Tuesday, October 2, 2018

శ్రీరంగనాధునికి నిత్య వైభోగమే

వైభవమే ఇది - శ్రీరంగశాయికి ;
నిత్య వైభోగమే, అంగ రంగ వైభోగమే ;
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; || 
;
అంగనామణులెల్ల వైభవముగాను ;
అంగ రంగ వైభవమ్ముగాను ;
రంగారుబంగారు చందనాల ; 
లేపనములను రంగరంచి ; 
మేనెల్ల నిలువెల్ల పూయండి చనువార ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
మైపూత పూయండి, ఓ లలనలారా ;
లేపనము లలమండి, చెలులార - చెలువముగా -
దండిగా మెండుగా, అలదండి - చెలులార ;
సౌగంధ కస్తూరికా లేపనములను ; 
స్వామివారికి అలదండి ప్రేమ మీర ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
చెన్నకేశవుని మేన, చెలువార, చనువు మీర ;
పరిమళం వ్యాపింప, పునుగు, జవ్వదులు ; 
చిత్రములు వేసేను - చిత్రాలు చేసేను ;
పూయండి - తనివార చెలులార, ఓ వనితలారా ;
రంగనాధునికి, మన శ్రీరంగనాధునికి ; ||
;
==================; ;
;
waibhawamE idi - SreeramgaSAyiki ;
nitya waibhOgamE, amga ramga waibhOgamE ;  ||
;
amganaamaNulella waibhawamugaanu ;
amga ramga waibhawamugaanu ;
ramgaaru bamgaaru camdanaala ; 
lEpanamulanu ramgarimci ;
mEnella puuyamDi, O lalanalaara ; 
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
maipuuta puuyamDi, O lalanalaara ; 
lEpanamu lalamamDi,  celulaara celuwamuga ;
damDigaa memDugaa - aladamDi celulaara ;
saugamdha kastuurikaa lEpanamu lalamamDi ;
swaamiwaariki aladamDi prEma meera ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
cennakESawuni mEna - celulaara celuwamuga ;
parimaLam wyaapimpa, punugu, jawwadulu ; 
citramulu wEsEnu - citraalu cEsEnu ; 
puuyamDi taniwaara, O wanitalaara ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||

No comments:

Post a Comment