Tuesday, October 2, 2018

శర్వాణీ గిరికన్య హిమ పుత్రి

గిరికన్య హిమ పుత్రి, జగదీశుని అర్ధాంగి ; 
వర్ణింతుము నీ మహిమలు, సాంగోపాంగముగా ; 
తల్లి, వర్ణింతుము నీ మహిమలు సాంగోపాంగముగా ;  || 

క్షణములన్ని గిరగిరా, యుగములెన్నొ చరచరా ; 
కాలములను కొలుచునమ్మ నీదు వీక్షణం ;  || 

కాలములకు అతీతము, కారుణ్య భావము ; 
నీదు కారుణ్య భావ పూర్ణ మాతృ ప్రేమ పుష్కలం ;  || 

బుద్ధి మప్పితము లొసగుము నీ బిడ్డలకు ; 
రస భావములను తొణుకును నీదు కరుణ భావము ; 
నవ రస భావములను తొణుకును నీదు కరుణ శర్వాణీ ;  ||
=========================; ;
;
pATa - 
girikanya hima putri ; jagadeeSuni ardhaamgi ; 
warNimtumu, nee mahimalu, saamgOpAmgamugA ; 
talli, warNimtumu, nee mahimalu ; 
saamgOpAmgamugA ;;  || 
;
kshaNamulanni giragiraa ; 
yugamulenno caracaraa ; 
kaalamulanu kolucunamma 
needu weekshaNam ;; 
kaalamulaku ateetamu ; kaaruNya BAwamu ;
needu kaaruNya BAwa puurNa మాతృ ప్రేమ పుష్కలం ;
needu maatR bhaawamu ; 
needu maatR prEma pushkalam ;;  || 

buddhi mappitamu losagumu nee biDDalaku ; 
nawa rasa bhaawamula toNuku ; needu karuNa SarwANI :  ||
;
Bhakti Ranjani = భక్తిరంజని ;

కార్వేటి శ్రీవేణు గోపాలుడు

విహారములు, విహారములు, ;
వాహినిలో విహారములు, ;
పూల తేరు నావ నెక్కి, 
రాధికాకృష్ణుల  మధు విహారములు ;  ||
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;  
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; 
ప్రతి యోచన లాలిత్యం, నూత్న సురభిళ పుష్పం ; 
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;

పూల తెప్ప - రాధాకృష్ణులు

పల్లవి ;- 
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
రాగాల తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
హరివిల్లుల తులమానిని ; ఆయెనమ్మ చిన్ని పడవ ;  ||
;
ప్రణయ వేణు మధు గీతికా యుగళం - 
గాధా పరిచంక్రమణం ; 
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; ప్రతి యోచన 
లాలిత్యం ; నూత్న సురభిళ పుష్పం ;  ||
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;

శ్రీరంగనాధునికి నిత్య వైభోగమే

వైభవమే ఇది - శ్రీరంగశాయికి ;
నిత్య వైభోగమే, అంగ రంగ వైభోగమే ;
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; || 
;
అంగనామణులెల్ల వైభవముగాను ;
అంగ రంగ వైభవమ్ముగాను ;
రంగారుబంగారు చందనాల ; 
లేపనములను రంగరంచి ; 
మేనెల్ల నిలువెల్ల పూయండి చనువార ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
మైపూత పూయండి, ఓ లలనలారా ;
లేపనము లలమండి, చెలులార - చెలువముగా -
దండిగా మెండుగా, అలదండి - చెలులార ;
సౌగంధ కస్తూరికా లేపనములను ; 
స్వామివారికి అలదండి ప్రేమ మీర ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
చెన్నకేశవుని మేన, చెలువార, చనువు మీర ;
పరిమళం వ్యాపింప, పునుగు, జవ్వదులు ; 
చిత్రములు వేసేను - చిత్రాలు చేసేను ;
పూయండి - తనివార చెలులార, ఓ వనితలారా ;
రంగనాధునికి, మన శ్రీరంగనాధునికి ; ||
;
==================; ;
;
waibhawamE idi - SreeramgaSAyiki ;
nitya waibhOgamE, amga ramga waibhOgamE ;  ||
;
amganaamaNulella waibhawamugaanu ;
amga ramga waibhawamugaanu ;
ramgaaru bamgaaru camdanaala ; 
lEpanamulanu ramgarimci ;
mEnella puuyamDi, O lalanalaara ; 
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
maipuuta puuyamDi, O lalanalaara ; 
lEpanamu lalamamDi,  celulaara celuwamuga ;
damDigaa memDugaa - aladamDi celulaara ;
saugamdha kastuurikaa lEpanamu lalamamDi ;
swaamiwaariki aladamDi prEma meera ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
cennakESawuni mEna - celulaara celuwamuga ;
parimaLam wyaapimpa, punugu, jawwadulu ; 
citramulu wEsEnu - citraalu cEsEnu ; 
puuyamDi taniwaara, O wanitalaara ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||

ఎవడనుకున్నావో, వేణు గోపాలుడు నా పేరు - సారంగపాణి పదాలు

చిటికె వేసితే నీవంటి ; చెలులు లచ్చ పది వేలే 2 ; 
వెదు/టుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ;
వెటుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ;  || 
;
అందగత్తె వనుచు వలచినందుకే ; అలమి కౌగిటను చేర్చేవా ; 
గంద మలది విరులు సిగను జుట్టి, కర్పుర  బాగాలిచ్చేవా 2 ;;
బంగరు కమ్మలు కదలగ రాగము - పాడి వీణ/ ణె  వాయించేవా ; 2 ; 
మంది మేళమున ఏ మాటాడక  - నందనతొ పొద్దులు పుచ్చేవా ;  || 
;
సరిగె పైట దిగ్గున తొలగించి ; చనులు/ జల్లు అంట నిచ్చేవా ; 
అరమర సేయక చక్కెర కెమ్మోవార నిచ్చి లాలించేవా ;; 2 ; ;;        
మరుని భయము నీకెందుకు వలదని ; మనసు తెలిసి నడిపించేవా ; 2 ;
తరి ఇది కాదు, ఇంటికి రమ్మని - తలుపు మూసి, గడె వేయించేవా ;  || 
;
సారంగపాణీ పదాలు ; 
సారంగపాణి పదాలు = 
saramgapani padamulu ; 

Monday, October 1, 2018

మౌనము సైతం మధువీణయే ఆయెను

మౌనము కూడా మధువీణ అయె ;
మానస మందిరమున మార్మ్రోగును ;
క్రిష్ణ మురళి గానము ; ;  ||
పదే పదే ;
మది మందిరమందున ;
క్రిష్ణ మురళి గానము ;
;
ప్రతి ఊహయు, స్వరజతి యగు ;
శృతిని కూర్చుకొనుచుండును ;
మేనులోని అణువణువుయు ;  ||
============================; ;
;
 maunamu kUDA madhuweeNa aye ;
maanasa mamdiramuna maarmrOgunu ;
krishNa muraLi gaanamu ; ;  ||

padE padE ;
madi mamdiramamduna ;
krishNa muraLi gaanamu ;
;
prati uuhayu, swarajati yagu ;
SRtini kuurcukonucumDunu ;
mEnulOni aNuwaNuwuyu ;  ||

జగన్మోహన - రాగ సుధ

రాగ సుధారసము గ్రోలుము ; 
జగన్ మోహన - రాగ సుధారసము గ్రోలుము ;
పరవశమున రాధికకు ;
వాడుకతో పదే పదే - అదే మాట వేడుక ;
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||
;
అనవరతము రాగ సుధల  ;
కురిపిపించు నామము ;
ప్రేమమూర్తి నామము ; 
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||
;
మేనెల్లా మెరుపులయే ;
అనుభూతి నామము ;
ప్రేమమూర్తి నామము ; 
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||

============ ; ;
;
raaga sudhaarasamu grOlumu ; 
jagan mOhana 
raaga sudhaarasamu grOlumu ;
parawaSamuna raadhikaku ;
wADukatO padE padE ; 
adE mATa wEDuka ;
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||
;
anawaratamu raaga sudhala  ;
kuripimcu nAmamu ;
prEmamuurti nAmamu ; 
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||
;
mEnellaa merupulayE ;
anubhuuti nAmamu ;
prEmamuurti nAmamu ; 
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||

ముగ్గుకర్ర కొలత - వనిత జడ

ముగ్గు కఱ్ఱ కొలత కొరకు ; 
వేరె వెదుకులాట ఏల, గోపీ! నీదు - 
బారు జడయె చాలు నిదిగో భామినీ ;
అనుచు లాగి పట్టె ముద్దులొలుకు కృష్ణ ; 
లాగి పట్టె నిటుల ముద్దు కృష్ణ ; 

muggu ka~r~ra kolata koraku ; 
wEre wedukulaaTa Ela, gOpee! needu - 
baaru jaDaye caalu nidigO BAminee ;
anucu laagi paTTe mudduloluku kRshNa ; 
laagi paTTe niTula muddu kRshNa ; 

చూడామణీ, కౌస్తుభ హారములు యశోదమ్మ వేసింది

ఆటలకు వేళాయెరా! పాటలకు వేళాయెరా! 
మురిపాల క్రిష్ణయ్య! రావయ్య వేగమే! ;  ||
;
కస్తూరి, గంధములు నీ మేనంత అలదింది
చూడామణీ, కౌస్తుభ హారములు వేసింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
నెమలీక సిగలోన ముడిచి సింగారించింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
మా నందనందనా - వేగమే రావయ్య! 
ఆనంద మోహనా. క్రిష్ణయ్య! రావయ్య! ;  || 

నీ షోకులు, ఠీకులు - పల్లెను మరిచేవు

నీ షోకు ఠీకుల - పల్లెను మరిచేవు ;
మా వ్రేపల్లెను మరిచేవు - మరి చాలు! చాలును! ;  ||
;
అద్దమున నీ మోము అందాలు - చూచుకొనుచూ
అట్టె నిలిచేవు - మరి మరీ మురిసేవు!
గారాలివే! వేలు ! మరి ఇంక చాలును ! గోపాల! ;
;
కొలను తన ఒడలంత అద్దముగ చేసెరా,
నీరాడు ఆటలకు నీ రాక కోసమై !
జల క్రీడ లాడేటి నీ స్పర్శ కోసమై!
నీరాజనము లొసగ - మై దర్పణము చేసి,
వేచేను ఆ యమున - వేగ రావోయీ !
మా ముద్దు గోపాల! మురిపాల బాలకా! ;  || 
;

ఇన్ని హంగులు, ఎడారి కూడా నందనవనియే

కృష్ణా కృష్ణా శ్రీకృష్ణా - 
మదనమోహనా, శ్రీకృష్ణ  ;
వేణువూదవోయి 2 ;
||పాట నీది, ఆట నాది ; 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
పూవులు పూవులు, 
పూవుల తావులు ; 
పూలతోటి తేటులు - 
పరుగెత్తుకు వచ్చినవి ; 
నీవు నిలిచినట్టి తావు - బృందావనమే, 
నవ  బృందావనమే ; 
||పాట నీది, ఆట నాది ; 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
గానలోలిని, నెలత రాధిక; 
రాగ తన్మయి దృక్కుల ;
రాగ డోలలు వెలసినవి ;
అనురాగ డోలలు వెలసినవి ; 
;
ఇన్ని హంగులు సమకూరగనే ; 
ఎడారి కూడా నందనవనియే ; 
మురళీ కృష్ణా, వేణువూదుము ;  
||పాట నీది, ఆట నాది ; 
నిఖిల లోకమే - ఉభయుల రంగవేదిక, 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
==================; ,
;
kRshNaa kRshNaa SrIkRshNaa - 
madanamOhanaa, SreekRshNa  ;
wENuwuudawOyi 2 ;
||paaTa needi, ATa naadi ; 
kRshNaa, muraLi nuudawOyee ||
;
puuwulu puuwulu, 
puuwula taawulu ; puulatOTi tETulu - 
parugettuku waccinawi ; 
neewu nilicinaTTi taawu - 
bRmdaawanamE, nawa  bRmdaawanamE ;
||paaTa needi, ATa naadi ; 
kRshNaa, muraLi nuudawOyee||

gaanalOlini, nelata raadhika; 
raaga tanmayi dRkkula ;
raaga DOlalu welasinawi ;
anuraaga DOlalu welasinawi ; 
;
inni hamgulu samakuuraganE ; 
eDaari kUDA nandanawaniyE ; 
muraLee kRshNaa, wENuwuudumu ;  
||paaTa needi, ATa naadi ; 
nikhila lOkamE ubhayula ramgawEdika, 
kRshNaa, muraLi nuudawOyi|| 
;
 God Krisha songs