చిటికె వేసితే నీవంటి ; చెలులు లచ్చ పది వేలే 2 ;
వెదు/టుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ;
వెటుకు లాడి ఎవడనుకున్నావో - వేణు గోపాలుడు నా పేరు ; ||
;
అందగత్తె వనుచు వలచినందుకే ; అలమి కౌగిటను చేర్చేవా ;
గంద మలది విరులు సిగను జుట్టి, కర్పుర బాగాలిచ్చేవా 2 ;;
బంగరు కమ్మలు కదలగ రాగము - పాడి వీణ/ ణె వాయించేవా ; 2 ;
మంది మేళమున ఏ మాటాడక - నందనతొ పొద్దులు పుచ్చేవా ; ||
;
సరిగె పైట దిగ్గున తొలగించి ; చనులు/ జల్లు అంట నిచ్చేవా ;
అరమర సేయక చక్కెర కెమ్మోవార నిచ్చి లాలించేవా ;; 2 ; ;;
మరుని భయము నీకెందుకు వలదని ; మనసు తెలిసి నడిపించేవా ; 2 ;
తరి ఇది కాదు, ఇంటికి రమ్మని - తలుపు మూసి, గడె వేయించేవా ; ||
;
సారంగపాణీ పదాలు ;
సారంగపాణి పదాలు =
saramgapani padamulu ;
No comments:
Post a Comment