Friday, July 6, 2012

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు


"హిందూ మతము"- అనే పదముకంటే
"హిందూ సంప్రదాయము" అని
చెబుతేనే బాగా నప్పుతుంది.
ఆచార, సంప్రదాయాలు, ప్రకృతితో అనుసంధానిస్తూ-
ఒక మతముగా రూపొందిన అద్భుత  వైనము-
ఈ పుణ్యభూమి- లోనే సాధ్యమైనది.
ఆర్యభూమిలో అతి ప్రాచీన కాలమునుండీ అనేకమంది
సమాజశ్రేయస్సు గూర్చి పరితపిస్తూ అనేక ఆలోచనలు చేసారు.
కాలానుగుణముగా- అవి పరిణామము చెందుతూ,
పరిణతి చెందిన "హిందూమతము" గా ప్రజలు రూపు దిద్దుకున్నారు.
ఆ ఘన చారిత్రక ఆవిష్కరణయే - హిందూ మతము-
కేవలము మతముగానే కాక,
చతుష్షష్ఠి కళల సమామ్నాయమై తనను తాను ప్రౌఢీకరించుకున్నది.
ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధమే "కలిమి" గా కల హైందవమును-
నా శక్తి పరిధిలో-  వ్యాసీకరించే ప్రయత్నమిది.

                      ************************;

తిరుపత్తిరిపులియూర్:- ఈ ఊరికి, అలాగే ఊరిలోని కోవెలకు -
ఆ పేరు రావడానికి వ్యుత్పత్తి ఒకటి ఉన్నది.
"తిరు+పాదిరి+పులియూర్" అనే పదములు ఆధారము.
శ్రీ + పాటల + పులి- ఊరు -  కొన్ని సంఘటనల ద్వారా
ఈ మాటలకు స్థల నామార్హత ఏర్పడినది.
పాటలీశ్వరుని దేవాలయము  "తిరుపత్తిరిపులియూర్"
(Sri Padaleeswarar Temple,Thirupathiripuliyur) లో  ఉన్నది .
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఈ కోవెల విశిష్టమైనది.
7 వ శతాబ్దికి పూర్వమే కట్టిన అతి ప్రాచీనమైనది పాటలీశ్వరుని దేవాలయము.
ఉమాదేవి  1008 పుణ్యతీర్ధాలను దర్శించుకున్నది. ఈ పావనదేశమును చేరినది ఉమాదేవి.
పెద్ద పదిరి చెట్టు (పాటలీ తరువు) ఛాయలో వెలసి ఉన్న మహా శివ మూర్తిని ఆమె వీక్షించినది.
అచట భవుని మూర్తి ప్రతిష్ఠించబడినది.
పాటలీ పాదపము నీడలో ప్రభవించినందున "పాటలీశ్వర స్వామి" అని పేరు పొందాడు.
దేవాలయమునందు 5 సువిశాల నడవాలు ఉన్నవి. మే- జూన్ లలో వైకాశి నెలలో-
బ్రహ్మోత్సములు జరుగుతూంటాయి. ఐదవ కారిడార్ ని  "రాజ వీధి"
అనగా రాయల్ స్ట్రీట్ (royal street) అని పిలుస్తారు.

                   ************************;

పాటలీశ్వరుని దేవాలయము:-   ఈ క్షేత్రమున స్థల వృక్షము పాదిరి చెట్టు ( Pathiri Tree).
మధ్య నందన ఋషి గొప్ప పరమేశ భక్తుడు.
శివపూజకు పూసిన పుష్పాలను కోసుకోవడానికని-
పాదిరి చెట్టును ఎక్కడానికి - అ ఋషికి చాలా కష్ట సాధ్యమయేది.
పాటలీశుని అర్చనకై- ప్రతి రోజూ-
ఈ వ్యాయామము వంటి పని
క్లిష్టతరమవగా
"పాడలీసా! నాకు పులి కాళ్ళును ఇవ్వు" అని వేడాడు.
సత్వర వరానుగ్రహాన్ని పొందాడు. పులి పంజాలను పోలిన పాదములను పొంది,
పూజావిధులను నిరాటంకముగా సులువుగా చేసుకోగలిగాడు.
ఆ మహా ఋషి చరణ యుగములచేత -
"పులి"-  కూడా జత కలిసినది.
(Pathiri Tree); అటు తర్వాత వ్యాఘ్ర పాదములను వరముగా పొందినట్టి
Madyanandana Rishi పేరు కూడా జత ఐ,
ఈ ఊరికి - "తిరు పదిరి పులియూర్" అనే నామమును పొందినది.
నయనానందమును కలిగించే గుడి, పరిసరాలు ఉన్న ప్రదేశము  "Thirrupathiripuliyur".

ముఖ్య ట్యాగ్ పదములు:-
Thirupathiripuliyur in Cuddalore, Sri Padaleeswarar Temple

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు ;

No comments:

Post a Comment