Wednesday, May 31, 2017

పోటా పోటీగా పౌర్ణమి

ఆ సొగసులు, మిలమిలలు - 
నింపుకున్న కన్నుదోయి - 
ఎవ్వరివమ్మా? ఎవ్వరివమ్మా? -
ఇంకెవ్వరివంటావు, రాధికవమ్మా! 
అవి మన మన రాధికవమ్మా! ; || 
;
నిడుపాటి కురులు ; కుంతలమ్ముల - 
; బందీ ఐనది పెను చీకటి ; 
నిశి కింత గొప్ప శరణు దొరికినదని - 
ఈసు చెందె పున్నమి ; || 
;
పోటీగా, పోటా పోటీగా ఆ పౌర్ణమి -
; అయ్యింది చాందినీ ; 
తెలి కన్నులందున దూరినది వెన్నెల ; || 
;
అంతటి ఈర్ష్య , అసూయలు - 
తెలుపు, నలుపు వర్ణాలకు పరిమితమా, అని 
తలచిినవి మెరుపులు;
మిన్ను మెరుపు చమక్కులు, తళతళలు - 
రాధ వీక్షణములందున చేరినవి ; ||
;
రాధామనోహర ;

No comments:

Post a Comment