమందున ; 
ప్రతిధ్వనించిన సుందర నామం ; 
ప్రతి నిముషము బృందా వనిలో ; 
మదనుని పులకితు జేసిన నామం ; 
అదే అదే నే పిలిచే నామం ;  || 
;
===========================;
;
               padE padE ;- 
;
naa chittamaneDu pottamulO ;
wraasitini naamam ; 
wraasiti nii naamam 
Sata sahasra naamam ;  || 
;
yaSOdanu tariyimchina naamam ; 
praNaya raagamula miLitamee pEru ; 
mamatalu welli wirisina naamam ; 
bhaktajanamu praNutimchina naamam ;  || 
;
dEwaki manamuna mamgaLa gItam ; 
dEwEmdruni pAliTa SAKAraawam ; 
dEwatA jana mana mamtrAraawam ; 
paardhuDu talachina gItaa gaanam ;   || 
;
padE padE nE talachE naamam; 
gOpI jana mana mamdiramamduna ; 
pratidhwanimchina sumdara naamam ; 
prati nimushamu bRmdaa wanilO ; 
madanuni pulakitu jEsina naamam ; 
adE adE nE pilichE naamam ; AO ;  || 
; 
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
[  పాట 93 ; బుక్ పేజీ 98  , శ్రీకృష్ణగీతాలు ] 

రాధికా విజ్ఞాపన

కపిలధేనువిచట కంపించుచున్నది ; 
నెమలి కనుల నీరు నించుచుండె; 
బొండుమల్లె తోట బావురనియె ; 
యమున నీటి హొయలు సౌరు తగ్గె - 
              పచ్చి కొట్టి పండు లలక పూనె; 
                 గొల్ల చద్ది మూట విప్పబడదు ;
;
గోవులన్ని దిగులు పొగలు బార ; 
పాలు లేక కుండలన్నియు నిండుకొనియె ; 
కన్నె కంకణాలు మూగవోయె; 
వెన్న మీగడలపైన ఈగలు ముసురుకొనియె ;;; 
;
పాలు విరిగి నేల పాలు ఆయె!
చిన్నిమనసు అడవి పాలు ఆయె ;
నెలత రాధ లేత మనసు ఆరడి పాలు ఆయె! ;;; 
;
సోది చెప్పు భామ చేట నిండె ; 
రోజు తప్పక కనుల 
         నీటి ముత్యాల జాలు తప్పవాయె ; 
రాధ నొసటను వెతలు ఖేదములు నిండె ;
;
 =====================;

raadhikaa wij~nApana  :-  
;
kapiladhEnuwichaTa kampimchuchunnadi ; 
nemali kanula neeru nimchuchumDe; 
bomDumalle tOTa baawuraniye ; 
yamuna niiTi hoyalu sauru tagge - 
;
pachchi koTTi pamDu lalaka puune; 
golla chaddi mUTa wippabaDadu ;
;
gOwulanni digulu pogalu baara ; 
paalu lEka kumDalanniyu nimDukoniye ; 
kanne kamkaNAlu muugawOye; 
wenna mIgaDalapaina iigalu musurukoniye ;;; 
;
paalu wirigi nEla paalu aaye!
chinnimanasu aDawi paalu aaye ;
nelata raadha lEta manasu AraDi pAlu Aye! ;;; 

sOdi cheppu BAma chETa nimDe ; 
rOju tappaka kanula niiTi mutyaala jaalu taappawaaye ; 
raadha nosaTanu wetalu KEdamulu nimDe ;

; [  పాట 92 ; బుక్ పేజీ 97  , శ్రీకృష్ణగీతాలు ]  

Saturday, December 3, 2016

గుజ్జనగూళ్ళు

గుజ్జనగూడుల ఆటలకు వేళ ఆయెను,
ఇంకా రాడేలనొ క్రిష్ణయ్య!? ::
;
అమ్మ యశోదమ్మ ;
సిగముడిలో నెమలీకలు
       తురమ లేదేమని
  అంటూ అలిగాడో!?
    అలిగాడో!? తానలిగాడో!? ; ||
;
పిన్నమ్మ రోహిణీ దేవి ;
తిలకమునకు కస్తూరిని ;
సిద్ధ పరచ లేదేమని ;
మొండితనం చేసేనో!? :
అలిగాడో!? తానలిగాడో!? ;: ||
;
అన్నయ్య బలరాముడు
'తమ్ముడు మట్టి బెడ్డలను
మెసవుతూ ఉన్నాడని'
పెద్దలకు తెలిపేనని ;
బాగ మోడీలు చేస్తూనే
ఉన్నాడో ఏమోనే!?
అలిగాడో!? తానలిగాడో!? ;: ||
;
హృదయ బృందావనమే రాధా ........ 

బృహత్తర విధి

సొగసుల సృష్టి నిరంతరాయం - బహు గొప్ప విధి! 
నిర్వహణాభారం - ఆ విధి అంతా నీదే స్వామి!!
ఆ విధి సమస్తం నీదే స్వామి!! 
ఆ సౌభాగ్యాలను అందుకొనడమే మా వంతు! : || 
;
విశ్వాంతరాళములన్నియు 
పూవుల కాడలు, తొడిమలు అవుతూ ఉన్నవి ; 
నీదు లీలా సుమముల సౌరభమ్ములను - 
గ్రోలే భాగ్యాలన్నియు మావే! స్వామీ!
ఆ సౌభాగ్యాలను అందుకొనడమే మా వంతు! : ||
;
జ్ఞాన నేత్రముల నొసగితివి ; -
విజ్ఞాన దృక్కులను ఒసగితివి, శ్రీపద్మనాభ! 
నీ విశ్వరూపమును కనుగొనినట్టి 
మా కనుగవ సుందర ధామము అయ్యేను! 
ఆ సౌభాగ్యాలను అందుకొనడమే మా వంతు! : || 
;
;==================================;
;
 sogasula Elikaweewu, sogasula sRjanalu nii wamtu;
aa saubhaagyaalanu amdukonaDamE maa wamtu! :  || 
;
wiswantaraalamulanniyu puuwula kaadalu, 
todimalu awutuu unnawi ; 
niidu liilaa sumamula saurabhammulanu - 
grOlE BAgyaalanniyu maawE! swAmI! :   || 
;
;2] jnaana netramula nosagitiwi  ;
wij~naana dRkkulanu osagitiwi, శ్రీపద్మనాభ! 
నీ విశ్వరూపmunu kanugoninaTTi 
maa kanugawa sumdarya dhaamamu ayyEnu! ; :   ||  
;
- కుసుమ గీతాలు ; - ; బృహత్తర విధి  ; 
 bhakti Kusumaalu ; 

మురళికి అందిస్తున్నవి

రాధారమణీ అనురాగాలు ; 
క్రిష్ణ మురళికి అందించేను 
మృదు రవళీ రాగ మాలికలు; = 

raadhaaramaNI anuraagaalu ; 
krishNa muraLiki amdimchEnu 
mRdu rawaLI raaga maalikalu;
;
{ FB ;- kusuma}

Wednesday, November 30, 2016

మాధవ మనోల్లాసినీ!

మలయ శీతల సమీరముల ; 
మాలతి  రావే!
తరుణి లలాటమ్మున ; 
తిలకముగా వరలుమా!

వరమది నీకెపుడో ; 
లభియించెను రతి ద్వారా!
పుష్పధనుడిక వేడుకొనును
నిను శరమున చేరమనీ!
తన సుమ శరమున చేరమనీ!
; 
కవీంద్రుల కావ్యముల
విరిసిన మహరాణీ!
క్రిష్ణ రాధికా ప్రణయాలకు
సుగంధముల చాందినీ!
మాధవ మనోహ్లాదినీ!

******************;  

malaya SItala samIramula ; 
       maalati  rAwE!
taruNi lalATammuna ; 
     tilakamugaa waralumA! ||

waramadi neekepuDO ; 
labhiyimchenu rati dwaaraaa!
pushpadhanuDika wEDukonunu
ninu Saramuna chEramanii!
tana suma Saramuna chEramanii!
; 
kawiimdrula kaawyamula
wirisina maharANI!
krishNa raadhikaa praNayaalaku
sugamdhamula chaamdinI!
maadhawa manOhlaadinii!

******************************;
మాధవ మనోహ్లాదినీ!/ మాధవ మనోల్లాసినీ! [bhaawuka] ;-

Sunday, November 13, 2016

కృష్ణలహరి

మమత అంటే
  వెతలు అంటూ
      అర్ధం తెలిపావు!
వెతలకు  నే
   భాష్యమౌదు
        సంతసమ్ముతో! ;  ||
;
ఎదను ప్రేమగాయమాయెను!
కృష్ణా! అది, చరిత =
  జీవ కాయమాయెను!
    జీవన కావ్యమాయెను! ;  ||

వేణు రవము ;
వినబడదు రవ్వంతైనా!
కంకణాల రవళి
సడి లేదు, అణువంతైనా! ;  ||
;
యమునా నది సైకతాల ;
 కితకితలేవి?
   నాటి కితకిత లేవీ? ;
నందనవని పులకింతలు
    నిశ్చలమాయేను ;
        నేడు శూన్య మాయెను ;

క్షణ మాత్రంలోనే
ఇంతటి పరిణామాలా? ;
వైపరీత్యములు -
వలపుకు తుది గమ్యాలా? ;  || ;

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

 kRshNalahari ;-
mamata amTE
  wetalu amTU
     ardham telipAwu!
wetalaku  nE
   BAshyamaudu
        samtasammutO! ;  ||
;
edanu prEmagaayamaayenu!
kRshNA! adi, charita =
  jeewa kaayamaayenu!
    jIwana kAwyamAyenu! ;  ||

wENu rawamu ;
winabaDadu rawwamtainA!
kamkaNAla rawaLi
saDi lEdu, aNuwamtainA! ;  ||
;
yamunaa nadi saikataala ;
 kitakitalEwi?
   nATi kitakita lEwI? ;
namdanawani pulakimtalu
    niSchalamAyEnu ;
        nEDu SUnya mAyenu ;

kshaNa mAtramlOnE
imtaTi pariNAmAlaa? ;
waipareetyamulu -
walapuku tudi gamyaalaa? ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼▼▼▼
కృష్ణలహరి ;-

 [ పాట 91 ; బుక్ పేజీ 96  , శ్రీకృష్ణగీతాలు ]

చిరుగాలి

వేణువులో చోటు దొరికి ;
సంభ్రమమున చిరు గాలి ;
అటు ఇటు నటు నటనమాడెను,
నాట్యమాడెను ;  ||

తన ప్రతి కదలిక రాగమై ;
వసుధపైన పరుచుకొనగ ;
విభ్రమమున తేలి ఆడె ;  ||

ధరణి పైన అణువణువు;
చేతనమే నింపుకొనెను ;
కన్నయ్యా! నీ కొరకే ;
ఈ రాధిక జననము ;  ||
;
వంశీ హృదయ కుటీరమున ;
కృష్ణ రమ్య నామము ;
ధ్యానము, మననము ;
అనుక్షణము మెసవెడి ;
మధుర సుధా పానము ;  ||
;
మురళిలోన నర్తించెడు ;
గాలిహేల ధన్యము!
నీల మోహనాంగుని హృత్ ;
నివసినియౌ రాధ చరిత సార్ధక్యము ;
ఈ రాధ విరళ చరితము -
ప్రతి పదము సార్ధక్యము ;  ||


▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
wENuwulO chOTu doriki ;
samBramamuna chiru gaali ;
aTu iTu naTu naTanamADenu,
nATyamADenu ;  ||

tana prati kadalika raagamai ;
wasudhapaina paruchukonaga ;
wibhramamuna tEli ADe ;  ||

dharaNi paina aNuwaNuwu;
chEtanamE nimpukonenu ;
kannayyA! nI korakE ;
ii raa dhika jananamu ;  ||

wamSI hRdaya kuTIramuna ;
kRshNa ramya naamamu ;
dhyaanamu, mananamu ;
anukshaNamu mesaweDi ;
madhura sudhA pAnamu ;  ||

muraLilOna nartimcheDu ;
gaalihEla dhanyamu!
nIla mOhanAguni hRt ;
niwasini yau
raadha charita saardhakyamu ;
ii raadha wiraLa charitamu -
prati padamu saardhakyamu ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

 [ పాట  90 ; బుక్ పేజీ 95   , శ్రీకృష్ణగీతాలు ]  ;