Monday, August 13, 2012

వింటి నారి - వీణ తీగ


తరళాక్షి! కోమలీ!శ్రీ జానకీ!
ఏ వేళనందైన  భావనము నీదేను! -
మంగళ దాయినీ! మా మంగళారతులివే!
కరుణా కటాక్షముల వీక్షించవమ్మా!      ||

ఇందీవరాక్షీ! శ్రీరామ ప్రియ పత్ని!
మా మంచి ఆకాంక్షలను తీర్చవమ్మా!
దాశరధి అర్ధాంగి! వరదాయినీ!
చల్లనీ అనుగ్రహము వర్షించుమా!        ||  

వర వీణియను మీటు నీ పల్లవాంగుళి;
కోదండ ధను నారి(ని) మీటును
                    శ్రీ రాముల వేలు;
ధరణి వర పుత్రీ! అనుపముగ
ఈ ఇలను అనుగ్రహించుమా జననీ!  
మంగళ దాయినీ! మా మంగళారతులివే!
కరుణా కటాక్షముల వీక్షించవమ్మా!       ||


****************************;













******************************;

గోముగ మా పూజలందుకోవమ్మా +
ఆనంద రూపిణీ!   ( 1 - Link :- konamanini 2010)


భువన సామ్రాజ్ఞీ! శ్రీ కనక దుర్గా!  ( 2 - Link :- konamanini 2010)
               ఆదివారం 10 అక్టోబర్ 2010
నాద రూపిణీ
బిందు మండల వాసినీ!
సేద దీరగ రావె
నా మదియె నీ డోల ||


కర్పూర హారతులు కనక దుర్గమ్మా! ( 3 - Link :- konamanini 2010)
మంగళవారం 5 అక్టోబర్ 2010


వర మంజరీ సౌరభమ్ములను
ఈ - ధర వాసులకు ఒసగు కనక దుర్గమ్మా!!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||





మంగళవారం 12 అక్టోబర్ 2010


ఆనంద రూపిణీ!





హరుని హృదయేశ్వరీ! ఆనంద రూపిణీ!
సురుచిర హాసినీ! చిన్మయ రూపిణీ!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

నీదు వాత్సల్యమున
నవ నవోన్మేషమౌ హర్ష సుధలను గ్రోలు
నీ బిడ్డలము మేము
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

ఏ వేళనందైన
నీదు భావమ్ముల మావి చివురుల మెసవు
గాన కోకిలము మేము!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||



Friday, August 10, 2012

మిలెరపా యోగి అద్భుత గాధ


మిలెరపా  యోగి 
;
;మిలెరపా 1052 - 1135 లలోని మహా యోగి
ఘుంగ్థంగ్ (ghunglang) లో జన్మించిన ఈతని మొదటి నామము "మిలా తోపగా".
ప్రత్తి, ఉన్ని బేహారులకు - గుర్తింపు నామము
"మిలా" (Mila, the cotton clad)
ఆతని తండ్రి మిలా దోర్జెసెంగ్
ఉన్ని వ్యాపారస్థుడు, ధనవంతుడు.
మిలా దోర్జెసెంగ్ కుమారుని పేరు "మిలాతోపగా", (The hero of this real story) ,
వీరి యొక్క కుమార్తె పేరు "పేట".
*****************************;

మిలె తొపగా (మిలెరపా యోగి తొలి పేరు) పశ్చిమ టిబెట్ లో 1052   సంవత్సరములో జన్మించాడు.
తొపగా కంఠము మధురంగా ఉండేది.
(Mila Thöpaga, which means - "Mila who is a joy to hear.")
గొంతెత్తి పాడితే చాలా కమ్మని మాటలు, పాటలు, శ్రోతలను ఆకట్టుకునేవి.
చుట్టుపక్కల వారు ఆతని గళ మాధుర్యాన్ని ఆస్వాదించే వారు.
అకస్మాత్తుగా తండ్రి జబ్బు చేసి, మంచం పట్టాడు.
కుటుంబ సభ్యులు అతడి మరణంతో దిక్కు తోచని వాళ్ళు అయ్యారు.
అప్పటి దాకా మిలడోర్జె సెంగ్ సంపాదించిన ఆస్థిపాస్థులు
అన్నింటినీ, కుత్సితులైన  ఆతని చుట్టాలు కాజేసారు.
దాంతో అతని కుటుంబం అష్ట కష్టాల పాలైనది.
ఒకప్పుడు భోగ భాగ్యాలతో తులతూగిన ఆ సంసారం
కట్టుబట్టలకూ, పూట కూడుకూ కూడా మొహం వాచిపోయిన స్థితిలో ఇరుక్కుపోయారు.
దీనికంతటికీ కారణం ఆతని మామ,
తక్కిన బంధువులు ఎవరూ వారికి- డబ్బు, వస్తువులు ఇవ్వకపోగా -
కనీసము మాట సాయం కూడా చేయలేదు.
మిలెరపా తల్లి, తన వారి సహాయంతో, దినభత్యం సంపాదనతో- రోజులు నెట్టుకురాసాగారు.

********************************;

అప్పటి ఆచారం ప్రకారం బాల్యంలోనే- అబ్బాయికి పెళ్ళి చేసుకోవలసిన అమ్మాయి నిశ్చయమై ఉండేది.
అదే రీతిలో తోపగా కు ఒక అమ్మాయి వివాహం చేసుకొన నిశ్చయమై ఉన్నది.
మిలెరపా పరిణయము చేసుకోదలచిన కన్నె పేరు జెస్సే(Zesay)
కానీ, "ఓడలు బళ్ళు- బండ్లు ఓడలు గా మార్చ గలిగిన కాల మహిమ".
"ఉన్నపాటున తలక్రిందులైన ఆర్ధిక స్థితిలో కూరుకుపోయిన ఈ బాలుడు తోపగా- కు
నా కూతురును ఇస్తే ఇక్కట్ల పాలౌతుంది.
కాబట్టి నేను నా పుత్రికను వీనికి ఇచ్చి, పెళ్ళి చేయను గాక చేయను" అని
చిన్ననాడు నిశ్చయం చేసిన వధువు యొక్క తండ్రి - నిర్ద్వంద్వంగానిరాకరించాడు.
తోపగా తల్లి హతాశురాలైనది.
అప్పటికి తోపగా వయస్సు 15 ఏళ్ళు మాత్రమే!
కన్నతల్లినీ, చెల్లెలు పేట నూ పోషించాల్సిన బాధ్యత ఆతని భుజస్కంధాల పైన ఉన్నది.
*******************************;

అండ లేని సంసారము కదా!
తోపగా మామ, చుట్టాలు నిరాధారులైన వీరిని చేరదీసి ఆశ్రయం కల్పించకపోగా,
మీదుమిక్కిలి వారి సంపదలను కాజేసారు.
పైగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు.
తోపగా కుటుంబం పట్ల తగని కాఠిన్యంతో వ్యవహరించేవళ్ళు.
కుక్కలు తినే ఆహారము మాత్రమే వీరికి తినడానికి ఇచ్చేవారు,
హీనంగా  జీవించవలసివచ్చింది.
ఆతని తల్లి పిల్లలు ఇరువురితో బంధువుల పంచన అలాగే కాలం వెళ్ళబుచ్చింది.
కాలచక్రంలో కొన్ని సంవత్సరములు తిరిగినవి.
 "ఇప్పుడు నా కుమారునికి 15 సంవత్సరాల వయసు వచ్చింది.
వీరు పుట్టినప్పుడు నిశ్చయించబడిన వధువు – జెస్సే(Zssey)- వీరిద్దరికీ పెళ్ళి చేయాలి,
కాబట్టి మాకు డబ్బును ఇవ్వండి.
ఇన్నాళ్ళూ మా ఆస్థినే మీరు అనుభవించారు కదా!
ఇప్పటికైనా మాకు కొంత డబ్బు దస్కం ఇస్తే,
మా గృహములో శుభకార్యాలను నెరవేర్చుకుంటాను."
ఆమె అభ్యర్ధనను పెడచెవిని పెట్టారు,
అంతటితో ఊరుకోలేదు ఆ క్రూరాత్ములు.
ఆమె బంధువులైన ఆ దుష్ట దంపతులు.ఈ కుటుంబాన్ని వెళ్ళగొట్టారు.
మిలెరపా, అతని చెల్లెలు పేట  నడి వీధిలో బేలలుగా నిలబడినప్పుడు,
తల్లి నేలపైన దొర్లుతూ విపరీతంగా విలపించింది.
క్రూరులు, దుష్టులైన - ఆ అంకుల్, ఆంటీల ఘాతుకాలకు నిశ్చేష్టురాలు ఐన ఆతని తల్లి
"వారిపై పగ తీర్చుకోవాలి" అనే ఆలోచనలతో కుతకుతలాడింది.
కుమారుడు తొగపాను పిలిచి,
"నాయనా! మనం నీచులైన ఈ బంధువుల వలన చెప్పరానన్ని ఇక్కట్ల పాలౌతూన్నాము కదా!
ఇంక నాలో సహనశక్తి లేదు. వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుని తీరాలి" అని నూరిపోసింది.
ఆమెకు పుట్టింటి వారు ఇచ్చిన కన్యాశుల్కము కొంచెం ఉన్నది. ఆ కొద్ది పొలాన్నీ అమ్మివేసినది.
అలాగ వచ్చిన కొంచెం సొమ్మునుకూడా -
ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరమునకై
వెచ్చించడానికి అతని తల్లి ఎంతమాత్రమూ వెనుకాడలేదు.
"నువ్వు క్షుద్ర విద్యలను నేర్చుకో!
కుమారా! నువ్వు శక్తివంత విద్యలను నేర్చుకోకుండా తిరిగి వస్తే- నేను ఆత్మహత్య చేసుకుంటాను" అని అన్నది.
తల్లి మాటలు అనుసరించడం వినా, మిలెరపాకు వేరే గత్యంతరం లేకపోయింది.
*******************************;
(links:  father's name was Mila Sherab Gyaltsen ;
  sister Peta,  )
తోపగా వేరే ఊళ్ళకు వెళ్ళాడు. ఎలాగో కష్టపడి, ఒక గురువు వద్ద చేరి, కొన్ని క్షుద్ర కిటుకులను  అభ్యసించాడు.
విద్యా జీవితములో తొగపా-కు ఏర్పడిన కొత్త పేరు మిలెరపా.
తమ ఊరికి తిరిగి వచ్చాడు మిలెరపా.
అక్కడ తాను నేర్చిన దుష్ట క్రూరత్వమైన మంత్ర విద్యలను ప్రయోగించాడు.
అక్కడ పండిన బార్లీ పంటలు, కొందరి జీవాలు ధ్వంసమైనాయి.
తల్లి గర్వంతో వికటాట్టహాసం చేసింది. ఆమె హుంకరిస్తూ అందరికీ ఎలుగెత్తి చాటింది
"చూసారా? నా పుత్రుడు గొప్ప మహిమలు సాధించాడు. తలచుకోగానే తుఫానులను సృష్టించి, అందరినీ అతలాకుతలం చేసేయగలడు" విపరీతమైన శాడిస్టు ఆనందములతో అరిచి, చాటింది.
ప్రజలందరూ ఆమె పలుకులు వినగానే భీతితో బెంబేలెత్తారు. 
వారికి భయంతోపాటు మిలెరపా పట్ల ఏహ్యభావం సైతం పెరగసాగింది. 
దాంతో మిరెలెపాకు వారు అపకారం తలపెట్టసాగారు. 
భాగ్యవశాత్తూ- అతడు వెంట్రుక వాసిలో అనేక కీడులను, అపాయాలను తప్పించుకోగలిగాడు. 
మిలెరపా తన సోదరిని - 
ఝాంగ్ ఝుంగ్సీమ రాజు (king of  Zhang-zhung )కు ఇచ్చి పెళ్ళి చేసాడు.
*******************************;
మిలెరపాకు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే- 
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను. 
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి. 
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయ కూడదు" అనుకున్నాడు. 
మిలెరపాకు పశ్చాత్తాపం కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో 
మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు 
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి. 
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి, 
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా", 
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు. 
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు. 
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు.
ఐతే మార్పా (Yogi GURU/ philosophy teacher) 
అప్పటికే తోపగా (మిలెరపా) వలన 
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి 
కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. 
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై, 
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు. 
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా! 
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ, 
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో- 
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి. 
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ 
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించికుని, 
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా? 
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అని మార్పా సందేహం.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు. 
అన్ని పరీక్షలకూ మిలెరపా, సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా  కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
(His only consolation was Damema, the kind wife of Marpa) 
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు చీకటిలో దొరికిన చిగురంత దీపమే 
అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ (Dagmema).
ఆమె దయాశీలిని. మార్ప భార్య దామెమ్మ  ఎండమావిలో మరీచికలా, 
కన్న తల్లికన్న మిక్కుటముగా ప్రేమ అనురాగాన్ని,జాలిని చూపించేది.
ఆమె మిలెరపా ను "నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ, కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో, మిలెరపా  బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు. 
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో, 
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో- 
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది. 
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి, 
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.ను,
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి, 
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను, 
నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు. 
*******************************;
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం 
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు. 
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11, 12 నెలలు మిలెరపా  దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను  లిపి బద్ధము  చేసి, లోకమునకు అందించినాడు మిలెరపా.

*******************************;
మిలెరపా కు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే- 
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను. 
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి. 
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయకూడదు" అనుకున్నాడు. 
మిలెరపాకు పశ్చాత్తాపంతో కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు 
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి. 
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి, 
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా", 
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు. 
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు. 
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు. 
ఐతే మార్పా అప్పటికే మిలెరపా వలన 
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. 
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై, 
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు. 
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా! 
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ , 
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో- 
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి. 
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ 
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించుకుని, 
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా? 
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అనే  
మార్పా సందేహం ఇంకా పూర్తిగా తీరలేదు.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు. 
అన్ని పరీక్షలకూ మిలెరపా , సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా  కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు 
చీకటిలో దొరికిన చిగురంత దీపమే అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ.
ఆమె దయాశీలిని. ఆమె మిలెరపాను 
"నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
ఆమె బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ, 
కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో, 
మిలెరపా  బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు. 
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో, 
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో- 
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది. 
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి, 
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి, 
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన 
మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను, నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు. 
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం 
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
*******************************;
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు. 
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11 నెలలు మిలెరపా  దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను  లిపి బద్ధము  చేసి, 
లోకమునకు అందించినాడు మిలెరపా.

మిలెరపా ధార్మిక ప్రవచనాలు, పద్య కావ్యాలూ 
అనేక ప్రపంచభాషలలోనికి అనువాదం ఐనవి. 
మిలెరపా పాటలు, పద్యములు జగద్విఖ్యాతి గాంచినవి.
మిలెరపా స్థాపించిన "గంపోపా సాంప్రదాయము"ను 
లోకవ్యాప్తముగా అనుయాయులు ఆచరిస్తూన్నారు.
(tradition- Gampopa)
మిలెరపాకు అసంఖ్యాక శిష్యగణములు ఉన్నారు.
మిలెరపా సూక్తిముక్తావళి బౌద్ధ అనుయాయులకు శిరోధార్యాలైనవి.

"Cease negative actions, 
cultivate positive actions, 
and tame you mind."

*******************************;

Milarepa సినిమా 2006 లో వచ్చినది.
Milarepa: Magician, Murderer, Saint
Directed by Neten Chokling

Tags:- 
1) Milarepa first heard the Lama utter the name "Marpa", 
he felt a thrill go through his body 
2) Milarepa had countless disciples such as Rechung Dorje Drakpa, 
Gampopa or Dhakpo Lhaje, the eight-heart-sons, and many others)
3)(Milarepa was born to Mila-Dorje-Senge in 1052 AD: 
His father was Mila Sherap Gyaltsen and mother, Nyangtsa Kargyen.
He had one younger sister, Peta Paldron)
;

చిత్ర చిత్రాల బొమ్మలు


భలే భలే బొమ్మలూ,
నవ్వు పుట్టించే కార్టూన్ బొమ్మలు,
గ్రాఫిక్స్ నీ, ట్రిక్ ఫొటోగ్రఫీనీ వాడుతూ
నిర్మించిన చిత్ర చిత్ర బొమ్మల కొలువులు,
ఇవిగో! చిత్రమైన బొమ్మలు!
ఇన్నింటినీ ఈ లింకు- బ్లాగులో తిలకించండి!;

చిత్రమైన cartunes


















Damn Funny Illustrations - 1
Birds of a Feather by Terry Fan



















 లింకు- బ్లాగు  (see here many ...... !)

 http://www.cruzine.com/2012/04/03/funny-illustrations-2/  (Link)

తేటె-అవ్-తేటె! ద్వంద్వమ్


తేటె-అవ్-తేటె!
ముఖాముఖీ, రహస్య చర్చలు;
తమాషగా తమాషగా
సాగేనండీ ఆషామాషీ!
లోపాయికారీ సంభాషణమ్ము!
సమ్ సమ్ థింగ్, సమ్ థింగ్
సమ్ సమ్ నథింగ్!
అందుకు వసతిగ
ద్వంద్వమ్ ఆసీనమయేందుకు;
చమత్కారపు షేపుల కురిచీ!
tete-a-tete!
tete-a-tete!


Humour Due  (Link 1)
;

Thursday, August 9, 2012

తమాషా తమాషా

తమాషా గొడుగులు

see the తమాషా గొడుగులు! - 1

https://encrypted-tbn3.google.com/images?q=tbn:ANd9GcSswgZKIzsLZuLj7bje4LEY-8uoPFu4U1J1erDuulW8s7AYby6jWA

తమాషా రైన్ కోట్ - 2 ఇది; మన ఇండియా మార్కెట్ లో కి వస్తే ధరిస్తారా?

http://technabob.com/blog/wp-content/uploads/2011/10/Umbrella-Coat-Raincoat1.jpg

తమాషా రైన్ కోట్ - 2



Wednesday, August 8, 2012

జడిపించబోకే!


;
;
జడివాన ధారలై; కురియుచున్నాది;
ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
అది యమున తీరము;
రాధమ్మ నడుము నడిసంద్రపు టలల;
తేలాడుచున్నవి జడ కుచ్చు నౌకల్లు!
;
@1] ప్రశ్న:-
ఆ బంగారు కుచ్చుల్లు ఎవ్వరివి, చెలియా!
ఆటాడు జడకుచ్చు పడవ వైనాలను మాకు తెలుపవమ్మా!
||ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
@2] ప్రశ్న:- నీలవేణీ జడల నొడిసిపట్టినదెవరు?
సమాధానము:- "నీలల మై ఛాయ క్రిష్ణయ్యవే! సఖియ! క్రిష్ణయ్యవే!
జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! కన్నయ్య కర కమల దొన్నెలందున;
పసిడి జడగంటల సౌదామినీ రాశి; ఆదిశేషుడై వెలసె; ఆ అరచేతులందున! ;
క్రిష్ణమూరితికేమొ; అవధులు లేనంత అచ్చెరువులు!!
మరి, ||జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! ||
;
రాధ:- ఊరుకోండీ చెలులు! చాలు మీ అల్లరులు!
జడిసితే ఏమాయె! జడుపు జ్వరమొచ్చేను!
మా మాయదారి కన్న, నా కడనె కూర్చుండి, నను బుజ్జగించేను!
అందుకే పణతులూ! కాస్త ఆలకించండీ!
;
" ఉష్ణము కలిగెను, నీ రాధకు..." అనుచు,
వేణుగానలోలు చెవిలోన ఊదండి మీరు!
ఇది చాలు, మీ యొక్క గొప్ప ఉపకారము!||

;

  జడిపించబోకే!  (Link for nice photos)


\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

Happy Janmashtami 2012

శ్రీ క్రిష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

Thursday, July 26, 2012

పుష్పక విమానము


Pushpaka vimanam



విశ్రావసు కుమారుడు, దేవతలకు గురువు కుబేరుడు. 
ఆతడు గొప్ప శివ భక్తుడు. మహేశ్వరుడు
"కుబేరా!" నీ భక్తికి మెచ్చి, ఈ గగన గామిని ని ఇస్తున్నాను,! " అని
ఘన వస్తువును తన భక్తునికి ఒసగాడు.
అదే విశ్వఖ్యాతి గాంచి, ఇతిహాస చరిత్ర సృష్టించిన "పుష్పక విమానము".
తన విమానము (aircraft)లో-
సకల మహేశ దేవళములను- దర్శిస్తూ,
కుబేరుడు పుష్పక విమాన యానము చేయసాగాడు.
అలా వివిధ ఆలయాలను సందర్శిస్తూ, 
ఒక చోట ఒక విచిత్ర దృశ్యాన్ని తిలకించాడు.
కావేరీ తీరాన (Cauvery) జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక - లు
ఒకే చోట నిలబడి, నదిలోని నీళ్ళను తాగుతున్నాయి.
జంతు సహజ వైరము లేకుండా ఆ ఐదు
మైత్రీభావముతో అలాగ మెలగడము చూసిన కుబేరుడు, అక్కడ దిగాడు.
సుర గురువు- "సజ్జనులు, పుణ్య చరితులు, గంధర్వులు, మహర్షులు- 
ఇక్కడకు వచ్చి, నివసిస్తున్నారు. 
ఆ సౌజన్య ప్రవర్తనా పరిమళాలు విస్తరించిన పరిసరములు అవి! 
కనుకనే అచ్చట స్నేహభావ, సౌమ్య భావములు విరబూస్తూన్నవి.
అందువలననే ఈ సీమలో జంతువులు సైతమూ 
తమ తమ సహజ వైరాలను మరిచి, 
స్నేహ భావముతో కలిసి మెలసి జీవిస్తూన్నవి" అని గ్రహించాడు.  
కుబేరునికి ఆకాశములో నుండి- ఒక  స్వరము వినిపించింది.
"ఇచ్చటి ఇల్లిందై చెట్టు (= రేగు చెట్టు/ బదరీ వృక్షము)  ఉన్నది.
ఆ తరువు మూలమున తాళపత్రములు ఉన్నవి.
ఈ ప్రాంతమునకు వేదములు వచ్చినవి.
కనుక ఇది పవిత్ర మహిమాన్విత ప్రదేశము" అంటూ ఆ అశరీర వాణి పలికినది.
ఈ రేగి చెట్టు  (Ilandhai Tree) దరిని- నీవు పూజించ వలసిన పరమేశ లింగము ఉన్నది. 
భక్తుల సకల ఈప్సితములు నెరవేరు ప్రదేశము ఇది.
"ఈ మాటలకు విస్మయ చకితుడైన కుబేరుడు అన్వేషణలో- పవిత్ర లింగమును కనుగొన్నాడు.
కుబేరుని ఆరాధనలు పొందిన ఈశుడు-
కుబేరుని కోరికపై "అలఘేశుడు" (Alagesan) - అనే నామధేయ విలాసునిగా
భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
"భవాని" అనే ప్రదేశములో వెలసిన ప్రసిద్ధ కోవెల పేరు "శ్రీ సంగమేశ్వర కోవెల", 
కావేరీ, భవానీ, అంతర్వాహిని ఐనట్టి "అమృత" అనే మూడు నదులు కలుస్తూన్నవి.
అందుచేత- దక్షిణ భారతమున "త్రివేణీ సంగమముగా" వినుతి కెక్కినది.
సంగమేశ్వరుడు - స్వయంభువుగా వెలిసినాడు.అమ్మవారి పేరు "వేదనాయకి". తల్లి సౌందర్యవల్లి.
ఇక్కడ విష్ణుమూర్తి- "అధికేశ్వరర్" అని   పేరు.
కావేరీ నది ఒడ్డున- పవిత్ర తీర్ధము ఇది. తేవారం అర్చకుల గానములు
ఈ చల్లని గాలులలో- మనోహరముగా వినిపిస్తూ ఉంటాయి.
ఈరోడ్ జిల్లాలో( Erode) భవానీ గుడి- "శ్రీ సంగమేశ్వర కోవెల" ఉన్నది.  
; 

Monday, July 9, 2012

శరత్ చంద్రఛటర్జీ , Devanandapur, Hugly


Hooghly

శరత్ చంద్రఛటర్జీ పేరు తెలీని వారెవరు?
బెంగాలీ రచయిత రాసిన అన్ని రచనలూ,
తెలుగులో అనువదించ్బడి, ఆంధ్ర పాఠకులను/కు
శరత్ బాబు తెలుగు రచయితయే!" అన్నంతగా అభిమానాన్ని పొందాడు.
దేవదాసు, మా వదిన, బాటసారి, తోడికోడళ్ళు ఆదిగా
అనేక సినిమాలు ఆయన రచనల ఆధారంగా నిర్మించబడినవి.

15 సెప్టెంబర్ 1876 లో దేవానందపూర్, హుగ్లీ జిల్లాలోని- లో జన్మించాడు.
శరత్ చంద్రఛటర్జీ యొక్క నివాసము, మున్నగునవి,
స్మారక చిహ్నములుగా ఉన్నవి.
ఆ దారిలో ఉన్న ఒక పెద్ద వృక్షము కనులకింపు.

Tags:-

DewaanaMd pur, Hoogly
;

Friday, July 6, 2012

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు


"హిందూ మతము"- అనే పదముకంటే
"హిందూ సంప్రదాయము" అని
చెబుతేనే బాగా నప్పుతుంది.
ఆచార, సంప్రదాయాలు, ప్రకృతితో అనుసంధానిస్తూ-
ఒక మతముగా రూపొందిన అద్భుత  వైనము-
ఈ పుణ్యభూమి- లోనే సాధ్యమైనది.
ఆర్యభూమిలో అతి ప్రాచీన కాలమునుండీ అనేకమంది
సమాజశ్రేయస్సు గూర్చి పరితపిస్తూ అనేక ఆలోచనలు చేసారు.
కాలానుగుణముగా- అవి పరిణామము చెందుతూ,
పరిణతి చెందిన "హిందూమతము" గా ప్రజలు రూపు దిద్దుకున్నారు.
ఆ ఘన చారిత్రక ఆవిష్కరణయే - హిందూ మతము-
కేవలము మతముగానే కాక,
చతుష్షష్ఠి కళల సమామ్నాయమై తనను తాను ప్రౌఢీకరించుకున్నది.
ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధమే "కలిమి" గా కల హైందవమును-
నా శక్తి పరిధిలో-  వ్యాసీకరించే ప్రయత్నమిది.

                      ************************;

తిరుపత్తిరిపులియూర్:- ఈ ఊరికి, అలాగే ఊరిలోని కోవెలకు -
ఆ పేరు రావడానికి వ్యుత్పత్తి ఒకటి ఉన్నది.
"తిరు+పాదిరి+పులియూర్" అనే పదములు ఆధారము.
శ్రీ + పాటల + పులి- ఊరు -  కొన్ని సంఘటనల ద్వారా
ఈ మాటలకు స్థల నామార్హత ఏర్పడినది.
పాటలీశ్వరుని దేవాలయము  "తిరుపత్తిరిపులియూర్"
(Sri Padaleeswarar Temple,Thirupathiripuliyur) లో  ఉన్నది .
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఈ కోవెల విశిష్టమైనది.
7 వ శతాబ్దికి పూర్వమే కట్టిన అతి ప్రాచీనమైనది పాటలీశ్వరుని దేవాలయము.
ఉమాదేవి  1008 పుణ్యతీర్ధాలను దర్శించుకున్నది. ఈ పావనదేశమును చేరినది ఉమాదేవి.
పెద్ద పదిరి చెట్టు (పాటలీ తరువు) ఛాయలో వెలసి ఉన్న మహా శివ మూర్తిని ఆమె వీక్షించినది.
అచట భవుని మూర్తి ప్రతిష్ఠించబడినది.
పాటలీ పాదపము నీడలో ప్రభవించినందున "పాటలీశ్వర స్వామి" అని పేరు పొందాడు.
దేవాలయమునందు 5 సువిశాల నడవాలు ఉన్నవి. మే- జూన్ లలో వైకాశి నెలలో-
బ్రహ్మోత్సములు జరుగుతూంటాయి. ఐదవ కారిడార్ ని  "రాజ వీధి"
అనగా రాయల్ స్ట్రీట్ (royal street) అని పిలుస్తారు.

                   ************************;

పాటలీశ్వరుని దేవాలయము:-   ఈ క్షేత్రమున స్థల వృక్షము పాదిరి చెట్టు ( Pathiri Tree).
మధ్య నందన ఋషి గొప్ప పరమేశ భక్తుడు.
శివపూజకు పూసిన పుష్పాలను కోసుకోవడానికని-
పాదిరి చెట్టును ఎక్కడానికి - అ ఋషికి చాలా కష్ట సాధ్యమయేది.
పాటలీశుని అర్చనకై- ప్రతి రోజూ-
ఈ వ్యాయామము వంటి పని
క్లిష్టతరమవగా
"పాడలీసా! నాకు పులి కాళ్ళును ఇవ్వు" అని వేడాడు.
సత్వర వరానుగ్రహాన్ని పొందాడు. పులి పంజాలను పోలిన పాదములను పొంది,
పూజావిధులను నిరాటంకముగా సులువుగా చేసుకోగలిగాడు.
ఆ మహా ఋషి చరణ యుగములచేత -
"పులి"-  కూడా జత కలిసినది.
(Pathiri Tree); అటు తర్వాత వ్యాఘ్ర పాదములను వరముగా పొందినట్టి
Madyanandana Rishi పేరు కూడా జత ఐ,
ఈ ఊరికి - "తిరు పదిరి పులియూర్" అనే నామమును పొందినది.
నయనానందమును కలిగించే గుడి, పరిసరాలు ఉన్న ప్రదేశము  "Thirrupathiripuliyur".

ముఖ్య ట్యాగ్ పదములు:-
Thirupathiripuliyur in Cuddalore, Sri Padaleeswarar Temple

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు ;

అనురాగ సదనము



రాధ హృదయం- రాగసదనం;
శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
రాగసదనం రాధ హృదయం             ||

వేణురావ(ము) విశాల గగనము;
భావగీతులు ఇంద్రధనుసులు;
కన్నె కన్నుల భరిణలందున
విరియు వన్నెలు వీక్షణమ్ముల
                        అను రాగసదనము
                             రాధ హృదయము;       ||

నిరతమూ శ్రీ క్రిష్ణ యోచన, చింతన;
మరుని శరమున పూవుటమ్ములు
రతికి కురుల తావి ఎగయగ
తురుము మదనుడు తన్మయముతో
                   శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
                        రాగసదనము  రాధ హృదయము"> || 

Wednesday, July 4, 2012

వకుళము- "పొగడ చెట్టు", 200 years old


వకుళము- అంటే "పొగడ చెట్టు".
ఈ పాదపమునకు పూచే పూలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి.
శ్రీ వేంకటేశుని పెంచిన జనని "వకుళ మాల",
సువాసనభరితములైన వకుళ మాలలను ధరిస్తుందని జన వాణి.
హిందీ, సంస్కృతాది భాషలలో "bakul" అని పేరు.
200 ఏళ్ళ నాటి చెట్టు ఈ ఫొటోలోనిది.

హుగ్లీ మండలములోని ( మిత్రబటి)అంత్ పూర్ మార్గములో ఒక చెట్టు ఉన్నది.
;
వకుళము / పొగడ చెట్టు
;
ఆ "బకుల్ వృక్షం" 
200 సంవత్సరాల వయస్సు ఉన్నదని అంచనా.

Antpur, Hooghly (Mitra Bati)  : link here!


*********************************,
ఆలయాలలో ఎక్కువగా-  "పొగడ చెట్లు" పెంచుతారు.

మంగళ గిరి మున్నగు పుణ్యక్షేత్రములలో శివరాత్రి ఉత్సాహ సందర్భములలో
(గంగా భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి)
పరమేశుని పొగడ చెట్టు వాహన ఊరేగింపును భక్తులు నిర్వహిస్తూంటారు.